సిగ్గున్నొడు ఎవడైనా బిగ్ బాస్ కు వెళ్తాడా.. నేను బాధితురాలిని..
బిగ్‌బాస్ రియాల్టీ షో క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లి తెరప్రేక్షకలను ఎంటర్టైమెంట్ అందిస్తున్న షో. అయితే.. ఈ షోలో అడుగుపెట్టి దుమ్మురేపిన వారు.. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారని, కంటెస్టెంట్సే కాదు.. టైటిల్ విన్నర్స్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. సరైన అవకాశాలు అందుకోలేకపోతున్నారు. ఈ జాబితాలో నిలిచింది ఓ నటి. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో తన గ్లామర్‌తో హౌస్‌లో రచ్చ చేసింది. ఆ షో వల్ల తనకు ఎక్కడ లేని ఫేమ్ వస్తుందని భావించింది. కానీ, ఎనలేని నెగిటివిటీ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరు?
అమ్మడు ఎవరో కాదు.. తేజస్వి మదివాడ. తెలుగు అమ్మాయే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీలో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్ బాబు - వెంకటేష్‌లు కలిసి నటించిన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంతకు కజిన్‌గా నటించి, అందర్నీ అలరించింది తేజస్వీ. తర్వాత మనం, హార్ట్ అటాక్ వంటి సినిమాల్లో కూడా నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ కళ్లలో పడిన ఆమె.. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీమ్ సినిమా ద్వారా తొలిసారిగా హీరోయిన్‌గా నటించే అవకాశం కొట్టేసింది.

తాజాగా తేజస్వి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ రియాల్టీ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం మాత్రమే తెలుసు అని, అలా మాట్లాడడమే ఇతరులకు గుచ్చుకుంటుందని నటి తేజస్వి అన్నారు. బిగ్ బాస్ సీజన్ 2 లో తనపై ప్రాపగాండా ప్రకారం తన క్యారెక్టర్ ను బ్యాడ్ గా పొట్రేట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు పాడవడానికి బిగ్బాస్ సీజన్ కారణమమనీ, ఆ విషయాన్ని తాను అంగీకరించడానికి చాలా రోజులు పట్టిందని, అసలు జనాలు నా గురించి అలా ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది చాలా బాధపడ్డామని తెలిపారు.
వాస్తవానికి ఒక్కసారి జనాలలో బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చాక దాన్ని మార్చడం అసాధ్యమని, అలా తన క్యారెక్టర్ ను బ్యాడ్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే తనపై వచ్చిన బ్యాడ్ ఇంప్రెషన్ మార్చాలనుకోవడం లేదని, జనాలు ఎలా ఆలోచిస్తే అలా ఆలోచించనివ్వండి అని తేజస్వి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను మెంటల్ టార్చర్ తట్టుకోలేక పిచ్చి పీక్స్ చేరింది. పొరపాటున బూతు పదం వచ్చేసిందని తేజస్వి తెలిపారు. అయినా తానేంటో తనకు తెలుసుననీ, తన ఫ్రెండ్స్‌కి తెలుసునని చెప్పారు. బిగ్‌బాస్ నుంచి వచ్చిన రెండేళ్ల వరకు తాను ఖాళీగా ఉన్నానని.. అక్కడ సంపాదించిన డబ్బుతోనే కాలం గడిపేశానని ఆమె తెలిపారు. ప్రేమించిన అబ్బాయితోనూ బ్రేకప్ జరిగిందని, చివరికి పెళ్లి క్యాన్సిల్ చేశానని తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరోసారి బిగ్ బాస్ లోకి వెళ్తారా అని యాంకర్ ప్రశ్నించగా.. తాను పాల్గొన్న షో మాత్రమే చూసానని తర్వాత ఆ షో ను పట్టించుకోవడమే లేదని, సిగ్గు ఉన్నోడు ఎవడైనా మరోసారి బిగ్ బాస్ షోలోకి వెళ్తారా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. నన్ను పర్సనల్‌గా కలిసి, నాతో టైమ్ స్పెండ్ చేసి.. తానంటే అనేది జడ్జిమెంట్ ఇస్తే తాను వింటానని, టీవీలోనో, ఏదో థంబ్‌నైల్ చూసి నా క్యారెక్టర్ చెబుతానంటే ఎలా ఊరుకుంటానని తేజస్వి పేర్కొన్నారు. బిగ్ బాస్ లో తనని పోర్ట్ రేట్ చేసిన విధానం తనని బాధించిందని, అశోక్ వల్ల తాను చాలా బాధపడ్డానని, ఒకరకంగా చెప్పాలంటే తాను కూడా ఓ బాధితురాలని నటి తేజస్వి తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











