అక్కినేని నాగేశ్వరరావు కాళ్ళు మొక్కిన అదిరే అభి.. అక్కినేని కామెంట్స్ వింటే షాకవ్వక తప్పదు!
టెలివిజన్ స్క్రీన్ మీద సంచనాలు నమోదు చేసిన కామెడీ షో జబర్దస్త్. ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ షోను వ్యతిరేకించే వారూ ఉన్నారు. ఈ షోలో అడల్ట్ కామెడీ అంటూ ఎన్నో విమర్శలు ఎదురైనా.. వాటన్నింటికి సమాధానం ఇస్తూ అత్యధిక టీఆర్పీతో దూసుకుపోతూ వస్తుంది. అయితే ఈ షో ద్వారా ఫేమస్ అయిన అదిరే అభి, అక్కినేని నాగేశ్వరరావు గురించి ఒక అనుభవం పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

అలీతో సరదాగా
జబర్దస్త్ టీం లీడర్లలో అదిరే అభికి మంచి పేరు ఉంది. హైపర్ ఆది లాంటి ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిన సీనియర్ టీం లీడర్ అభి కేవలం జబర్దస్త్ షో ద్వారా మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా రాణిస్తున్నారు అదిరే అభి. ఇటీవల పాయింట్ బ్లాంక్ సినిమాతో హీరోగా మారిన ఆయన ఈ సినిమా హీరోగా కూడా పరిచయం అయిన అభి తాజాగా అలీతో సరదాగా షోలో ఆటో రాంప్రసాద్ తో కలసి పాల్గొన్నాడు. అయితే ఈ షోలో ఆయన తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

బుల్లితెరకు బాహుబలి
నిజానికి ప్రభాస్ హీరోగా పరిచయమైన ఈశ్వర్ సినిమాతోనే అభి కూడా నటుడిగా పరిచయం అయ్యాడు. అయితే ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ లెవెల్ కి వెళ్ళగా అభి మాత్రం ఉద్యోగం చేసుకుంటూ నటన మీద కాన్సన్ట్రేట్ చేయలేక ఇప్పుడు జబర్దస్త్ స్థాయిలో ఉండిపోయారు.. ఈ నేపథ్యంలోనే అలీ సరదాగా మాట్లాడుతూ వెండితెరకు ఆయన బాహుబలి అయితే బుల్లితెరకు నువ్వు బాహుబలివా అని ప్రశ్నించారు. అదేమీ లేదని కండలు పెంచినంత మాత్రాన బాహుబలి అవ్వలేమని ఆయన చెప్పుకొచ్చారు

నిర్మాతకే అప్పు
ఇక జబర్దస్త్ వాళ్ళు అభినయ్ కృష్ణకు భార్య అంటే భయం కదా అని ప్రశ్నించగా అవునని మీలాగా నాకు కూడా భయం అని సరదాగా అలీకి కౌంటర్ వేశాడు. ఇక ఒక నిర్మాత అడిగితే డబ్బులు ఇచ్చావ్ అంట కదా అని ప్రశ్నించగా, మనకోసం కోట్లు ఖర్చు పెట్టే నిర్మాత ఐదు లక్షలు అడిగితే ఇవ్వలేక పోతామా అని ఐదు లక్షలు ఇచ్చానని వాటిని రాబట్టుకోవడానికి ఎస్సై నుంచి ఎస్పీ దాకా అందరి చేత ఫోన్లు చేయించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

రాజమౌలి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా
ఆ సమయంలో మీకు కూడా ఫోన్ చేద్దామని అనుకున్నానని చెప్పగా నేనేమైనా దావూద్ మనిషినా అంటూ అలీ సరదాగా కౌంటర్ వేశాడు.
అన్నట్టు అభి హూ వాంట్స్ టు బిఎ మిల్లియనీర్ తెలుగు వెర్షన్ మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతే కాక బాహుబలి 2 సినిమా కొరకు దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌలి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఈ విషయాన్ని కూడా కూడా అభి ప్రస్తావించారు.

అక్కినేని నాగేశ్వరరావు కాళ్ల మీద పడి
ఇక తాను ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు కాళ్ల మీద పడి తను మంచి నటుడు కావాలని ఆశీర్వదించమని అడిగానని దానికి ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు అని చెప్పుకొచ్చారు. దీవించినంత మాత్రాన ఎవరూ మంచి నటులు అయిపోరని , కృషి ఉండాలని ఆయన చెప్పుకొచ్చారని అభి పేర్కొన్నాడు. ఇక ఈ అలీతో సరదాగా పూర్తి ఎపిసోడ్ లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











