Bigg Boss: తల్లి ఆత్మహత్య.. బయటకెళ్తే అలా అడిగేవారు.. కన్నీరు పెట్టించిన ఆది రెడ్డి రియల్ స్టోరీ
తెలుగు బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతూ.. సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ వెళ్తోంది బిగ్ బాస్. ప్రతి ఏడాది ఒక సీజన్‌తో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ షో.. టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది. అదే సమయంలో ఎంతో మంది చిన్న ఆర్టిస్టులు, సోషల్ మీడియా పీపుల్‌ను బిగ్ సెలెబ్రిటీలుగా మార్చేస్తోంది. ఇలా తాజాగా ముగిసిన సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చి ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్నాడు ఆది రెడ్డి. ఫైనలిస్టుగా సత్తా చాటిన అతడు.. తాజా ఇంటర్వ్యూలతో తన జీవితంలోని కష్టాలను వివరించాడు. ఆ సంగతులు మీరే చూడండి!

యూట్యూబర్‌కు బిగ్ ఛాన్స్
యూట్యూబర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత బిగ్ బాస్ రివ్యూవర్‌గా మారి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు ఆది రెడ్డి. ఈ క్రమంలోనే ఆరో సీజన్‌లో అతడు కామనర్ కోటాలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలోనే అతడు ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అయ్యాడు. తద్వారా ఆరంభంలోనే అందరి దృష్టిలో పడ్డాడు.

ఆట, మాటతో మంచి పేరు
బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ప్రత్యేకంగా నిలిచిన ఆది రెడ్డి.. క్రమంగా తన సత్తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగానే చక్కని ఆటతీరుతో ఆకట్టుకున్న అతడు.. మాటతీరు, అందరితో వ్యవహరించే తీరుతోనూ మంచి పేరును కూడా అందుకున్నాడు. తద్వారా ఎన్నోసార్లు ఎలిమినేషన్స్ కూడా తప్పించుకుని ఫినాలేలో సైతం అడుగు పెట్టాడు.

4వ స్థానం... భారీగా రాబట్టి
సాదాసీదాగానే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది రెడ్డి.. ఎవరూ ఊహించని రీతిలో ఆకట్టుకుని ఫినాలేకు చేరుకున్నాడు. అయితే, అతడు చివరికి నాలుగో స్థానంతోనే సరిపెట్టుకున్నాడు. అయితేనేం.. రెమ్యూనరేషన్ పరంగా అతడు చాలా మొత్తాన్నే ఖాతాలో వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆది రెడ్డి ఇప్పుడు తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నాడని చెప్పొచ్చు.

ఇంటర్వ్యూలో లైఫ్ స్టోరీతో
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆది రెడ్డి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అతడు ఓ యూట్యూబ్ ఛానెల్‌తో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదురైన ఎన్నో సంఘటనలను మీడియాతో పంచుకున్నాడు. అంతేకాదు, తొలిసారి అతడు తన బాధలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు.

తల్లి ఆత్మహత్య గురించి
తాజా ఇంటర్వ్యూలో ఆది రెడ్డి మాట్లాడుతూ.. '2013లో మా అమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. అది జరిగిన పదిహేను రోజుల తర్వాత బయటకు వెళ్తే.. అన్నం తిన్నావా అంటూ అందరూ నన్ను జాలిగా అడిగేవారు. అప్పుడు నా పరిస్థితి గురించి నెల్లూరులోని వరికుంటపాడుకు వెళ్తే అందరూ చెబుతారు. అంతలా నేను ఆ సమయంలో ఎంతో బాధను అనుభవించా' అని చెప్పాడు.

పెళ్లికి కూడా డబ్బుల్లేవు
తర్వాత ఆది రెడ్డి 'బ్యాంకులో తీసుకున్న రూ. 11 లక్షలు లోన్ కట్టడం కోసం భూమి అమ్మాల్సి వచ్చింది. దీంతో మా చెల్లి పెన్షన్‌తోనే బతికాం. ఆ సమయంలో మా అక్క ఫోన్ చేసి రెండు లక్షలు సంపాదించరా.. నేను ఒక రెండు లక్షలు అప్పు చేసి నీకు పెళ్లి చేస్తాను అని చెప్పింది. అంతటి కష్టాలను అనుభవించాం. అయినా వాటిని తట్టుకుని నిలబడగలిగాను' అని వెల్లడించాడు.

జాలిగా చూసిన వాళ్లే అలా
ఆది రెడ్డి కంటిన్యూ చేస్తూ.. 'దీన స్థితి నుంచి ఇప్పుడు మంచి పొజిషన్‌కు వచ్చాను. అప్పుడు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకున్నోడిని ఇప్పుడు సూట్లు వేస్తున్నాను. ఆరోజు నన్ను జాలిగా చూసిన జనాలను ఈరోజు ఎంతో గర్వపడేలా చేశాను. ఆరోజు మా అమ్మ అరువు బంగారం వేసుకునేది. ఇప్పుడు తను ఉంటే ఒళ్లంతా బంగారంతో నింపేసేవాడిని' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











