74 తులాల బంగారం చోరీ కేసులో గీతూ రాయల్.. నోటిదూలకు గట్టి సమాధానం చెప్పిన నటి!
బిగ్ బాస్ బ్యూటీ గీతూ రాయల్, గలాటా గీతూ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బిగ్ బాస్ షోపై రీవ్యూలు చేసే ఈమె ఆ తర్వాత జబర్దస్త్ షోకు వెళ్లడం, ఆపై బిగ్ బాస్ కు వెళ్లడంతో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే తాజాగా గీతూ చేసిన ఓ వీడియోతో.. సమస్యలో ఇరుక్కింది. ముఖ్యంగా నటి సౌమ్య శెట్టి మానవ హక్కుల కమీషన్ లో గీతూపై ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా 74 తులాల బంగారం చోరీ కేసులో గీతూ రాయల్, యాంకర్ ధనుష్ లపై పరువు నష్టం దావా కేసు వేసింది. ఆ విశేషాలు అంటో మన ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొంత కాలం క్రితం నటి సౌమ్య శెట్టి.. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మౌనిక ఇంట్లో 74 తులాల బంగారం చోరీ చేసినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈమెపై పోలీసులు కేసు పెట్టి జైల్లో పెట్టారు. అయితే తాజాగా బెయిల్ పై బయటకు వచ్చి నటి సౌమ్య శెట్టి.. గీతూ రాయల్ తో పాటు యాంకర్ ధనుష్ లపై కేసు పెట్టింది. తన గురించి తప్పుగా మాట్లాడారని.. పూర్తిగా వివరాలు తెలియకపోయినా నోటికి వచ్చినట్లు మాట్లాడారంటూ చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా నటి సౌమ్య శెట్టి అరెస్ట్ అయినప్పుడు.. గీతూ రాయల్, యాంకర్ ధనుష్ లు ఓ వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టారు. ఇటీవలే వారిద్దరి కాంబోలో స్టార్ట్ చేసిన ఓ ఛానెల్ లో ఈ కేసు గురించి తమకు తెలిసిన విషయాలు చెప్పారు. ముఖ్యంగా మౌనిక గీతూ స్నేహితురాలు అని.. యాంకర్ ధనుష్ కు సౌమ్య శెట్టి ముఖ పరిచయం ఉందని చెప్పి వాళ్లకు తెల్సిన వాళ్లు చెప్పిన విషయాలను వివరించారు. నటి సౌమ్య శెట్టి మౌనిక వాళ్ల ఇంటికి వెళ్లి బాత్రూం వస్తుందని, మోషన్స్ అయ్యాయని చెప్పి బెడ్ రూంలోకి వెళ్లి బంగారం చోరీ చేసినట్లు చెప్పారు.
అయితే గంటసేపు గదిలోనే ఉన్న సౌమ్య శెట్టి.. డ్రెస్ మార్చుకుని మరీ బంగారం చోరీ చేసిందంటూ వెల్లడించారు. అయితే ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే తాజాగా నటి సౌమ్య శెట్టి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇక అప్పటి నుంచి తాను దొంగను కాదని.. మౌనిక చేయమని చెబితేనే ఇదంతా చేశానంటూ వివరిస్తుంది. ముఖ్యంగా మౌనికను ఓ అబ్బాయి వేధిస్తున్నాడని.. మౌనిక న్యూడ్ వీడియోలు అతడి దగ్గర పెట్టుకుని డబ్బులు కావాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని స్పష్టం చేసింది.
అయితే అప్పటికే పెళ్లై భర్త, కూతురు ఉన్న మౌనిక.. ఈ సమస్య నుంచి బయట పడేందుకు తనను సాయం చేయమని కోరిందని సౌమ్య శెట్టి వివరించింది. ఈక్రమంలోనే తన ఇంట్లోని బంగారం ఇచ్చి అమ్మి పెట్టి డబ్బులు చేయాలని వాటిని ఇస్తే తాను ఈ సమస్య నుంచి బయట పడతానని బతిమాలినట్లు వివరించింది. కానీ ఇంట్లో విషయం తెలియగానే మౌనిక తనపై దొంగతనం కేసు పెట్టి.. తన తండ్రి పొలిటికల్ ఇన్ ఫ్లూయెన్స్ తో తనను జైల్లో పెట్టించిందని పేర్కొంది. అలాగే తన గురించి ఏమీ తెలియకుండా గీతూ రాయల్, యాంకర్ ధనుష్ లు చేసిన కామెంట్లను తాను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వివరించింది.
అందుకే వారిద్దరిపై.. మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసినట్లు నటి సౌమ్య శెట్టి వెల్లడించింది. పరువు నష్టం దావా కేసు పెట్టినట్లు వివరించింది. ఇలా తమ నోటి దూలతో... డబ్బులు సంపాధించేందుకు వీడియో చేసిన గీతూ రాయల్, యాంకర్ ధనుష్ లు ఈ సమస్యలో ఇరుక్కున్నారు. మరి వాళ్లు ఈ కేసు నుంచి ఎలా బయటపడతారో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











