ఆదిపురుష్ ఈవెంట్ ఛాన్స్ మిస్ చేసుకున్న యాంకర్ సుమ.. ఝాన్సీ ఎలా వచ్చిందంటే?
తెలుగులో లీడింగ్ యాంకర్ ఎవరు అంటే సుమ పేరు కచ్చితంగా వినిపిస్తుంది. తెలుగు అమ్మాయి కాకపోయినా ఆమె మాట్లాడే తెలుగు మనవాళ్లు కూడా మాట్లాడలేరేమో అనేంతలా ఆమె మాయ చేస్తూ ఉంటుంది.
రాజీవ్ కనకాలను వివాహం చేసుకొని తెలుగింటి కోడలు అయిపోయిన మలయాళ ఆడపడుచు సుమ ప్రస్తుతం టాప్ సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్ లన్నీ చూస్తోంది. అయితే ఆదిపురుష్ సినిమా ఈవెంట్ కూడా సుమ ఎందుకు యాంకరింగ్ చేయలేదు అనే డౌట్స్ చాలానే వచ్చాయి. ఇక ఆమె ఆ ఛాన్స్ ఎలా మిస్ చేసుకుంది. ఝాన్సీకి ఆ ఛాన్స్ ఎలా వచ్చింది అనే వివరాల్లోకి వెళితే...

భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్: ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీతగా గా నటించిన ఈ ఆది పురుష్ సినిమా త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది.
ఇప్పటివరకు మున పెన్నడు లేని విధంగా ఈ సినిమాకి మంచి పాజిటివ్ బజ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఈవెంట్ తోనే మంచి హైప్ క్రియేట్ చేశారు. దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసి తిరుపతిలో ఈవెంట్ ను నిర్వహించారు. ఎక్కడ ఎలాంటి ఘటనలకు తావివ్వకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సుమ రాకపోవడంతో: అయితే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా ఏ సినిమా ఈవెంట్ జరిగినా అందులో కచ్చితంగా సుమ కనపడాల్సిందే. అలాంటిది ఆది పురుష్ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె కనిపించలేదు.
దీంతో అసలు సుమ ఎందుకు ఆది పురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కాలేదనే విషయం మీద చర్చ జరుగుతుంది. అసలు సుమను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనేలాక్ కామెంట్స్ కూడా వచ్చాయి.

అందుకే రాలేదట: నిజానికి సుమ ప్రస్తుతానికి హైదరాబాదులో లేదు. ఆమె సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు భర్త పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఒక పక్క టెలివిజన్ షోలు మరొక పక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేస్తూ సుమ ఎప్పటికప్పుడు బిజీబిజీగా గడుపుతోంది. వీటన్నింటి నుంచి కాస్త రిలాక్స్ అవుదామనే ఉద్దేశంతో ఆమె విదేశాలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.

యాంకర్ ఝాన్సీ, ప్రదీప్: ఈ గ్యాప్ లో ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్ చేసుకోవడంతో తాను రాలేనని నిర్వాహకులకు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో అందుబాటులో ఉన్న మరో పద్ధతి అయిన యాంకర్ ఝాన్సీ ని పిలిపించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు నిర్వాహకులు.
ఇక ఝాన్సీ కి తోడుగా యాంకర్ ప్రదీప్ కూడా ఈ స్టేజి మీద సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. సుమ ఉంటే ఆమె ద్వారానే ఈవెంట్ ను కొనసాగించాలని అనుకున్నారు. కానీ సడన్ గా మిస్ కావడంతో ప్రదీప్ ను కూడా రంగంలోకి దింపాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











