లేటు వయసులో ప్రెగ్నెన్సీ.. ఫిజికల్‌గా, మెంటల్‌గా అంటూ.. ‘వదినమ్మ’ సుజిత ఎమోషనల్..
వదినమ్మ సీరియల్‌తో ప్రతీ ఇంటిలో కుటుంబ సభ్యురాలిగా మారిన నటి సుజిత పరిచయం కొత్తగా అవసరం లేదు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరిగా అందరికి సుపరిచితులు. బాలనటిగా చిరంజీవి, బాలకృష్ణ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వదినమ్మగా అందర్ని ఆలరిస్తున్న ఈ టాలెంటెడ్ నటి తాజాగా తన అభిప్రాయాలను, అనుభవాలను వెల్లడిస్తూ.. .

భాష నాకు సమస్య కాలేదు..
వాస్తవానికి నేను మలయాళీనైనా తెలుగులో రాణించడం అంత కష్టంగా లేదు. నేను బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాను. చిన్నతనంలోనే మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించా. అలాగే నందమూరి బాలకృష్ణతో కూడా యాక్టింగ్ చేశాను. కాబట్టి నాకు చిన్నతనం నుంచే సినిమా వాతావరణం అలవాటైంది. బాల్యం నుంచే తెలుగును అర్ధం చేసుకోవడం, రాయడం తెలుసు. కాబట్టి తెలుగులో పనిచేయడం కష్టం కాలేదు అని సుజిత అన్నారు.

వదినమ్మ సీరియల్ గుర్తింపుతో
వదినమ్మ సీరియల్ నాకు బాగా గుర్తింపునిచ్చింది. సీత క్యారెక్టర్ నాకు ఎంతో ఇష్టం. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ వదినమ్మ అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. రెండు, మూడు ఏళ్ల వయసు వాళ్ల నుంచి 60 ఏళ్లకుపైబడిన వాళ్లు నన్ను వదినమ్మ అని పిలుస్తుంటే ఆ పాత్ర ఏ రేంజ్‌లో ప్రతీ ఒక్కరిపై ముద్ర వేసిందనే విషయం అర్ధం అవుతున్నది అని సుజిత్ తెలిపారు.

ప్రతీ ఇంట్లో ఓ వదినమ్మగా మారిపోయాను
వదినమ్మ సీరియల్‌లో సీత పాత్ర ద్వారా ప్రతీ ఇంట్లో వదినమ్మగా మారిపోయాను. ఈ క్యారెక్టర్ చాలా బాగుంది. ప్రస్తుతం సాగుతున్న ఎపిసోడ్స్‌లో నేను ప్రెగ్నెంట్‌ని. లేటు వయసులో ప్రెగ్నెంట్ అనేది సెన్సిటివ్ విషయం. లేట్ ప్రెగ్నెన్సీ అనే విషయం ఇప్పుడు రావడం చాలా మందికి ఒక హోప్ ఇచ్చినట్టే. ఆ సీన్‌ను నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఫిజికల్‌గానే కాకుండా మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి అని సుజిత్ పేర్కొన్నారు.

వదినమ్మ అంటే అంతటి సహనం ఉండాలి
వదినమ్మ సీరియల్‌కు ముందు ఇందులో నటించే వారు ఎవరూ పరిచయం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభాకర్ పరిచయం అయ్యారు. అంతకు ముందు రాజేశ్ నాకు పరిచయం. వదినమ్మకు మరోపేరు భూమాత అని చెబుతాను. ఎందుకంటే భూమికి ఉన్నంత ఓర్పు, సహనం వదినమ్మకు ఉంది. కానీ నిజ జీవితంలో వదినమ్మకు సుజిత్‌కు ఎలాంటి పోలీకలు లేవు అని సుజిత అన్నారు.
Recommended Video

ప్రభాకర్ అల్లరితో అందరికీ ఫన్
వదినమ్మ సీరియల్ టీమ్‌లో అందరూ మంచివాళ్లే. ఫన్‌గా, హ్యాపీగా సీరియల్ షూటింగు సాగిపోతుంది. షూటింగ్‌లో ఎక్కువ అల్లరి, కామెడీ, పంచులు ప్రభాకర్ వేస్తుంటారు. ఆయన చేసే అల్లరి అంతా ఇంతా కాదు. యూనిట్ సభ్యుల సహకారం ఫెంటాస్టిక్‌గా ఉంటుంది అని సుజిత్ తెలిపారు.


Click it and Unblock the Notifications











