అద్భుతమైన ప్లాన్ రెడీ చేసిన ‘అదిరింది’ టీమ్.. జబర్ధస్త్‌కు భారీ షాక్ ఖాయం.!

By Manoj

బుల్లితెరపై అత్యంత భారీ స్థాయిలో ప్రజాధరణ పొందిన కార్యక్రమాల్లో 'జబర్ధస్త్' ఒకటి. కామెడీ స్కిట్లతో ప్రేక్షకులను నవ్వించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ఈ షోకు మొదటి నుంచీ మంచి స్పందన వస్తోంది. అలాగే, టీఆర్పీ రేటింగ్‌లో సైతం దూసుకుపోతోంది. అందుకే ఈ షోకు పోటీగా ఎన్నో చానెళ్లు సరికొత్త కార్యక్రమాలను తీసుకు వచ్చాయి. కానీ, ఏదీ దీన్ని టచ్ కూడా చేయలేకపోయింది. ఇలాంటి తరుణంలో జబర్ధస్త్‌ థీమ్‌తో 'అదిరింది' అనే షో ప్రారంభం అయింది. తాజాగా ఆ షో నిర్వహకులు అద్భుతమైన ప్లాన్ రెడీ చేశారని తెలిసింది. దీని వల్ల జబర్ధస్త్‌కు భారీ షాక్ తగిలే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ వాళ్లు వేసిన ప్లాన్ ఏంటి.? పూర్తి వివరాల్లోకి వెళితే....

ఎంతో మంది వచ్చారు.. జబర్ధస్త్‌గా వర్కౌట్ అయింది

ఎంతో మంది వచ్చారు.. జబర్ధస్త్‌గా వర్కౌట్ అయింది

జబర్ధస్త్ షో దాదాపు ఏడేళ్ల క్రితం ప్రారంభం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ షో వల్ల ఎంతో మంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అదే సమయంలో టెక్నీషియన్లు, రైటర్లు కూడా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు వాళ్లంతా స్టార్‌డమ్‌ను అనుభవిస్తున్నారు. ఒకప్పుడు వాళ్లను తీసుకొచ్చిన జబర్ధస్త్‌కు.. ఇప్పుడు వాళ్ల వల్లే మంచి పేరు వస్తోంది.

ఆ నలుగురూ ప్లస్ అయ్యారు.. వాళ్లకూ కలిసొచ్చింది

ఆ నలుగురూ ప్లస్ అయ్యారు.. వాళ్లకూ కలిసొచ్చింది


జబర్ధస్త్ షో వల్ల ఆర్టిస్టులు మాత్రమే పాపులర్ అవలేదు. దీనికి మొదటి నుంచీ జడ్జ్‌లుగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు బాగా ప్లస్ అయ్యారు. అలాగే, వాళ్లకు కూడా ఈ షో మంచిగా ఉపయోగపడింది. మరోవైపు, ఈ షోకు యాంకర్లుగా వ్యవహరిస్తున్న అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ కూడా ఎనలేని క్రేజ్ వచ్చేసింది.

జబర్ధస్త్ యూనిట్‌కు షాకిచ్చిన నాగబాబు అండ్ గ్యాంగ్

జబర్ధస్త్ యూనిట్‌కు షాకిచ్చిన నాగబాబు అండ్ గ్యాంగ్


వారంలో రెండు రోజులు ప్రసారం అయినా భారీ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటోంది జబర్ధస్త్ షో. దీంతో సరికొత్త ప్రయోగాలు చేసి రేటింగ్ మరింత పెంచుకోవాలని యూనిట్ భావించింది. ఇలాంటి తరుణంలో నాగబాబు షో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటు దర్శకులు, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ టీమ్‌లు కూడా కిర్రాక్ కామెడీ షోకు గుడ్‌బై చెప్పేశాయి.

పాత వాళ్లు కూడా కలిశారు.. కొత్తగా ప్రారంభించారు

పాత వాళ్లు కూడా కలిశారు.. కొత్తగా ప్రారంభించారు

జబర్ధస్త్ నుంచి వెళ్లిపోయిన దర్శకులు నితిన్, భరత్ మరో ఛానెల్‌లో ‘అదిరింది' అనే కామెడీ షోను ప్రారంభించారు. దీనికి నాగబాబు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అలాగే, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ టీమ్ లీడర్లుగా ఉన్నారు. వీళ్లకు పాత జబర్ధస్త్ సభ్యులు ధన్‌రాజ్, వేణు కలిశారు. వీళ్లతో పాటు పటాస్ కుర్రాళ్లు అందరూ కలిసి ఓ టీమ్‌గా ఏర్పడ్డారు.

బాగా క్లిక్ అయింది... కొత్త కుర్రాళ్లకే మంచి రెస్పాన్స్

బాగా క్లిక్ అయింది... కొత్త కుర్రాళ్లకే మంచి రెస్పాన్స్

ఏడేళ్లుగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్‌కు అదిరింది షో పోటీగా వచ్చింది. మొదట్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ షోకు... క్రమంగా ఆదరణ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా ఇందులో సద్దాం గ్యాంగ్ చేస్తున్న స్కిట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వాళ్లు పండించే కామెడీని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. దీంతో యూనిట్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది.

అద్భుతమైన ప్లాన్ రెడీ చేసిన ‘అదిరింది’ యూనిట్

అద్భుతమైన ప్లాన్ రెడీ చేసిన ‘అదిరింది’ యూనిట్

ప్రారంభంలో ప్రేక్షకుల నుంచి స్పందనను దక్కించుకోలేకపోయిన అదిరింది షో.. ఇప్పుడిప్పుడే క్లిక్ అవుతోంది. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులకు మరింగా చేరువవ్వాలన్న లక్ష్యం పెట్టుకున్నారట యూనిట్ సభ్యులు. ఇందుకోసం ఓ అద్భుతమైన ప్లాన్ రెడీ చేశారని తాజాగా ఓ వార్త ప్రచారం అవుతోంది. అది రెమ్యూనరేషన్‌కు సంబంధించినది అని వార్తలు వస్తున్నాయి.

Recommended Video

Dhanraj & Venu Tillu Hilarious Skit On Corona
వాళ్ల ప్లాన్ వర్కౌట్‌ అయితే జబర్ధస్త్‌కు షాక్ ఖాయం.!

వాళ్ల ప్లాన్ వర్కౌట్‌ అయితే జబర్ధస్త్‌కు షాక్ ఖాయం.!


ప్రస్తుతం అదిరింది టీమ్ లీడర్లకు జబర్ధస్త్‌లో కంటే తక్కువ రెమ్యూనరేషనే ఇస్తున్నారు. అయితే, ఇప్పుడు షో పుంజుకుంటుండడంతో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట అదిరింది నిర్వహకులు. దీని వల్ల జబర్ధస్త్ టీమ్ లీడర్లకు పరోక్షంగా గాలం వేస్తున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇది వర్కౌట్ అయితే ఆ షోకు భారీ షాక్ తగలడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X