హైపర్ ఆదితో నా రిలేషన్ అదే.. వర్షిణి క్లారిటీ
బుల్లితెరపై హైపర్ ఆది, యంగ్ బ్యూటీ వర్షిణి ఎంతటి క్రేజ్ దక్కించుకున్నారో తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోతో హైపర్ ఆది తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. తన టాలెంట్ తో తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకున్నారు. ఇక వర్షిణి పటాస్ 2 కామెడీ షోకు కో హోస్ట్ గా వ్యవహరించి టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది. తన బ్యూటీ, యాంకరింగ్ స్కిల్స్ తో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకునే ప్రయత్నం చేసింది. ఇక వీరిద్దరు కలిసి ఢీ, జబర్దస్త్, కామెడీ స్టార్స్ వంటి షోల్లో సందడి చేశారు. దాంతో వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు వచ్చాయి. దానిపై వర్షిణి ఇలా క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
టీవీ రంగంలో సంచలనంగా..
హైపర్ ఆది పేరు వ చెబితే తెలియని వారంటూ ఉండరు. అధిరే అభి ద్వారా జబర్దస్త్ షోకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన టాలెంట్ తో, వాక్ చాతుర్యంతో మెప్పించారు. పంచుల వర్షం కురిపించి టీవీ రంగంలో సంచలనంగా మారారు. ముఖ్యంగా తన డైలాగ్ రైటింగ్స్, పంచులు ప్రాసాలు రాసే తీరు, అప్డేట్ అవుతూ సోషల్ సెటైర్స్ చేయడంలో ఆయన దిట్ట. దాంతో టీవీ షోల్లో ఆయనకు మంచి డిమాండ్ ఉండింది. మరోవైపు సినిమాల్లోనూ తనకు భారీ ఆఫర్లు అందుతున్న సంగతి తెలిసిందే. దశాబ్దానికి పై బుల్లితెరపై సెన్సేషన్ గా మారారు.

హీరోయిన్ గా ఆఫర్స్..
ఇక వర్షిణి బుల్లితెరపై పలు టీవీ షోల్లోనే కాకుండా సినిమాల్లోనూ నటిగా అవకాశాలు అందుకుంది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వర్షిణి తొలుత మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఓయూలో పీజీ కంప్లీట్ చేసిన ఈమె తన ప్యాషన్ సినీ రంగంలోనే అని నిర్ణయించుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత నటిగా అవకాశాలు అందుకుంది. పార్లల్ గా టీవీ షోల్లోనూ సందడి చేస్తూ వచ్చింది. 2014 నుంచి వర్షిణి సినీ పరిశ్రమలోనూ, ఇటు టెలివిజన్ రంగంలోనూ యాక్టివ్ గా కనిపిస్తోంది. తనకు వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటూ వస్తోంది. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.
హైపర్ ఆదితో లవ్..
యంగ్ బ్యూటీ వర్షిణి బుల్లితెరపై పలు షోల్లో మెరిసింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మరింతగా ప్రేక్షకులను అలరించ గలిగింది. అందులోనూ హైపర్ ఆదితో ఆమె చేసిన స్కిట్లు బాగా పేలాయి. అలాగే ఢీ, కామెడీ స్టార్స్ వంటి షోల్లోనూ హైపర్ ఆదితో కలిసి సందడి చేసింది. ఈ క్రమంలో హైపర్ ఆది ఎప్పుడూ వర్షిణిపై పంచులు వేస్తుండటం, వీరి మధ్య క్లోజ్ నెస్ ఎక్కువ కనిపించడంతో లవ్ ట్రాక్ కొనసాగుతోందని అందరూ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి.
ఆది బర్త్ డే సందర్భంగా వర్షిణి సౌందర్య రాజన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ వీడియోలో వర్షిణి, ఆది క్లోజ్‌గా, సన్నిహితంగా ఉండటంతో వారిద్దరి మధ్య అఫైర్ రూమర్లు గుప్పుమన్నాయి. దాని గురించి వర్షిణి వివరణ ఇస్తూ.. హైపర్ ఆది బర్త్ డే సందర్భంగా కలిశాం. బర్త్ డే రోజున కాకుండా రెండు రోజుల తర్వాత కలిశాం. ఆది నైస్ పర్సన్. ఇండస్ట్రీలో నాకు తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో ఆది ఒకరు. లోపల నెగిటివి ఉండదు. అలాంటి వాళ్లతోనే ఫ్రెండ్ షిప్ చేస్తాను. నాకు ఆదికి మంచి రిలేషన్ ఉంది. నా ముందు ఒకలాగా, నా వెనుక చెడుగా మాట్లాడే వాళ్లంటే నాకు ఇష్టం ఉండదు. నేను లేకపోయినా నా గురించి చెడుగా మాట్లాడడు. అందుకే ఆదితో నా రిలేషన్ స్పెషల్ అని వర్షిణి చెప్పింది.


Click it and Unblock the Notifications











