Sreeleela: బ్రెయిన్ తింటానన్న శ్రీలీల.. అతనంటే చాలా భయం.. ఆమె అందంపై షాకింగ్ కామెంట్స్
అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అందాల సుందరి శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ పెళ్లి సందD చిత్రంతో మోస్ట్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో ఆమెకు వరుసగా సినీ అవకాశాలు చెంత చేరాయి. ప్రస్తుతం బాలకృష్ణ, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది శ్రీలీల. అంతేకాకుండా ఆమె చేతిలో 7 భారీ చిత్రాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బ్రెయిన్ తింటానని, ఒక వ్యక్తి అంటే చాలా భయమని తెలిపింది.
గ్రాండ్ ఫినాలేలో:ముద్దుగుమ్మ శ్రీలీల తాజాగా ఢీ 15 ఛాంపియన్ షిప్ బ్యాటిల్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ ఫైనల్ ఎపిసోడ్ మే 31న ప్రసారం అయింది. అయితే ఈ ఎపిసోడ్ లో శ్రీలీల డ్యాన్స్ చేసి అదరగొట్టింది. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు శ్రీలీల వస్తుందని చెబితే.. వారికి నచ్చిన ప్రశ్నలు పంపించారు. వాటిలో బెస్ట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేశామని ప్రదీప్ తెలిపాడు.

ఇవ్వట్లేదు కదా:అలాగే మేము ఒక స్పెషల్ మెషిన్ కనిపెట్టాం. మేము అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు మనసులో అనుకుంటే చాలు. మా మెషిన్ కనిపెట్టేస్తుంది. అది కరెక్ట్ కాకుంటే మీరు చెప్పండి. అదే మీ ఆన్సర్ అయితే మీరు ఒప్పేసుకున్నట్టే. ఇంకో ఆప్షన్ లేదు అని ప్రదీప్ అంటాడు. అంతే కదండి. మీరు ఇవ్వట్లేదు కదండి అని శ్రీలీల నవ్వుతూ చెప్పింది.

ఒప్పుకోకుండా ఉండాలి:మీరు ఎక్కువగా ఇష్టపడి తినే ఐటమ్ ఏంటీ అని ప్రదీప్ అడిగాడు. అప్పుడు ప్రొజెక్టర్ పై బ్రెయిన్ కనిపించింది. అది చూసి షాక్ అయింది శ్రీలీల. ఎవరెవరు బుర్రలు తింటుంటారు. రెగ్యులర్ గా మీ మెను ఎలా ఉంటుందని ప్రదీప్ అంటే.. కలిసిన వాళ్లది అని శ్రీలల అంటుంది. అంటే ఇది కరెక్ట్ ఆన్సరేనా అని ప్రదీప్ అనడంతో.. అయ్యో ఒప్పుకోకుండా ఉండాల్సింది అని శ్రీలీల చేతితో మొహం మూసుకుంది.

దానికి రియాక్షన్ :మీ మెనూ ఎలా ఉంటుందని ప్రదీప్ మళ్లీ అడిగితే.. మార్నింగ్ అమ్మ బ్రెయిన్. మధ్యాహ్నాం డైరెక్టర్స్ బ్రెయిన్. ఈవెనింగ్ నెక్ట్స్ డైరెక్టర్స్ బ్రెయిన్. నైట్ అమ్మ బ్రెయిన్ అని శ్రీలీల చెప్పింది. బ్రెయిన్ తింటూ చాలా బిజీగా ఉంటారు మీరు అమ్మో అని ప్రదీప్ అన్నాడు. పొద్దున లేవగానే అద్దంలో మిమ్మల్ని చూసుకుంటే మీ రియాక్షన్ ఏంటీ అని ప్రదీప్ అడిగాడు. అప్పుడు ఎట్టా పుట్టావురా ఇంత అందంగా అని రవితేజ డైలాగ్ వీడియో ప్లే చేశారు.

బయటకు చెప్పొద్దు:అలాగే అనుకుంటారా అని ప్రదీప్ అడిగితే.. అయ్యే నేను అంతా.. మనమే అందంగా అని ఏం అనుకోనని శ్రీలీల అంది. దానికి అద్దంలో చూసుకుని శ్రీలీల.. ఏంటే ఈ లీల అని బాగోలేదన్నట్లుగా ఎక్స్ ప్రెషన్స్ తో ప్రదీప్ అన్నాడు. మీరు ఢీ సెట్ లోకి రాగానే ఎవరిని చూసి భయమేసింది, చిరాకు వేసి కంగారు పడింది అని ప్రదీప్ అడిగాడు. నేను ఈ ఆన్సర్ బయటకు చెప్పొద్దు అనుకుంటున్నానండి అని శ్రీలీల అంది.
ఆది అంకుల్ అంటూ:సరే కళ్లు మూసుకోండి అని ప్రదీప్ అంటాడు. అప్పుడు హైపర్ ఆది ఫొటో కనిపిస్తుంది. అది చూసి హేయ్.. కరెక్ట్ అన్నట్లుగా శ్రీలీల ఎక్స్ ప్రెషన్ బాగుంది. నిజానికి నేను మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా ఫీలయ్యాను ఆది గారు. జెన్యూన్ గా వెరీ స్వీట్ పర్సన్. ఐ రెస్పెక్ట్ యు అని శ్రీలీల అంది. థ్యాంక్యూ ఆది అంకుల్ అని ప్రదీప్ అంటే.. శ్రీలీల కూడా ఆది అంకుల్ అని పిలిచి కామెడీ చేసింది.


Click it and Unblock the Notifications











