ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నా.. హైపర్ ఆది వెన్నుపోటును గుర్తుకు తెచ్చుకున్న అభి
హైపర్ ఆదికి లైఫ్ ఇచ్చింది ఎవరనే విషయం అందరికీ తెలియకపోయినా.. జబర్దస్త్‌ను ఫాలో అయ్యే అందరికీ తెలుస్తోంది. తన లైఫ్ గురించి హైపర్ ఆది చెప్పిన ప్రతీసారి ఆ వ్యక్తి గురించి ప్రస్తావిస్తూనే ఉంటాడు. ఎక్కడో తనకు పిలిచి మరీ అవకాశమిచ్చిన వ్యక్తిని ఆది ఎప్పటికీ మరిచిపోలేనని చెబుతుంటాడు. జబర్దస్త్‌లో అధిరే అభి స్కిట్స్‌లో చిన్నగా అలా మొదలు పెట్టిన కెరీర్ వెండితెరపై నవ్వులు పూయిస్తూ, బుల్లితెరపై పంచ్‌ల రారాజుగా వెలిగిపోతున్నాడు. ఈ ప్రయాణంలో అభి అందించిన సాయం మరువలేనిదని హైపర్ అది ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు.

యూ ట్యూబ్ ద్వారా..
యూట్యూబ్‌లో టైంపాస్‌కు వీడియోలు చేసుకుంటూ ఉండే హైపర్ ఆదిలోని టాలెంట్‌ను అభి గుర్తించాడు. అత్తారింటికి దారేది స్పూఫ్ చూశాక అభియే ఆదిని సంప్రదించి అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి జబర్దస్త్‌లో ఆర్టిస్ట్‌గా, రైటర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు.

టీమ్ లీడర్ వరకు..
చిన్న కంటెస్టెంట్ నుంచి టాప్ లీడర్‌గా ఎదిగిన హైపర్ ఆది తీరు అందరికీ స్ఫూర్తివంతమైందే. ఒకానొక సమయంలో గురువును మించిన శిష్యుడి అనిపించుకున్నాడు. అభి కెరీర్ మందగించిన సమయంలో హైపర్ ఆది పీక్స్‌లో ఉన్నాడు. టీమ్ లీడర్‌గా ఫుల్ సక్సెస్‌లో ఉన్నాడు. ఇక అప్పుడప్పుడు అభి స్కిట్స్‌లో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చి హిట్ చేస్తాడు.

వెన్నుపోటు పంచ్‌లు..
హైపర్ ఆది, అభి కలిస్తే ఆ స్కిట్‌లో గతానికి సంబంధించిన విషయాలు కచ్చితంగా ఉంటాయి. వెన్నుపోటు పొడిచావ్ అంటూ అభి వేసే కౌంటర్స్, హైపర్ ఆది ఇచ్చే రియాక్షన్స్ అదిరిపోతూ ఉంటాయి. హైపర్ ఆది కెరీర్ పట్ల తాను సంతోషంగా, గర్వంగా ఉన్నానని అభి చెబుతుంటాడు. అలాగే తాను ఎప్పుడూ అభికి విధేయుడినేనని ఆది అంటుంటాడు.

తాజాగా మరోసారి..
అయితే లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన జబర్దస్త్ ప్రోమోలో అభి వేసిన పంచ్, రోజా కౌంటర్ అదిరిపోయింది. స్కిట్‌లో భాగంగా అభి ప్రేయసికి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఆవేశంలో ఉన్న అభి.. ఎవడు వాడు అని తన ప్రేయసిని ప్రశ్నిస్తాడు. అది అది.. అంటూ ఆ ప్రేయసి నీళ్లు నములుతుంటే.. ఆదినా? అని ఆశ్చర్యపోతాడు.
Recommended Video

రోజా కౌంటర్ వైరల్..
వెంటనే అందుకున్న ప్రేయసి.. హైపర్ ఆది కాదు.. అంటూ క్లారిటీ ఇస్తుంది. 2016లో జరిగిందే ఇంకా మరిచిపోలేకపోతున్నా హమ్మయ్యా అని అభి అనుకుంటూ ఉండగా.. వెన్నుపోటును ఇంకా మరిచిపోలేదా అంటూ రోజా వేసిన సెటైర్ అదిరిపోయింది.


Click it and Unblock the Notifications











