twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అత్తారింటికి దారేది’బుల్లితెర డేట్ ఫిక్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం'అత్తారింటికి దారేది'. రిలీజైన రోజు నుంచి కలెక్షన్స్ దుమ్ము రేపిన ఈ చిత్రం త్వరలో బుల్లితెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించనుంది. మాటీవి వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని 2014 సంక్రాంతి స్పెషల్ గా వేయనున్నారని సమాచారం.

    దాదాపు తొమ్మిది కోట్లు వరకూ ఈ రైట్స్ కోసం వెచ్చించినట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడింది. ఈ సినిమాకు వచ్చే టీఆర్పిలు,వాటి ద్వారా వచ్చే యాడ్స్ తో బాగా లాభపడే అవకాసం ఉందని టీవీ వర్గాలల్లో చెప్పుకుంటున్నారు. జనవరి 4 వ తేదికి ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంటుంది. వంద రోజులు పూర్తి చేసుకున్న పది రోజుల్లోనే టీవీలో వస్తూండటంతో ఓ రేంజిలో టీఆర్పీలు వచ్చే అవకాసాలు ఉన్నాయి.

    AD on small screen for Sankranthi

    చిత్రం నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ మాట్లాడుతూ... ''ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే. క్లిష్టసమయంలో పవన్‌, త్రివిక్రమ్‌లు అండగా నిలబడ్డారు. పైరసీకి గురైనా.. రికార్డు వసూళ్లు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా వంద కోట్లు సాధిస్తుందా? అని అందరూ అడుగుతున్నారు. ఆ మైలు రాయిని చేరుకొనే అవకాశాలున్నాయి. తెలుగు సినీ చరిత్రలో 'మగధీర' ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. ఆ చిత్ర నిర్మాణంలో నేను భాగస్వామిని. ఇప్పుడు 'అత్తారింటికి దారేది' కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాకీ నేనే నిర్మాతను. ఇలా రెండు మేటి చిత్రాల్లో భాగం పంచుకొన్నందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.

    సమంత మాట్లాడుతూ ''యాభై రోజుల్లో సాధించాల్సిన వసూళ్లు ఇరవై అయిదు రోజుల్లోనే దక్కాయి. ఇంత మంచి సినిమాలో అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. నేను పవన్‌ కల్యాణ్‌ అభిమానిని. ఆయనతో పనిచేయడం ఆనందంగా అనిపించింది. ఇటీవల కృతజ్ఞతల సభలో పవన్‌ నన్ను మెచ్చుకొన్నారు. అదే పెద్ద అవార్డుగా భావిస్తున్నా. పవన్‌, త్రివిక్రమ్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.. ఈ ముగ్గురూ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది'' అని చెప్పింది.

    పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    English summary
    Pawan Kalyan and ace director Trivikram Srinivas celluloid wonder “Attarintiki Daredhi” created sensation at box- office. Now, surprising news to all, get ready to watch this history created film on small screen soon. Exciting news is that MAA TV bought this film satellite rights for a whooping amount of Rs.9 crores and the television authorities are planned to telecast this film in January, 2014 as Sankranthi special.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X