కిరాక్ ఆర్పీ ముందు నుంచీ అంతే.. నేను ఆ జోలికి వెళ్ళను.. అదిరే అభి ఆసక్తికర కామెంట్స్!
గత కొద్ది రోజులుగా జబర్దస్త్ మీద మల్లెమాల సంస్థ మీద కిర్రాక్ ఆర్పీ చేసిన ఆరోపణల గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయం మీద హైపర్ ఆది జబర్దస్త్, రాంప్రసాద్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి ఆర్పీ అలా మాట్లాడి ఉండాల్సింది కాదని కామెంట్లు చేశారు ఈనెబద్యంలోనే అదిరే అభి కూడా ఈ వ్యవహారం మీద స్పందించారు ఆ వివరాల్లోకి వెళితే

ఏమీ ఉంచుకోకుండా
తన తాజా ఇంటర్వ్యూలో అదిరే అభి ఆర్పీ చేసిన కామెంట్స్ పై స్పందించారు. ఆర్పీ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని పేర్కొన్న అదే అభి, ముందు నుంచి కూడా ఆర్పీ భోళా మనిషి అని లోపల ఏమీ ఉంచుకోకుండా మాట్లాడేస్తాడని అన్నారు. ఇప్పుడు కూడా ఇదే విషయం మీద అలాగే మాట్లాడి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అగ్రిమెంట్లు
అలాగే ఆయన చెప్పిన విషయాలు ఆయన వ్యక్తిగతం కాబట్టి ఎవరు ఎంత వరకు తీసుకోవాలి అనేది కూడా మనం చెప్పలేమని ఆయన చెప్పిన విషయాలు కొంత మందికి నచ్చవచ్చు మరి కొంతమందికి నచ్చకపోవచ్చు అని అభి కామెంట్ చేశారు. సుధీర్ ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు అనే విషయం మీద స్పందిస్తూ సాధారణంగా మల్లెమాల సంస్థతో కొన్ని అగ్రిమెంట్లు ఉంటాయని ఆ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత కొంతమంది ఉండాలి అనుకుంటే మరి కొంతమంది వెళ్ళిపోవాలి అనుకుంటారు.

మంచి స్నేహితులని
అదేవిధంగా సుధీర్ కూడా వెళ్లి ఉండవచ్చని అన్నారు. అయితే జబర్దస్త్ లో రష్మీ సుధీర్ మధ్య ఏదో ఉందని జరుగుతున్న ప్రచారం పీక్స్ కి వెళ్లడంతోనే సుధీర్ బయటకు వెళ్లాడా అనే ప్రశ్న వస్తే అదేమీ లేదని సాధారణంగా హీరో హీరోయిన్లు వచ్చే ఎలాంటి బంధం ఉంటుందో వారిద్దరి మధ్య అలాగే ఉంటుందని కేవలం షో కోసమే వారిద్దరి మధ్య ఏదో ఉంది అని డైరెక్టర్లు సృష్టించారు తప్ప నిజ జీవితంలో వారు మంచి స్నేహితులని అవి చెప్పుకొచ్చారు.

గ్రూప్స్ లో మాట్లాడుకుంటూ
అంతేకాక తామందరం ఇప్పటికీ ఒక కుటుంబమేనని జబర్దస్త్ లో చేసిన వాళ్లు చేస్తున్న వాళ్ళు అందరం ఒక గ్రూప్ లో ఉంటామని ఆ గ్రూప్ లో ప్రతి ఒక్కరు పుట్టిన రోజుకు, పెళ్లి రోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఎవరైనా సరే సినిమా చేస్తున్నారంటే ఆ సినిమాను ఎలా ప్రోత్సహించాలి అనే విషయం మీద కూడా ఆ గ్రూప్స్ లో మాట్లాడుకుంటూ ఉంటామని అభి చెప్పుకొచ్చారు.
Recommended Video


హాట్ టాపిక్ గా
అయితే ఇదంతా ఏదో కాంట్రవర్సీ జరుగుతోంది కానీ తాను మాత్రం కాంట్రవర్సీల జోలికి వెళ్లే వ్యక్తిని కాదు అని అభి చెప్పుకొచ్చారు. ఆర్పీ కొన్ని కామెంట్స్ చేయడం దానిని ఖండిస్తూ హైపర్ ఆది, రాంప్రసాద్ తెర మీదకు రావడం ఇప్పుడు అదిరే అభి కూడా ఈ వ్యవహారం మీద స్పందించడం అనేది టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











