జబర్ధస్త్‌లో అపశృతి: సహచరుడిని కొట్టబోయిన టీమ్ లీడర్.. ఆపబోయిన రోజాతో వాగ్వాదం!

తెలుగు బుల్లితెరపై దాదాపు ఎనిమిదేళ్లుగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ పొజిషన్‌లో వెలుగొందుతోంది ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్. ఎన్నో సందేహాల నడుమ మొదలైన దీనికి ఇక్కడి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఫలితంగా టెలివిజన్ హిస్టరీలోనే ఎక్కువ ఎపిసోడ్స్ చేసిన స్టాండప్ కామెడీ షోగా నిలిపారు. తాజాగా జబర్ధస్త్ షోలో అపశృతి జరిగింది. స్కిట్ జరుగుతుండగా పొరపాటు చేశాడనే కారణంతో స్టేజ్‌పైనే సహచరుడిని కొట్టబోయాడు ఓ టీమ్ లీడర్. అంతేకాదు, ఆపబోయిన రోజాతోనూ వాగ్వాదినికి దిగాడు. ఇంతకీ ఎవరా టీమ్ లీడర్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

తెలుగులో తిరుగులేని షో.. పోటీనే లేదు

తెలుగులో తిరుగులేని షో.. పోటీనే లేదు


2013 నుంచి ఇప్పటి వరకు ఒకే రకమైన రేటింగ్ సాధిస్తూ నెంబర్ వన్ కామెడీ షోగా కితాబందుకుంది జబర్ధస్త్. ఈ క్రమంలోనే బుల్లితెర చరిత్రలోనే ఎన్నో చెరిగిపోని రికార్డులను క్రియేట్ చేసింది. దీనికి పోటీగా ఎన్నో షోలు వచ్చినప్పటికీ.. వాటన్నింటినీ దెబ్బకొడుతూ రోజురోజుకూ ప్రభావాన్ని పెంచుకుంటూ పోతోంది. అందుకే ఈ షోకు ప్రత్యేకమైన స్థానం ఏర్పడిపోయింది.

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు... వందలు

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు... వందలు

సుదీర్ఘమైన ప్రయాణంలో జబర్ధస్త్ షో ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేసింది. టాలెంట్ ఉండి అవకాశాలు దొరకక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచింది. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా కొన్ని వందల మంది తమ టాలెంట్‌ను నిరూపించుకున్నారు. ప్రస్తుతం వీళ్లలో చాలా మంది ఆర్టిస్టులు తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారు.

ఆ నలుగురికి కూడా ప్లస్ అయిన జబర్ధస్త్

ఆ నలుగురికి కూడా ప్లస్ అయిన జబర్ధస్త్

జబర్ధస్త్ షో కేవలం ఆర్టిస్టులకు మాత్రమే కాదు.. అందులో పని చేసిన ఎంతో మందికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. మరీ ముఖ్యంగా షో ఆరంభం నుంచి జడ్జ్‌లుగా పని చేసిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబుకు ఈ షో మరింత ప్లస్ అయింది. అలాగే, గ్లామరస్ బ్యూటీలు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ యాంకరింగ్ కెరీర్‌లకు బాగా ఉపయోగపడిందీ కామెడీ షో.

వివాదాలూ వదల్లేదు.. అయినా ఆగలేదు

వివాదాలూ వదల్లేదు.. అయినా ఆగలేదు

జబర్ధస్త్ షోను ఆదరించేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని కోట్ల మందే ఉన్నారు. అదే సమయంలో ఈ షోను వ్యతిరేకించే వాళ్లూ ఉన్నారు. ఈ కామెడీ షోలో అశ్లీలతతో పాటు డబుల్ మీనింగ్ డైలాగులు వాడుతున్నారని, మహిళలను కించపరుస్తున్నారని, కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా స్కిట్లు చేస్తున్నారని చాలా ఆరోపణలు వచ్చాయి. దీంతో షోను నిషేదించాలన్న డిమాండ్లూ వినిపించాయి.

జబర్ధస్త్ షోలో అపశృతి... వివాదాస్పదం

తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా పేరొందిన జబర్ధస్త్‌లో తాజాగా ఓ అపశృతి చోటు చేసుకుంది. సీనియర్ టీమ్ లీడర్ అదిరే అభి.. స్కిట్ చేస్తున్న సమయంలో షోలో పని చేస్తున్న ఓ వర్కర్ పొరపాటు చేశాడు. దీనిపై ఫైర్ అయిన అతడు.. చేతిలోని కుర్చీని లాక్కుని విసిరేశాడు. అంతేకాదు, అక్కడితో ఆగకుండా సదరు వర్కర్‌ను కొట్టేందుకు దూసుకుపోయాడు అభీ.

Recommended Video

Anchor Rashmi Gautam Tested Coronavirus Positivie
గొడవ ఆపబోయిన రోజాతో వాగ్వాదం!

గొడవ ఆపబోయిన రోజాతో వాగ్వాదం!

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే అభి ఒకేసారి ఫైర్ అవడంతో అంతా షాక్ అయ్యారు. ఓ వైపు నుంచి అనసూయ కూల్ అభీ కూల్ అభీ అనడం వినిపించింది. అలాగే, గొడవను ఆపబోయిన రోజాతో ఈ టీమ్ లీడర్ వాదనకు దిగాడు. ‘ఇలాంటి చెత్త పనులు చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది' అంటూ ఆమెకు వివరణ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X