సంక్రాంతి కానుకగా టీవీలో ‘అత్తారింటికి దారేది’?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని మాటీవీ వారు భారీ మొత్తం చెల్లించి శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారీ విజయం సాధిస్తుందని ముందుగానే ఊహించి రికార్డు రేటుకు కొనుగోలు చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వారు సంక్రాంతి కానుకగా టీవీల్లో ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ఈ మేరకు ఇప్పటి నుండే మాటీవీ వారు మార్కెటింగ్ ప్లానింగ్‌కు సిద్ధమవుతున్నారని, భారీగా ప్రకటనల రూపంలో ఆదాయం గడిచేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్, పైగా పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కాబట్టి తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ రానంత టీఆర్పీ రేటింగులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

జనవరి 4తోనే సినిమా 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. అయితే అప్పుడే సినిమాను టీవీలో ప్రసారం చేస్తారా? లేదా? అనేదిపై ఇంకా క్లారిటీ రాలేదు. మాటీవీ వారి నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనలు వెలువడలేదు. మరి మున్ముందు అందుకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెడతారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.
నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











