పబ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన బుల్లితెర నటి? దిమ్మతిరిగేలా హీరోయిన్ కౌంటర్
స్టార్ మాలో శ్రీముఖి హోస్ట్‌గా ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతివారం కొత్త కొత్త థీమ్‌లతో సరికొత్తగా ముస్తాబవుతోంది ఈ కార్యక్రమం. బుల్లితెర సెలబ్రిటీలతో శ్రీముఖి ఆడించే ఆటా పాటా, పంచ్‌లు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. అయితే గత వారం జరిగిన షోలో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత వారం లేడీ ఆర్టిస్టులతో కిట్టి పార్టీ అనే థీమ్‌తో ఆటలు ఆడించారు శ్రీముఖి. దీనిలో భాగంగా సోషల్ మీడియాలో బుల్లితెర సెలబ్రిటీలపై వచ్చిన రూమర్స్‌ను ప్రదర్శించారు. ఈ క్రమంలోనే తెలుగు బుల్లితెరపై హీరోయిన్‌గా దూసుకెళ్తోన్న సుహాసిని గురించి ఓ న్యూస్ బయటపెట్టింది శ్రీముఖి. ఈ వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లాకు చెందిన సుహాసినినీ ఇండస్ట్రీలో జూనియర్ సుహాసిని అని పిలుస్తారు. నెల్లూరులో చదువు పూర్తి చేసిన అనంతరం సినిమాలలో అవకాశాల కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది. దర్శకురాలు బీ జీయ దర్శకత్వంలో దాదాపు 20 ఏళ్ల క్రితం 2003లో చంటిగాడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది సుహాసిని. ఈ సినిమా బాగానే ఆడటంతో ఈమెకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. తెలుగులో కంటే తమిళం నుంచి ఆఫర్లు పోటెత్తాయి. పలువురు పెద్దల సలహాలు, సూచనలతో ఆమె తన కెరీర్‌ను బాగానే ప్లాన్ చేసుకుంది.

ఆ తర్వాత సుందరానికీ తొందరెక్కువ, కోకిల, గణ, ఆదివారం ఆడవాళ్లకు సెలవు, భూకైలాస్, లక్ష్మీ కళ్యాణం, పాండు రంగడు, పున్నమీ నాగు, అడ్డా, రఫ్ తదితర చిత్రాలలో హీరోయిన్‌గా, సహాయ నటిగా నటించారు సుహాసిని. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, భోజ్‌పురి, ఇంగ్లీష్ సినిమాలలో నటించింది. అయితే సినిమాలలో అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. తగిన గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు సీరియల్స్‌తో అలరిస్తున్నారు.
తొలుత తమిళంలో శివశంకరి సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ నటిగా దూసుకెళ్తోంది. అపరంజి, అనుబంధాలు, అష్టాచెమ్మా, ఇద్దరు అమ్మాయిలు, నా కోడలు బంగారం, గిరిజా కళ్యాణం, దేవత, మామగారు. శ్రీహరి కళ్యాణం తదితర సీరియల్స్‌లో నటించింది. స్టార్ మాలో ప్రసారమైన మామగారు సీరియల్ ఈమెకు ఇటీవల మంచి పేరు తీసుకొచ్చింది. సీరియల్స్‌లో నటించడంతో పాటు కొన్ని ధారావాహికలను స్వయంగా నిర్మించింది ఈ ముద్దుగుమ్మ.
సీరియల్స్‌తో పాటు బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేస్తోంది సుహాసిని. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో పాల్గొన్న సుహాసినినీ మీ జీవితంలో వచ్చిన పెద్ద రూమర్ ఏంటీ? అని శ్రీముఖి ప్రశ్నించింది. దానికి సుహాసిని స్పందిస్తూ.. సోషల్ మీడియాలో ఒకరోజు సుహాసిని పబ్‌లో ఏం చేసిందో తెలుసా? అనే వార్త వచ్చిందని చెప్పింది. దీనికి శ్రీముఖి స్పందిస్తూ... అసలు నువ్వు పబ్‌కి వెళ్లే రకమే కాదని విషయం నాకు తెలుసు అని చెప్పింది. అయితే పబ్‌కి ఫ్రెండ్స్‌తో అప్పుడప్పుడు వెళ్తానని సుహాసిని చెప్పబోతుండగా శ్రీముఖి షాక్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications