»   » బిగ్‌బాస్‌2లో లేను.. అన్నీ గాసిప్సే.. స్నేహ.. రాయ్ లక్ష్మీ, రంభ ఖండన!

బిగ్‌బాస్‌2లో లేను.. అన్నీ గాసిప్సే.. స్నేహ.. రాయ్ లక్ష్మీ, రంభ ఖండన!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    దక్షిణాదిలో బిగ్‌బాస్ రియాలిటీ షో జోష్ పెరిగింది. తెలుగు రెండో సీజన్ ప్రారంభం కాగా, తమిళ భాషల్లో ఈ నెల 16 నుంచి ఆరంభం అవుతున్నది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో హోస్ట్‌గా నేచురల్ స్టార్ నాని వ్యవహరిస్తుండగా, తమిళంలో తొలి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కమల్ హాసన్ రెండో సీజన్‌కు కొనసాగడం గమనార్హం. ఈ రెండో భాషల్లో వస్తున్న బిగ్‌బాస్ కార్యక్రమానికి సంబంధించి హీరోయిన్లపై ఆసక్తికరమైన విషయాలు మీడియాలో ప్రచారం అవుతున్నాయి.

    తమిళ భాషలో వివాదాలు

    తమిళ భాషలో వివాదాలు

    తెలుగులో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేకుండా నిరాడంబరంగా కొనసాగుతున్నది. కానీ తమిళంలో ఆరంభానికి ముందే అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి. కంటెస్టంట్ల పేర్లపై ఊహాగానాలు కొనసాగుతుండటం వల్ల స్వయంగా సెలబ్రిటీలే రంగంలోకి దిగి వివరణ ఇస్తున్నారు.

    బిగ్‌బాస్‌లో నటి స్నేహ

    తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్‌లో హీరోయిన్ స్నేహ పేరు ప్రముఖంగా వినిపించింది. స్నేహ బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. నేను బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పాల్గొనడం లేదు. నా గురించి వస్తున్న వార్తలన్నీ రూమర్లే. ప్రస్తుతం నేను సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా గురించి ఏదైనా రాసే ముందు మీడియా నాతో సంప్రదించి ఉంటే బాగుండు అని స్నేహ ట్వీట్ చేశారు.

    రాయ్ లక్ష్మీ తెరపైకి

    రాయ్ లక్ష్మీ తెరపైకి

    ఇదిలా ఉంటే, రెండో సీజన్‌లో రాయ్ లక్ష్మీ కూడా పాల్గొంటున్నారనే వార్తలు తమిళ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో స్వయంగా రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో స్వయంగా ప్రకటన చేయాల్సి వచ్చింది. దాంతో రాయ్ లక్ష్మీ వార్తలకు బ్రేక్ పడ్డాయి.

     రంభ గురించి గాసిప్స్

    రంభ గురించి గాసిప్స్

    స్నేహ, రాయ్‌లక్ష్మీలతో బిగ్‌బాస్ రూమర్లు ఆగిపోలేదు. గ్లామర్ క్వీన్ రంభ కూడా తమిళ బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే రంభ మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు బయటకు రావడంతో గాసిప్స్‌కు తెరపడ్డాయి.

    English summary
    Television reality show Bigg Boss Tamil seems to be back with the second season. While there have been numerous speculation on the contestants in the controversial reality show Bigg Boss Tamil, the makers are tight lipped on the same. Actress Sneha has also been rumoured to be a part of the show that is set to start from June 16.
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more