ఎవరున్నా లేకున్నా జబర్దస్త్ నడుస్తుంది.. ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు.. అదిరే అభి కామెంట్స్

బుల్లితెరపై సంచనాలు నమోదు చేసిన కామెడీ షో జబర్దస్త్. ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉండగా.. అంతే స్థాయిలో వ్యతిరేకించే వారూ ఉన్నారు. ఈ షోలో అడల్ట్ కామెడీ మోతాదును మించిపోతోందని ఎన్నో విమర్శలు ఎదురైనా.. వాటన్నంటికి దాటుకుని అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతూ వస్తుంది. తాజాగా జబర్దస్త్ చుట్టు ఎన్నో రూమర్లు చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో వీటిపై అధిరే అభి ఓ చానెల్‌తో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు.

 జీవితాల్లో వెలుగు నింపిన జబర్దస్త్..

జీవితాల్లో వెలుగు నింపిన జబర్దస్త్..

నాగబాబుతో పాటు హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర.. ఇలా టీమ్‌లు, ఆర్టిస్టులు జబర్దస్త్‌తో పేరు, ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. యాంకర్ అనసూయ కూడా ఈ షో ద్వారానే హైలైట్ అయింది. అప్పటి వరకు ఎవరికీ తెలియని రష్మీకి కూడా ఓ బ్రాండ్ వ్యాల్యూను తీసుకొచ్చింది ఈ వేదికే. ఇలా ఎంతో మంది జీవితాల్లో వెలుగును నింపిన జబర్దస్త్ కనుమరుగువుతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

మనస్పర్ధలు వచ్చాయని రూమర్లు..

మనస్పర్ధలు వచ్చాయని రూమర్లు..

నిజానికి.. జబర్దస్త్ షో నుంచి దర్శకులు నితిన్, భరత్ వెళ్లిపోయిన తర్వాత నాగబాబు మొత్తం తానై చూసుకుంటున్నాడు. అయితే కొన్ని రోజులుగా రెమ్యునరేషన్ వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై జబర్దస్త్ స్కిట్స్‌లో టీం లీడర్స్ పంచ్‌లు వేసిన సంగతి తెలిసిందే. అయితే డైరెక్టర్ల విషయంలోనే విబేధాలు వచ్చాయని, రెమ్యూనరేషన్ కూడా మరో కారణమై ఉంటుందని అందుకు నాగబాబు, మరికొంత టీమ్ లీడర్లు జబర్దస్త్ షోను వీడారని ప్రచారం జరుగుతోంది.

 వర్గాలనేవీ లేవు..

వర్గాలనేవీ లేవు..

ఈ రూమర్లపై అధిరే అభి స్పందిస్తూ.. కుటుంబం అన్నాక చిన్న చిన్న చిన్న చిన్న మనస్పర్థలు వస్తాయని అన్నారు.. ఎక్కడున్నా మేమంతా ఒక్కటే ఫ్యామిలీ అని స్పష్టం చేశారు. మా దాంట్లో వర్గాలనేవీ లేవని, మేము విడిపోయామని వస్తోన్న రూమర్లలో నిజం లేదని అన్నాడు. డైరెక్టర్లు మారుతూ ఉంటారు.. మొదట్లో వేరే వాళ్లు ఉండేవారు.. ఇప్పుడు వేరే వాళ్లున్నారు.. మధ్యలో వెళ్లిపోవడం అంటే వాళ్లు ప్రమోషన్‌లో భాగంగానే వేరే చోటకు వెళ్లిపోతున్నారు తప్ప.. విడిపోయి వెళ్లడం లేదని అన్నాడు.

ఎవరు వెళ్లినా నడుస్తుంది..

ఎవరు వెళ్లినా నడుస్తుంది..

హైపర్ ఆది ఎక్కడికి వెళ్లడని.. అలా వస్తోన్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. ఎవరున్నా లేకపోయినా జబర్దస్త్ నడుస్తుందని, ఆది , అభి ఉన్నా లేకపోయినా.. జబర్దస్త్ అనేది షోకు ఉన్న ఆధరణ అని, ఆ షో కచ్చితంగా నడుస్తుందన్నారు.

Recommended Video

#Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again
ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు..

ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు..

జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లారని వస్తోన్న రూమర్లపై స్పందిస్తూ.. తాను ఇప్పుడు వాటి గురించి చర్చించలేను, స్పందించలేనని అన్నారు. అది ఆయనకు సంబంధించిన విషయమని ఆయన గురించి మాట్లాడేంత స్టేటస్ తనకు లేదని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X