For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అదిరే అభి పరిస్థితి దారుణం: నిద్రలోనే చనిపోతాడని తలుపులు తెరిచే.. కష్టం చెబుతూ ఏడ్చిన కమెడియన్

  |

  దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎంతో మంది కమెడియన్లు ఇందులోకి వచ్చారు.. వెళ్లారు. కానీ.. చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభం నుంచి దీన్ని అంటిపెట్టుకుని ఉన్నారు. అలాంటి వారిలో అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఒకడు. చాలా కాలంగా ఈ షోలో భాగం అవుతోన్న అతడు.. ప్రయోగాత్మక స్కిట్లతో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అభి ఆరోగ్యం గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

   అలా మొదలైన కెరీర్.. ఆల్‌రౌండర్

  అలా మొదలైన కెరీర్.. ఆల్‌రౌండర్

  అదిరే అభి కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా పని చేశాడు. ఈ క్రమంలోనే ఎన్నో కార్యక్రమాల్లో తన ప్రతిభను చూపించి మన్ననలు పొందాడు. అలా బుల్లితెరపైకి యాంకర్‌గానూ ఎంట్రీ ఇచ్చాడు. అందులోనూ సక్సెస్ అయిన అతడు.. ఆ తర్వాత ఎన్నో షోలు, సినిమా ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లను హోస్ట్ చేశాడు. ఇలా అన్ని రకాల యాంగిల్స్ చూపిస్తూ ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు.

  డైరెక్టర్ అవ్వాలని.. యాక్టర్‌గా మారి

  డైరెక్టర్ అవ్వాలని.. యాక్టర్‌గా మారి

  డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు అభి. ఈ క్రమంలోనే కొంత మంది దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఆ సమయంలోనే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఈశ్వర్' అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో మంచి మంచి పాత్రలను పోషించాడు. అలాగే, ‘బాహుబలి' సహా కొన్ని చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌నూ వర్క్ చేశాడతను.

  జబర్ధస్త్‌తో మారిన లైఫ్... పర్మినెంట్

  జబర్ధస్త్‌తో మారిన లైఫ్... పర్మినెంట్

  యాంకర్‌గా, యాక్టర్‌గా బిజీగా గడుపుతోన్న సమయంలోనే అదిరే అభి జబర్ధస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతడు టీమ్ లీడర్ అయిపోయాడు. అప్పటి నుంచి రకరకాల స్కిట్లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. అదే సమయంలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తద్వారా ఈ షోలో పర్మినెంట్ టీమ్ లీడర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

  ఆది సహా వాళ్లందరినీ తీసుకొచ్చాడు

  ఆది సహా వాళ్లందరినీ తీసుకొచ్చాడు

  సుదీర్ఘమైన కెరీర్‌లో అదిరే అభి ఎంతో మంది ఆర్టిస్టులను జబర్ధస్త్‌ షోలోకి తీసుకొచ్చాడు. తద్వారా వాళ్ల టాలెంట్‌ను పది మందికి చూపించుకునే అవకాశం ఇచ్చాడు. అలా వచ్చిన వారిలో ఇప్పటి టీమ్ లీడర్ హైపర్ ఆది కూడా ఒకడు. అతడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అభినే అని ఎన్నో సార్లు చెప్పాడు. అతడితో పాటు నవీన్, రాము సహా పలువురు జబర్ధస్త్‌లో కొనసాగుతున్నారు.

  సోదరితో కలిసి సుమ షోలోకి ఎంట్రీ

  సోదరితో కలిసి సుమ షోలోకి ఎంట్రీ

  యాంకర్ సుమ హోస్ట్ చేస్తోన్న షోలలో ‘క్యాష్' ఒకటి. సినీ, బుల్లితెరకు చెందిన ప్రముఖులతో సాగే ఈ గేమ్ షో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, వచ్చే వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు అదిరే అభి, రోల్ రైడా, మహేశ్ విట్టాలు తమ సోదరీమణులతో.. హిమజ తన సోదరుడితో కలిసి వచ్చారు. ఆద్యంతం సందడి సందడిగా సాగిన ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడులైంది.

  కష్టం చెబుతూ ఏడ్చిన కమెడియన్

  కష్టం చెబుతూ ఏడ్చిన కమెడియన్

  ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే కమెడియన్లకు కూడా కష్టాలుంటాయి. అవి ఎప్పుడో ఒకసారి బయట పెడుతుంటారు. ఇలా.. తన జీవితంలో జరిగిన ఓ మర్చిపోలేని అనుభవం గురించి అదిరే అభి ఇప్పుడు క్యాష్ షోలో వెల్లడించాడు. కొద్ది రోజుల క్రితం తనకు కరోనా సోకిందని చెబుతూ.. అప్పుడు ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించాడు. ఈ క్రమంలోనే అతడు ఏడ్చేశాడు.

  చనిపోతానని తలుపులు తెరిచానని

  చనిపోతానని తలుపులు తెరిచానని

  అభి మాట్లాడుతూ. ‘ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. నాకు కరోనా సోకింది. అప్పుడు చనిపోతానని భయంతో తలుపులు కూడా గొళ్లెం పెట్టకుండా పడుకునేవాడిని. తర్వాత ఏదైనా జరిగితే నన్ను చూడ్డం కుదరదని అలా చేసేవాడిని. అప్పుడు భయంతో నాన్న వాళ్లను చుట్టాలింటికి పంపేశాను. ఆ టైమ్‌లోనే నా సిస్టర్ దుబాయ్ నుంచి వచ్చి నాకు అండగా నిలబడింది' అని ఎమోషనల్ అయ్యాడు.

  English summary
  Tollywood Actor, Jabardasth Comedian Adire Abhi Participated in Suma Kanakala Cash Show. In This Show.. He Shocking Comments on his Health Condition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X