Jabardasth లో బూతులు తగ్గడానికి కారణం ఇదే.. సీక్రెట్ బయటపెట్టిన అదిరే అభి!

తెలుగు టెలివిజన్ ప్రపంచంలో అత్యధిక టిఆర్పి రేటింగ్స్ అందుకునే షోలతో జబర్దస్త్ టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పాలి. ప్రముఖ కమెడియన్స్ తో మొదలైన జబర్దస్త్ షో లో ప్రస్తుతం ఎంతో మంది కొత్త వాళ్ళు కూడా వారి టాలెంట్ నిరూపించుకునేందుకు కష్టపడుతున్నారు. ఒక విధంగా చాలామందికి జబర్దస్త్ సినిమా ప్రపంచంలో ఒక సరికొత్త కెరీర్ ను ఏర్పాటు చేసింది అని కూడా చెప్పవచ్చు. అయితే ఈ షోపై మధ్యలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి.

బూతుల పేరుతో కామెడీ చేయడం కూడా జనాలకు ఎబ్బెట్టుగా అనిపించింది. అయితే ఇటీవల కాలంలో మాత్రం అడల్ట్ కంటెంట్ చాలా వరకు తగ్గిపోయింది. ఆ విషయంపై సీనియర్ మోస్ట్ జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

తగ్గిన రేటింగ్స్

తగ్గిన రేటింగ్స్

జబర్దస్త్ షో గత పదేళ్లుగా తిరుగులేని కామెడీ షో గా గుర్తింపు అందుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గతంలో వచ్చిన టిఆర్పి రికార్డులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు బ్రేక్ చేస్తూనే వచ్చింది. కానీ గత రెండు మూడేళ్ళుగా మాత్రం రేటింగ్స్ మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. కమెడియన్స్ పారితోషికాలు కూడా తగ్గాయి. సీనియర్ కమెడియన్స్ అందరు కూడా వెళ్ళి పోతూ ఉండటం అలాగే రొటీన్ కామెడీ ఎక్కువ అయిపోవడంతో జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

కాంట్రవర్సీలు ఎక్కువైనా..

కాంట్రవర్సీలు ఎక్కువైనా..

అంతేకాకుండా జబర్దస్త్ కొత్త లో కూడా చాలా అడల్ట్ కంటెంట్ వచ్చింది.. బూతులు కూడా ఎక్కువైపోతున్న ట్లుగా విమర్శలు కూడా వచ్చాయి. అలాగే కొన్నిసార్లు జబర్దస్త్ కమెడియన్స్ పై దాడులు కూడా జరిగాయి. అయితే కాంట్రవర్సీలు ఎన్ని వచ్చినా కూడా జబర్దస్త్ మాత్రం ఎప్పటికీ టాప్ రేటింగ్స్ తో ముందుకు సాగుతూ వచ్చింది.

బూతు కంటెంట్ ఎక్కువయ్యిందని..

బూతు కంటెంట్ ఎక్కువయ్యిందని..

జబర్దస్త్ షో సక్సెస్ అయ్యిందని ఆ తర్వాత ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా స్టార్ట్ చేశారు. రెండు షోలు కూడా బ్రహ్మాండంగా నడుస్తుండటంతో కొత్త వారికి కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. అయితే బూతు కంటెంట్ ఎక్కువైపోతున్న తరుణంలో ఒక రోజు ప్రత్యేకంగా మల్లెమాల మేనేజ్మెంట్ అందరిని పిలిచి వివరణ ఇచ్చింది. ఆ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరే అభి తెలియజేశాడు.

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
అప్పటి నుంచి తగ్గిపోయింది

అప్పటి నుంచి తగ్గిపోయింది

జబర్దస్త్ అన్ని వర్గాల ఆడియన్స్ చూసే విధంగా ఉండాలి కాబట్టి ఈ షోలో ఇప్పటి నుంచి ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఉండకూడదు అని డబల్ మీనింగ్ డైలాగ్స్ అలాగే బూతులు కూడా ఎక్కువగా ఉండకూడదు అనే మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందట. అలాగే కమెడియన్స్ కూడా ఎక్కువగా అలాంటి కంటెంట్ పై ఆలోచించకుండా భిన్నమైన కామెడీ తో ఆకట్టుకోవాలని డిసైడ్ అయినట్లు అభి వివరణ ఇచ్చాడు. మేనేజ్మెంట్ చెప్పినప్పుడు చాలావరకు జబర్దస్త్ లో అడల్ట్ కంటెంట్ తగ్గిపోయింది అని కూడా అభి అన్నారు.

టీమ్ లీడర్స్ వెళ్లిపోవడానికి కారణం

టీమ్ లీడర్స్ వెళ్లిపోవడానికి కారణం

ఇక జబర్దస్త్ నుంచి సీనియర్ టీమ్ లీడర్స్ కమెడియన్స్ అలాగే మరికొంతమంది లీడర్స్ కూడా తప్పుకోవడానికి ప్రధాన కారణం బయట సినిమాల్లో వారికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయట.

ఒక వైపు సినిమా షూటింగ్స్ మరొకవైపు స్కిట్ కోసం ప్రత్యేకంగా టైం కేటాయించాలి కాబట్టి బ్యాలెన్స్ చేయడం కష్టమే అవుతుంది. అందుకే చాలా మంది సీనియర్ కమెడియన్స్ అలాగే కొందరు చిన్న కమెడియన్స్ కూడా జబర్దస్త్ నుంచి వెళ్లి పోతున్నట్లుగా అదిరే అభి వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X