బాలుకి మనసులో మాట చెప్పిన శ్రీముఖి.. కానీ, ఊహించని ట్విస్ట్!

బుల్లితెరపై తన ఎనర్జీ, చలాకీతనం, టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పటాస్' షోతో కెరీర్ ప్రారంభించిన ఈ అందాల యాంకర్, నేడు తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత క్రేజీ హోస్టుల్లో ఒకరిగా నిలిచింది. తన మాటతీరు, హాస్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ 'బుల్లితెర రాములమ్మ'గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉండే శ్రీముఖికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఇక 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటుడు విష్ణుకాంత్ అలియాస్ బాలు కూడా ప్రస్తుతం బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తమిళనాడుకు చెందిన విష్ణుకాంత్, తెలుగులో ఈ సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని భారీ అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకున్నాడు. సీరియల్‌లో తన నటనతో ఆకట్టుకున్న బాలు, 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' వంటి షోల ద్వారా కూడా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తున్నాడు.

Adhivaram With Star Maa Parivaram promo Anchor Sreemukhi s Funny Confession to Balu Goes Viral

అయితే తాజాగా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'ప్రొమో విడుదలైంది. ఈ ప్రోమోలో శ్రీముఖి, బాలు మధ్య జరిగిన సరదా సంభాషణలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ ఫేమ్ నిఖిల్, గౌతమ్ కృష్ణ, సిద్ధార్థ్‌తో పాటు బాలు కూడా పాల్గొన్నాడు. షో మొత్తం నవ్వులు పూయించిన ఈ ఎపిసోడ్‌లో శ్రీముఖి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొదట నిఖిల్‌తో మాట్లాడుతూ "నువ్వు చాలా డెడికేటెడ్, కమిటెడ్ పర్సన్" అని శ్రీముఖి చెప్పగా, పక్కనే ఉన్న ముక్కు అవినాష్ వెంటనే "అందుకేనా రోహిణితో కనిపిస్తున్నాడు?" అంటూ సెటైర్ వేయడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఆ తర్వాత సిద్ధార్థ్ గురించి కూడా సరదాగా మాట్లాడుతూ అతని పర్సనల్ లైఫ్ పై సైటర్లు వేస్తుంది శ్రీముఖి. దీంతో షోలోని అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

అయితే అసలు హైలెట్ మాత్రం బాలు దగ్గరే జరిగింది. ఒక టాస్క్‌లో భాగంగా బాలు చేతిని పట్టుకున్న శ్రీముఖి ఒక్కసారిగా తన మనసులోని మాటను బయటపెట్టింది. "మనిద్దరం జీవితాంతం ఇలానే బ్యాచిలర్స్‌గా ఉండిపోదాం" అంటూ సరదాగా చెప్పడంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్రీముఖి చెప్పిన మాటలు వినగానే బాలు కూడా నవ్వుల్లో మునిగిపోయాడు. అయితే ఈ సరదా క్షణం ఎక్కువసేపు కొనసాగలేదు. వెంటనే ముక్కు అవినాష్ తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చి భారీ ట్విస్ట్ ఇచ్చాడు. "ఇదో కోరికా? మీ ఇద్దరూ కలిసి పంజాగుట్ట సర్కిల్ దగ్గర అడుక్కోండి" అంటూ వేసిన పంచ్‌తో స్టేజ్ మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది.

ఈ మధ్యకాలంలో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో శ్రీముఖి, బాలు మధ్య జరిగే సరదా సంభాషణలు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, ఫ్రెండ్లీ బాండింగ్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. అయితే ఇది కేవలం వినోదం కోసమేనా? లేక నిజంగానే వీరి మధ్య ప్రత్యేక అనుబంధం ఉందా? అనే చర్చలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

మరోవైపు శ్రీముఖి ఇప్పటివరకు తన పెళ్లి గురించి ఎన్నోసార్లు సరదాగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే తరహాలో బాలు ముందుకు తన "బ్యాచిలర్ లైఫ్" డైలాగ్ తీసుకురావడంతో అభిమానులు నవ్వులు పూయిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా శ్రీముఖి చెప్పిన "మనిద్దరం జీవితాంతం బ్యాచిలర్స్‌గా ఉండిపోదాం" అనే డైలాగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. మొత్తానికి, బాలుకి మనసులో మాట చెప్పినట్టుగా కనిపించిన శ్రీముఖి.. వెంటనే ముక్కు అవినాష్ వేసిన పంచ్‌తో ఆ క్షణాన్ని మరింత ఫన్నీగా మార్చేసింది. ప్రస్తుతం ఈ ప్రొమో వైరలవుతోంది.

Read more about: anchor sreemukhi siddharth balu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X