బిగ్‌బాస్ 8 తెలుగు: వాళ్లకు నో ఛాన్స్, కొత్త కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే..బాంబు పేల్చిన ఆదిరెడ్డి
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. దీంతో తెలుగునాట బిగ్‌బాస్ ఫీవర్ పట్టుకుంది. షో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, కంటెస్టెంట్స్‌గా ఎవరెవరు రానున్నారు , కొత్తగా రూల్స్ ఏమైనా వచ్చాయా ఇలాంటి అంశాల గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారం లేదా రెండో వారంలో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానుందని సోషల్ మీడియా టాక్. త్వరలోనే మేకర్స్ అఫీషియల్‌గా డేట్ అనౌన్స్ చేయనున్నారు.
గత సీజన్‌ల మాదిరిగానే ఈసారి కూడా కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. బిగ్‌బాస్ తెలుగు ప్రారంభమయ్యాక కేవలం రెండు సార్లు తప్పితే మిగిలిన అన్ని సార్లు నాగ్ ఈ షోకి వ్యాఖ్యాతగా చేశారు. ఈ రెండు సార్లూ జూనియర్ ఎన్టీఆర్, నానిలు హోస్ట్‌లుగా చేశారు. తాజా సీజన్‌కు గాను స్టార్ మా ప్రోమోను రిలీజ్ చేసింది. వరాలిచ్చే కింగ్‌గా జీని గెటప్‌లో నాగ్ కనిపించి సందడి చేశారు. ఏం కావాలన్నా లిమిట్ లెస్‌గా ఇస్తానని , కానీ అడిగే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని చెబుతాడు. ఈ ప్రోమో.. నాగ్ గెటప్ చూస్తే నిర్వాహకులు ఈసారి కొత్తగా ఏదో ప్లాన్ చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

బిగ్‌బాస్ మేనియా నేపథ్యంలో ఈ షో గురించి అప్‌డేట్స్ తెలుసుకోవడానికి యూట్యూబర్లను, సోషల్ మీడియా ఖాతాలను తెగ జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ , యూట్యూబర్ ఆదిరెడ్డి ఖాతాను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగింది. బిగ్‌బాస్ రివ్యూవర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆదిరెడ్డి.. అదే షోకి కంటెస్టెంట్‌గా వెళ్లి షాకిచ్చారు. షోకి వెళ్లొచ్చిన తర్వాత కూడా రివ్యూవర్‌గానే కొనసాగుతూ.. వరుస వీడియోలు, అనాలిసిస్‌తో ఆకట్టుకుంటున్నాడు.
బిగ్‌బాస్ సీజన్ 8 గురించి కొత్త కొత్త సంగతులు పంచుకుంటున్నారు. తాజాగా ఆదిరెడ్డి అప్‌లోడ్ చేసిన కొత్త వీడియోలు బిగ్‌బాస్ షో గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ , టీమ్ అంతా మారిపోయిందని ఆదిరెడ్డి తెలియజేశారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక, వారి ఫైనల్ ఇంటర్వ్యూలు ముగిశాయని అన్నపూర్ణ పరిసరాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయని వెల్లడించారు.
అలాగే కంటెస్టెంట్స్‌గా ఎవరు రాబోతున్నారోనంటూ కొన్ని కొత్త పేర్లు చెప్పి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు ఆదిరెడ్డి. వాళ్లు ఎవరంటే యాష్మీ గౌడ, అంజలి పవన్, సౌమ్యా రావ్, బబ్లూ, రీతూ చౌదరి, విష్ణుప్రియ, సెల్వరాజ్, ఆదిత్య ఓం, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, వేణుస్వామి, తేజస్విని గౌడ, అబ్బాస్, జబర్దస్త్ పవిత్ర, కిరాక్ ఆర్పీ, ఏక్‌నాథ్ హారిక, సౌమ్యా జాను, నిఖిల్, ప్రేరణ. సోషల్ మీడియాలో ఉన్న సమాచారం, తనకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ పేర్లను ప్రస్తావించినట్లు ఆదిరెడ్డి వెల్లడించారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











