For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  |

  తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా సందడి చేస్తున్నారు. రోజుకొకరు అన్నట్లుగా ఈ రంగంలోకి అడుగు పెడుతుండడంతో పోటీ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మాత్రమే పోటీని తట్టుకుని నిలబడగలుగుతున్నారు. అలాంటి వారిలో గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లైనా అలా కనిపించని ఈ అమ్మడు.. బుల్లితెరపై దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తోంది.

  అదే సమయంలో సినిమాల్లోనూ సందడి చేస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం చేతి నిండా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అనసూయకు నెలలు అంటూ జబర్ధస్త్ కమెడియన్ అదిరే అభి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనికామె ఊహించని ఆన్సర్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే...

  జబర్ధస్త్‌తో మారిన అనసూయ కెరీర్

  జబర్ధస్త్‌తో మారిన అనసూయ కెరీర్

  అప్పుడెప్పుడో వచ్చిన 'నాగ' అనే సినిమాలో తళుక్కున మెరిసింది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత ప్రముఖ న్యూస్ చానెల్‌లో ప్రజెంటర్‌గానూ పని చేసింది. ఇలా పలు ఈవెంట్లను కూడా హోస్ట్ చేసింది. ఆ సమయంలోనే జబర్ధస్త్ షో ద్వారా బుల్లితెరపైకి యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిందామె. ఈ షోతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది.

  అప్పటి నుంచి తనదైన శైలి హోస్టింగ్‌తో అలరిస్తున్న ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా కెరీర్‌ను జబర్ధస్త్‌గా సాగిస్తూ రచ్చ చేసేస్తోంది.

  షర్ట్ మొత్తం విప్పేసి 'ఎవడు' హీరోయిన్ హాట్ షో: తల్లైన తర్వాత కూడా ఇంత ఘాటుగానా!

  సినిమాల్లోనూ సత్తా.. అలాంటి పాత్ర

  సినిమాల్లోనూ సత్తా.. అలాంటి పాత్ర

  యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా కాలం పాటు బుల్లితెరపై వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటింది అనసూయ భరద్వాజ్. ఈ క్రమంలోనే సినిమాల్లోకి సైతం ప్రవేశించి తనదైన శైలి యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది.

  'సోగ్గాడే చిన్ని నాయన'తో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత 'క్షణం', 'రంగస్థలం', 'యాత్ర', 'కథనం' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేసింది. ఈ క్రమంలోనే కొన్ని స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇలా వెండితెరపైనా హవాను చూపిస్తోంది. వీటన్నింటిలో రంగమ్మత్తగా అనసూయ చేసిన పాత్ర ఓ రేంజ్‌లో హైలైట్ అయిపోయింది.

  టాలీవుడ్‌లో అనసూయ హాట్ టాపిక్

  టాలీవుడ్‌లో అనసూయ హాట్ టాపిక్

  యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించిన తర్వాత చాలా కాలం పాటు టీవీ షోల మీదే అనసూయ భరద్వాజ్ ఫోకస్ చేసింది. అయితే, ఇప్పుడు మాత్రం సినిమాలనే చేయడానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల 'థ్యాంక్యూ బ్రదర్'తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. అలాగే, కృష్ణ వంశీ తెరకెక్కించిన 'రంగమార్తాండ'లోనూ నటించింది. వీటితో పాటు ఇప్పుడు సునీల్‌తో కలిసి 'వేదాంతం రాఘవయ్య', రవితేజ 'ఖిలాడీ', పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు', అల్లు అర్జున్ 'పుష్ప' వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది. తద్వారా టాలీవుడ్‌లో హవా చూపిస్తోంది.

  టాప్‌ తీసేసి హీరోయిన్ హాట్ సెల్ఫీ: పెళ్లైన తర్వాత కూడా అందాలు మొత్తం చూపించిందిగా!

  అందులో మాత్రం బిజీగా ఉంటోందిగా

  అందులో మాత్రం బిజీగా ఉంటోందిగా

  కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇండస్ట్రీలోకి రాకముందే ఆమె శశాంక్ భరద్వాజ్‌ను వివాహం చేసుకుంది. అంతేకాదు, ఇద్దరు బిడ్డల తల్లైన తర్వాతనే కెరీర్‌ను ఆరంభించింది. ఏజ్ బారైనా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోన్న ఈ బ్యూటీ.. తరచూ పొట్టి బట్టలు ధరించి కనిపిస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తోంది. దీంతో అనసూయను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. అలాగే, ట్రోల్స్ చేసే వాళ్లూ ఎక్కువయ్యారు.

   అనసూయ ప్రెగ్నెన్సీ... మళ్లీ హైలైట్‌

  అనసూయ ప్రెగ్నెన్సీ... మళ్లీ హైలైట్‌

  గతంలో అనసూయ భరద్వాజ్ ఓ ఇంటర్వ్యూలో 'నాకు ఇప్పుడు 35 ఏళ్లు. 40 సంవత్సరాలు వచ్చాక మరోసారి తల్లిని అవ్వాలని అనుకుంటున్నా. ఈ సారి నాకు పాపే కావాలి. తన కోసం నా సమయాన్నంతా కేటాయిస్తాను' అని చెప్పింది. తద్వారా త్వరలోనే తల్లి కాబోతానని స్పష్టం చేసింది.

  అప్పటి నుంచి ఆమె ప్రెగ్నెన్సీ గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జబర్ధస్త్‌ షోలో అనసూయ గర్భం దాల్చడంపై అదిరే అభి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆమె కూడా దీనిపై అందరి ముందే షాకింగ్‌గా ఆన్సర్ ఇచ్చేసింది.

  అషు రెడ్డి ప్రైవేటు పార్ట్‌ను చూపించిన ఆర్జీవీ: పవన్ కల్యాణ్‌ కోసం ఆమెను బుక్ చేసేశాడుగా!

  తొమ్మిదో నెల అంటూ షాకిచ్చాడుగా

  తొమ్మిదో నెల అంటూ షాకిచ్చాడుగా


  స్కిట్‌లో భాగం అదిరే అభి.. యాంకర్ అనసూయ భరద్వాజ్ సీటు దగ్గరకు వెళ్లి 'అనసూయ టైమ్‌కు అన్నం తిను.. పులుపు తినాలిని అనిపిస్తే నేను మామిడి పళ్లు.. అవీ ఇవీ పంపిస్తాను' అంటాడు. ఆ తర్వాత ఆమె భార్య క్యారెక్టర్ వేసిన అమ్మాయి వచ్చి 'ఏంటి అనసూయకు అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు' అని ప్రశ్నిస్తుంది. దీనికి అభి 'తొమ్మిదో నెల కదే' అని బదులిస్తాడు. అప్పుడామె 'ఏంటీ.. అనసూయకు మళ్లీ తొమ్మిదో నెలా' అని షాకై నోరెళ్లబెడుతుంది. దీంతో అభి 'ఇది సెప్టెంబర్ నెల.. అంటే అందరికీ తొమ్మిదో నెలే కదా' అంటూ ఊహించని ఆన్సర్ చెబుతాడు.

  Recommended Video

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ప్రెగ్నెన్సీపై అనసూయ క్లారిటీ ఇలా

  ప్రెగ్నెన్సీపై అనసూయ క్లారిటీ ఇలా

  జబర్ధస్త్ స్కిట్‌లో అదిరే అభి పులుపు తినాలనుందా? అని అడిగినప్పుడు అనసూయ భరద్వాజ్ 'దానికి ఇంకా చాలా టైముందిలే' అని ఆన్సర్ ఇచ్చింది. తద్వారా తాను మూడోసారి గర్భం దాల్చడానికి కొంత సమయం ఉందని పరోక్షంగా సమాధానం ఇచ్చింది. ఇక, షో నిర్వహకులు దీన్నే రెండు సార్లు రిపీట్ చేసి మరీ ప్లే చేశారు. ఈ స్కిట్‌లో అనసూయ భరద్వాజ్ మళ్లీ ప్రెగ్నెంట్ అవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమెనే స్వయంగా ఒప్పుకుంది. దీంతో ఆమె అభిమానులు శుభవార్త ఎప్పుడు చెబుతుందా అని ఇప్పటి నుంచే వేచి చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

  English summary
  Anchor Anasuya Bharadwaj Now Doing Jabardasth Show. In This Show Famous Comedian Adhire Abhi Did Sensational Comments on Anasuya Bharadwaj Pregnancy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X