విడాకుల దిశగా మరో టీవీ సెలబ్రిటీ.. తిండి కూడా తిననివ్వడం లేదట!

ఈ మధ్య కాలంలో వారూ వీరు అని కాకుండా దాదాపు అన్ని చోట్లా విడాకుల కేసులు బాగా ఎక్కువయ్యాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీల వరుస విడాకులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో నాగచైతన్య- సమంత మొదలు బాలీవుడ్లో అమీర్ ఖాన్ - కిరణ్ రావు అంటూ చూసుకుంటే అన్ని పరిశ్రమల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. ఇప్పుడు హిందీ గ్లామర్ ఫీల్డులో మరో జంట విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

గృహ హింస కేసు

గృహ హింస కేసు

స్మాల్ స్క్రీన్‌పై తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన నటి సురభి తివారీ నిజ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. 'ఘర్ జమై', 'శ్రీ గణేష్', 'షగున్', 'నాలే జనమ్ మోహే బితియా హి కిజో', 'దో దిల్ బంధే ఏక్ దోరీ సే' వంటి హిందీ సీరియల్స్‌లో నటించి అలరించిన సురభి తన భర్త సిన్హా నుండి విడాకులు తీసుకోబోతోంది. నిజానికి, సురభి తన భర్త, అత్తగారు అలాగే భర్త సోదరిపై గృహ హింస కేసు కూడా పెట్టింది.

2019లో

2019లో

నిజానికి 2019లో పైలట్ కం వ్యాపారవేత్త ప్రవీణ్ కుమార్ సిన్హాని సురభి తివారీ పెళ్లాడింది. ఇప్పుడు మూడు సంవత్సరాల తరువాత ఆమె విడాకులిప్పించాలని పిటిషన్ దాఖలు చేసింది. ప్రవీణ్ అతని కుటుంబీకులు తనపై గృహ హింసకు పాల్పడ్డారని కూడా సురభి ఆరోపించింది. మీడియాతో మాట్లాడుతూ సురభి తమ వివాహం తర్వాత విషయాలు మరింత దిగజారాయని వెల్లడించింది. ప్రవీణ్‌కు కుటుంబ జీవితంపై ఆసక్తి లేదని ఆమె ఆరోపించారు.

కట్నం తిరిగి ఇవ్వాలని

కట్నం తిరిగి ఇవ్వాలని

పెళ్లి తర్వాత, ప్రవీణ్ నేను ఒకేలా లేమని నేను గ్రహించాను. ప్రవీణ్ ముందు నాతో ముంబైలో నివసించడానికి అంగీకరించాడు, కాని తరువాత అతను ముంబైకి రావడానికి నిరాకరించాడు. నేను నటనను కొనసాగించాలనుకున్నాను. కానీ అది జరగలేదు. ఫలితంగా, నేను అతనిపై ఆర్థికంగా ఆధారపడ్డాను, డబ్బు కోసం చాలా కష్టపడ్డానని ఆమె పేర్కొంది. సురభి తివారీ మాట్లాడుతూ, 'నేను ప్రవీణ్, అతని తల్లి మరియు సోదరిపై గృహ హింస అలాగే బెదిరింపుల కేసు పెట్టాను. దీనితో పాటు, నేను ఇచ్చిన కట్నం కూడా తిరిగి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశాను.

ఒత్తిడిలో ఉంటాడని

ఒత్తిడిలో ఉంటాడని

బతుకుదెరువు కోసం నగలు అమ్ముకోవాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు. నేను చాలా బాధపడ్డ తర్వాత కూడా, స్నేహపూర్వకంగా విడిపోవాలని అనుకున్నాను. అయితే, ప్రవీణ్ నాకు విడాకులు ఇవ్వనని, దాని కోసం నేను కోర్టుకు వెళ్లవచ్చని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అతనిపై న్యాయపరమైన మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నాను. నేను త్వరలో విడాకుల కోసం దాఖలు చేస్తానని ఆమె పేర్కొన్నారు. పెళ్లయిన తర్వాత ప్రవీణ్ బిడ్డను కనేందుకు నిరాకరించాడని, ఆ సమయంలో ప్రవీణ్ ఒత్తిడిలో ఉంటాడని అనుకున్నాను, తర్వాత అంతా బాగానే ఉంటుందని అనుకున్నానని అన్నారు.

పేపర్‌పై రాసివ్వమని

పేపర్‌పై రాసివ్వమని

అయితే తర్వాత ప్రవీణ్ నా స్నేహితులను డబ్బు అడగడం ద్వారా ఏదైనా వ్యాపారం ప్రారంభించమని నన్ను చాలా సార్లు కోరాడు, నేను నిరాకరించానని ఆమె అన్నారు. బాడీ షేమింగ్ చేస్తూ నా ఆహారం, పానీయాలను కూడా నిషేధించడానికి ప్రయత్నించాడని, ఒకసారి ఎయిర్‌పోర్ట్‌లో ఏదైనా తినడానికి నాకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడని అన్నారు. ప్రవీణ్ తల్లి నన్ను రాజకీయాల్లోకి వెళ్లమని ప్రోత్సహిస్తూనే ఎన్నికల ప్రచారంలో మేం మీ దగ్గర కట్నం తీసుకోలేదని పేపర్‌పై రాసివ్వమని బలవంతం చేసిందని ఆమె పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X