Bigg Boss Telugu 6: ఆది రెడ్డికి బిగ్ బాస్ ఆఫర్.. షో చరిత్రలో తొలిసారి ఇలా.. టైటిల్ గెలిచినట్లే!

బుల్లితెర చరిత్రలోనే దేశ వ్యాప్తంగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన షో బిగ్ బాస్. చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీగానే లభిస్తోంది. అందుకే ఈ షో ప్రసారం అయిన ప్రతిసారీ ఆయా భాషల్లో నెంబర్ వన్ స్థానాన్ని స్థానంలో నిలుస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఇది దేశంలోనే ఎక్కువ రేటింగ్‌ను అందుకుంటోంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఆరో సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఆది రెడ్డికి బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

వాటిని అధిగమించేందుకు కొత్తగా

వాటిని అధిగమించేందుకు కొత్తగా

ఎన్నో అంచనాలతో వచ్చిన ఆరో సీజన్‌ ఆరంభం నుంచే చాలా చప్పగా సాగింది. దీంతో బిగ్ బాస్ సక్సెస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షో నిర్వహకులు సరికొత్త వ్యూహాలతో ముందుకు వచ్చారు. వాటి అమలు ఫలితంగా షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు. దీంతో ఈ మధ్యనే దీనికి రేటింగ్ క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా రేటింగ్ పుంజుకుంటోంది.

బీబీ కోచింగ్ సెంటర్ అనే టాస్కు

బీబీ కోచింగ్ సెంటర్ అనే టాస్కు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసేందుకు ప్రతి వారం టాస్కులు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే పన్నెండో వారానికి సంబంధించి 'బీబీ కోచింగ్ సెంటర్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో ఫైమా ఇంగ్లీష్ టీచర్‌గా, ఆది రెడ్డి డ్యాన్స్ మాస్టర్‌గా, శ్రీ సత్య మేకప్ టీచర్‌గా, రాజశేఖర్ సింగింగ్ టీచర్‌గా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు.

హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీలు

హౌస్‌లోకి కంటెస్టెంట్ల ఫ్యామిలీలు


బిగ్ బాస్ ప్రతి సీజన్‌లోనూ చివర్లో కంటెస్టెంట్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇస్తుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అన్ని సీజన్లలోనూ ఇదే తరహాలో వాళ్లను తీసుకొచ్చారు. ఇక, ఆరో సీజన్‌కు సంబంధించి ఇప్పుడు అది జరుగుతోంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ నుంచే కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను హౌస్‌ లోపలికి పంపిస్తున్నారు.

ఆది రెడ్డి కోసం వచ్చిన భార్య, పాప

ఆది రెడ్డి కోసం వచ్చిన భార్య, పాప

'బీబీ కోచింగ్ సెంటర్' టాస్క్ జరుగుతోన్న సమయంలోనే ముందుగా ఆది రెడ్డి భార్య కవిత, వాళ్ల పాప హౌస్‌ లోపలికి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లు అలా రాగానే అతడు పరుగు పరుగున వెళ్లి హృదయానికి హత్తుకున్నాడు. అంతేకాదు, పదే పదే తన ఆటతీరు గురించి అడిగాడు. దీనికి కవిత 'నీ ఆటతీరుపై సంతృప్తిగానే ఉన్నా. కానీ, ఏది జరిగినా మన మంచికే' అని చెప్పారు.

అన్నం తినిపించి.. అందరి పేర్లు

అన్నం తినిపించి.. అందరి పేర్లు

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆది రెడ్డి తన భార్య, పాపను తీసుకుని లోపలికి వెళ్లాడు. అక్కడ వాళ్ల కూతురికి అన్నం కూడా తినిపించారు. ఆ తర్వాత అక్కడే చాలా సేపు కూర్చుని మాట్లాడుకున్నారు. కొద్ది సేపటికి అందరూ లోపలికి రావడంతో ఆది రెడ్డి భార్య కంటెస్టెంట్లు అందరి ఆటతీరు గురించి మాట్లాడారు. అనంతరం అందరూ వాళ్ల పాపను ముద్దాడుకున్నారు.

బిగ్ బాస్ ఆఫర్.. బర్త్‌డేను జరిపి

బిగ్ బాస్ ఆఫర్.. బర్త్‌డేను జరిపి

ఇక, హౌస్‌లో ఆది రెడ్డి కూతురి కోసం బిగ్ బాస్ ఓ బర్త్‌డే కేక్‌ను పంపించారు. దీంతో అందరినీ గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చి.. పుట్టినరోజును జరుపుకున్నారు. ఆ తర్వాత 'నా కూతురు ఫస్ట్ పుట్టినరోజును ఇక్కడ చేయాలన్న కోరిక నెరవేర్చారు. దీనికి మీకు జన్మంతా రుణపడి ఉంటాను బిగ్ బాస్' అని ఆది రెడ్డి చెప్పాడు. ఈ ఎపిసోడ్‌తో అతడు టైటిల్ గెలిచినట్లు మురిసిపోయాడు.

రాజ్ మదర్.. కప్ గెలవాలంటూ

రాజ్ మదర్.. కప్ గెలవాలంటూ


ఆది రెడ్డి ఫ్యామిలీ వెళ్లిపోయిన కాసేపటికి రాజ్ వాళ్ల మదర్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెను అలా చూడగానే అతడు కన్నీరు పెట్టుకుంటూ వెళ్లి హత్తుకున్నాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లి మాట్లాడుకున్నారు. ఆ సమయంలోనే రాజ్‌కు తల్లి బొట్టు పెట్టి, ఓ తాడును చేతికి కట్టారు. కప్ గెలిచి రావాలి అంటూ ఆశీర్వదించారు. ఇలా నిన్నటి ఎపిసోడ్‌లో రెండు ఫ్యామిలీలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X