Hyper Aadi అందుకే వెళ్లిపోయాడు.. జబర్దస్త్ షో గురించి అదిరే అభి కామెంట్స్ వైరల్

జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపును అందుకున్న కమెడియన్స్ లలో అదిరే అభి ఒకరు. గత 16 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న అభి సినిమాల ద్వారా అంతగా క్రేజ్ అయితే రాలేదు. ఎప్పుడైతే టెలివిజన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడో అప్పుడు మంచి గుర్తింపు లభించింది. జబర్దస్త్ ద్వారా సక్సెస్ అయిన అదిరే అభి మరి కొంతమందికి కూడా మంచి అవకాశాలను ఇచ్చాడు. అభి ద్వారా సక్సెస్ అయిన వారిలో హైపర్ ఆది కూడా ఉన్నాడు. అయితే వీరు విడిపోవడానికి గల కారణం పై ఇటీవల ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

ఇష్టమైన సినీరంగంలో

ఇష్టమైన సినీరంగంలో

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభి కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా చేశాడు. అయితే అది అంతగా నచ్చలేదు అని మళ్ళీ తనకు ఇష్టమైన సినీరంగంలో సత్తా చాటాలని అనుకున్నాడు. ఈ ప్రయత్నంలో అతనికి టెలివిజన్ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. కొన్ని డాన్స్ షోలతో కూడా కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్నాడు. అదుర్స్ చేస్తున్న సమయంలోనే అతనికి జబర్దస్త్ లో అవకాశం లభించింది.

బాహుబలి సినిమా కోసం..

బాహుబలి సినిమా కోసం..

అభి ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్స్ లో ఒకటిగా కనిపించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా అవి బాహుబలి సినిమాకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు. ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలో అతను ప్రభాస్ తో కూడా చాలా క్లోజ్ గా తిరిగేవాడు. అంతేకాకుండా సినిమాలో సుబ్బారాజుతో కలిసి ఒక చిన్న సన్నివేశంలో కూడా నటించిన విషయం తెలిసిందే.

ఆ విషయంలో ప్రశంసలు

ఆ విషయంలో ప్రశంసలు

అయితే అదిరే అభి జబర్దస్త్ షో ద్వారా మంచి సక్సెస్ అందుకున్న అనంతరం కొత్తవారికి చాలా ఎక్కువగా అవకాశాలు ఇచ్చాడు అని చెప్పాలి. అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో అవకాశాలు లేకుండా ఉన్న మరి కొందరికి కూడా తన స్కిట్ లో నటించే అవకాశం ఇచ్చాడు. ఆ విషయంలో అభికి చాలామంది నుంచి ప్రశంసలు అందాయి.

 అలా వచ్చిన హైపర్ ఆది

అలా వచ్చిన హైపర్ ఆది

ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్న వారిలో హైపర్ ఆది ఒకరు. అయితే అతను షో లోకి రావడానికి ముఖ్య కారణం అదిరే అభి. మొదట అభి గ్రూప్ లోనే కొనసాగుతూ వచ్చిన హైపర్ ఆది స్క్రిప్ట్ రైటర్ గా కూడా కొన్నాళ్ళు వర్క్ చేశాడు. అతను మొదట తనను ఫేస్బుక్ ద్వారా కాంటాక్ట్ అయ్యాడు అని షార్ట్ ఫిలిం చూసి ఒకసారి తన దగ్గరకు రమ్మని చెప్పినట్లుగా ఆది వివరణ ఇచ్చాడు.

మధ్యలో వస్తుండేవాడు..

మధ్యలో వస్తుండేవాడు..

మేము ప్రతి రోజు స్కిట్ చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి తనదైన శైలిలో కొన్ని సలహాలు ఇస్తూ ఉండేవాడు అని ఆ తర్వాత అతన్ని పనితనం నచ్చే స్క్రిప్ట్ రైటర్ కూడా పెట్టుకున్నట్లు తెలియజేశాడు. దీంతో ప్రతి రోజు అలా స్క్రిప్టు అద్భుతంగా రాస్తూ ఉండటంతో అతన్ని ఎందుకు ఖాళీగా ఉంచాలి అని మా టీంలో ఒక కమెడియన్ గా చేర్చుకున్నట్లు అభి వివరణ ఇచ్చాడు.

అందుకే అభి వెళ్లిపోయాడు

అందుకే అభి వెళ్లిపోయాడు

అయితే ఆది నా గ్రూప్ నుంచి బయటకు వెళ్లి మరో గ్రూపు పెట్టడానికి విభేదాలు ఏమి కారణం కాదు అని అభి అన్నాడు. జబర్దస్త్ దర్శకులు మరొక గ్రూప్ కావాలి అని అడగడంతో అప్పుడు ఆదిని సంప్రదించారు అంటూ నేను కూడా అతనికి ఆ సమయంలో ఫుల్ సపోర్ట్ చేశాను అని అన్నాడు. నా దగ్గర పనిచేసే వాళ్ళు ఎదిగితే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు. అంతే కాకుండా అతను సొంత టాలెంట్ తోనే ఇంతవరకు వచ్చాడు అని తాను చేసింది కేవలం కొంత సహాయం మాత్రమే అని అభి వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X