Shakila: ఆఫ్టర్ బిగ్‌బాస్ అతడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న షకీలా.. వీడియో వైరల్!

బిగ్ బాస్ తెలుగు 7 షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ తెగ ఎంటర్ టైన్ చేసిన వీళ్లలో షకీలా ఒకరు. ఒకప్పుడు తన అందంతో సినీ రంగాన్ని షేక్ చేసిన ఈమె.. బిగ్ బాస్ షోలో పాల్గొంది. రెండో వారంలోనే ఎలిమినేట్ అయిపోయిన ఈమె ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. కానీ తాజాగా ఓఅబ్బాయితో కనిపించింది. అతడితో కలిసి ఎంజాయ్ చేసింది. ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేయండి.

బిగ్ బాస్ తెలుగు 7 షోలో పాల్గొన్న షకీలా.. రెండో వారమే ఎలిమినేట్ అయిపోయింది. ఆ పద్నాలుగు రోజుల్లోనే టేస్టీ తేజకు చాలా దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ. కేవలం అతడికే కాకుండా మరికొంత మంది కంటెస్టెంట్లతో కూడా చాలా సంతోషంగా గడిపింది. అయితే రెండో వారమే ఎలిమినేట్ అయిపోయిన ఆమె ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షోకు కూడా రాలేకపోయింది. ఆ తర్వాత జరిగిన మరో పార్టీలోనూ కనిపించలేదు. కానీ తాజాగా ఓ కుర్రాడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.

Actress Shakila Enjoying With Bigg Boss Telugu 7 Contestant After Bigg Boss Show

ఆ అబ్బాయి మరెవరో కాదు టేస్టీ తేజ. బిగ్ బాస్ షోలో తోటి కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె అతడికి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈక్రమంలోనే తనకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించింది. తాను ఇప్పటి వరకు ఎందుకు పెల్లి చేసుకోలేదో కూడా చెప్పింది. ముఖ్యంగా తాను కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానని క్లారిటీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులే తనను ఒంటరి దాన్ని చేశారని... అలా ఇప్పుడు ఒంటరిగా గడుపుతున్నానని వెల్లడించింది.

ముఖ్యంగా తనకు 34 ఏళ్ల వయసు ఉండగా తల్లి చనిపోయిందని... అంతకు ముందు తల్లి తరచుగా కుటుంబం కోసం తనను సినిమాలు చేయమనేది అని షకీలా చెప్పుకొచ్చింది. అలాగే తల్లి చనిపోయిన తర్వాత కొంత కాలానికే తన అన్నయ్య చనిపోవడంతో.. వారి కుటుంబ బాధ్యతలను తాను తీసుకున్నానని వివరించింది. డబ్బులు ఇవ్వాలే కానీ ఆ పిల్లల్ని తన దగ్గర ఉంచకూడదని వాళ్ల వదిన తరఫు వాళ్ల గొడవ చేశారని అలా వాళ్లు దూరం అయ్యారని స్పష్టం చేసింది. ఇక ఆ తర్వాత తన అక్క కూడా దూరం అయిందని.. అలా ఇప్పుడు ఒంటరిగా మారానని పేర్కొంది.

Actress Shakila Enjoying With Bigg Boss Telugu 7 Contestant After Bigg Boss Show

ప్రస్తుతం ఇంట్లో ఒక్కతే ఉంటున్నప్పటికీ.. చాలా మందికి తాను సాయం చేస్తుందని టేస్టీ తేజ చెప్పాడు. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్లకు షెల్టర్ ఇవ్వడం.. వారిని పోషించడం, కొందరికి పెళ్లిళ్లు చేసివ్వడం.. వాళ్లందరికీ తల్లిగా తాను బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా అనిపిస్తుందని వివరించింది. ప్రస్తుతం ఇలా చాలా హాయిగా గడుపుతున్నానని బిగ్ బాస్ షోకు రావడం తనకు చాలా హ్యాపీగా అనిపించిందని కూడా తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X