అదిరింది టీమ్ లీడర్‌గా యాంకర్ రవి.. అబ్బో టార్చర్.. నాగబాబు సీక్రెట్ రివీల్
కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో సినీ, టెలివిజన్ తారలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో వీడియో కాలింగ్‌తో లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా అదిరింది షో జడ్జి నాగబాబు, హోస్ట్ యాంకర్ రవి సుదీర్ఘంగా ముచ్చటించారు. ఈ క్రమంలో యాంకర్ రవితో నాగబాబు మాట్లాడుతూ..

భాను శ్రీతో నీ జోడి..
హీరోయిన్ భానుశ్రీ యాంకర్‌గా మీ జోడి బాగా ఉంది. సమీరా వెళ్లిపోయిన తర్వాత మీరిద్దరి రావడం చాలా బెటర్ అయింది. అదిరింది షోకు భానుశ్రీ, నువ్వు ప్లస్ అయింది. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ఉంటుంది. మీ ఇద్దరిలో స్పోర్టివ్ షోకు ప్లస్ పాయింట్ అని నాగబాబు అన్నారు.

అదిరింది టీమ్ లీడర్‌గా రవి
అదిరింది షో ప్రారంభానికి ముందు యాంకర్ రవిని టీమ్ లీడర్‌గా చేయాలని ఆలోచించాం. కాకపోతే టీమ్ లీడర్ చేసి ఉంటే చచ్చిపోయేవాడివి. అదో టార్చర్‌గా ఉండేది. కానీ యాంకర్‌గానే ఉండటం వల్ల షో చాలా ఫన్నీగా ముందుకు వెళ్లడానికి సులభమైంది అని నాగబాబు పేర్కొన్నారు.

అదిరిందిలో టీమ్ సభ్యులు...
అదిరింది షోలో యాదవ రాజు తెలంగాణ యాస, భాష సూపర్‌గా ఉంది. తెలంగాణ భాషపై రాజుకు పట్టు నాకు ఆశ్చర్యం వేస్తుంది. సద్దాం టైమింగ్ సూపర్‌గా ఉంటుంది. బౌండరీలు, పరిమితులు లేకుండా దూసుకెళ్తుంటాడు. సీనియర్లు ధన్‌రాజ్ లాంటి అదిరింది షోను మరో లెవెల్‌కు తీసుకెళ్తారనడంలో ఎలాంటి సందేహం లేదు అని నాగబాబు అన్నారు.
Recommended Video

నవదీప్‌తో మరింత జోష్
ఇక నాకు తోడుగా మరో జడ్జిగా హీరో నవదీప్ ఉండటం మరింత జోష్ పెంచింది. నా కంటే ఎక్కువగా కామెడీని ఎంజాయ్ చేస్తుంటాడు. నా కంటే ఎక్కువగా నవ్వుతుంటాడు. నవదీప్‌తో నాకు 15 ఏళ్ల పరిచయం ఉంది. అదిరిందిలో నాకు మంచి కాంబినేషన్ అని నాగబాబు అన్నారు.


Click it and Unblock the Notifications











