Bigg Boss: ఆ హీరోయిన్ బాత్రూం మేటర్ లీక్.. F*** అంటూ ఘోరంగా.. షోలో అసభ్యకరమైన సీన్!
బుల్లితెరపై సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. ఎన్నో వివాదాలకు కారణం అవుతూ.. దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దీంతో చాలా భాషల్లోకి దీన్ని తీసుకు వచ్చారు. అలా ఆరేళ్ల క్రితమే తెలుగులోకి కూడా ఈ రియాలిటీ షో పరిచయం అయింది. ఇక, ఇక్కడ ఎవరూ ఊహించని రీతిలో భారీ స్పందనను అందుకుని రికార్డులు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో తాజా ఎపిసోడ్‌లో ఓ అమ్మాయి గురించి ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు
తెలుగులో బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్థాయిలో రేటింగ్ లభిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరో సీజన్ భారీ సక్సెస్ అవుతుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇందులో సరికొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. కానీ, దీనికి ఆదరణ మాత్రం అనుకున్న రీతిలో రావడం లేదు. కానీ, నిర్వహకులు ప్రయత్నాలు చేయడంతో రేటింగ్ పెరుగుతోంది.

ఫైర్ బ్రాండ్‌గా మారిన ఇనాయా
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఎంతో మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఇనాయా సుల్తానా ఒకరు. ముక్కుసూటిగా ఉంటూ.. దూకుడైన ఆటతో ఆకట్టుకుంటోన్న ఈ భామ.. సూర్యతో లవ్ ట్రాకు వల్ల మాత్రం విమర్శలను ఎదుర్కొంది.

అందరి టార్గెట్... తగ్గడం లేదు
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే తన దూకుడైన స్వభావం, ముక్కుసూటి తనంతో ఇనాయా సుల్తానా ఎన్నో గొడవల్లో భాగం అవుతోంది. ఫలితంగా ఆమె చాలా మందికి శత్రువులా మారిపోయింది. దీంతో ఇనాయాను నామినేషన్స్ టాస్కుతో పాటు కొన్ని గేమ్స్‌లో తెగ టార్గెట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆమె క్యారెక్టర్‌ను దిగజారుస్తూ వ్యక్తిగతంగా దూషిస్తూనే ఉన్నారు.

ఆటపై అభ్యంతరం వ్యక్తం చేసి
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పదో వారానికి సంబంధించి కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు 'స్నేక్ అండ్ ల్యాడర్' టాస్కును ఇచ్చారు. ఇందులో ప్రత్యర్థి టీమ్ వాళ్లు ఇనాయా సుల్తానానే టార్గెట్ చేసి ఓడించారు. దీంతో ఆమె కోపంలో వాళ్లతో గొడవకు దిగి కొందరి ఆటపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే, కెప్టెన్సీ టాస్కులోనూ ఫైమా, ఆది కలిసి ఆడుతున్నారని ఆరోపించింది.

బాత్రూం మేటర్ లీక్ చేశాడుగా
శుక్రవారం జరిగిన కెప్టెన్సీ టాస్కులో ఫైమాకు ఆది రెడ్డి సహాయం చేస్తున్నాడని ఇనాయా ఆరోపించింది. దీంతో అతడు ఆమెపై ఓ రేంజ్‌లో గొడవకు దిగాడు. ఈ సీజన్‌లో తొలిసారి సహనం కోల్పోయినట్లు మాట్లాడాడు. ఈ క్రమంలోనే గతంలో ఇనాయా బాత్రూంలో బిగ్ బాస్‌తో మాట్లాడింది గుర్తు చేస్తూ.. 'నువ్వు బాత్రూంలోకి వెళ్లి డోర్ వేసుకుని ఏం చేస్తావో తెలుసు' అని అన్నాడు.

బూతులు మాట్లాడిందని ఓట్
శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లోనే పదో వారానికి సంబంధించి వరస్ట్ కంటెస్టెంట్‌ను ఎంపిక చేసే ప్రక్రియ కూడా జరిగింది. ఇందులో శ్రీహాన్ 'నువ్వు మొన్న స్నేక్ అండ్ ల్యాడర్ టాస్కులో ఎఫ్ వర్డ్‌ను యూజ్ చేశావ్. అలా బూతులు మాట్లాడినందుకు ఓట్ చేస్తున్నా' అన్నాడు. దీంతో ఇనాయా 'దానికి నేను మొన్నే సారీ చెప్పేశాను కదా' అని చెప్పినా శ్రీహాన్ మాత్రం వినలేదు.

ఇనాయా సుల్తానాకు బాస్ శిక్ష
ఇక, ఈ వారానికి చెత్త పెర్ఫార్మర్‌గా నిలిచిన ఇనాయా సుల్తానాను బిగ్ బాస్ ఆదేశాలతో కెప్టెన్ ఫైమా జైలుకు పంపించింది. ఇదిలా ఉండగా.. మొత్తానికి అటు ఆది రెడ్డి, ఇటు శ్రీహాన్‌లు ఇనాయా సుల్తానా క్యారెక్టర్‌ను తప్పుగా చూపించే ప్రయత్నం చేశారని ఆమె అభిమానులు బాగా ట్రోల్ చేస్తున్నారు. అలా అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ చేయడం అసభ్యంగా ఉందని తిట్టిపోస్తున్నారు.


Click it and Unblock the Notifications











