బిగ్‌బాస్‌లో ఛాన్స్ అంటూ అలాంటి మోసాలు.. బయట పెట్టిన ఆదిరెడ్డి
భారతీయ బుల్లితెరలపై రియాలిటీ షోలకే బాప్ లాంటి బిగ్‌బాస్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిందీలో సక్సెస్ అయిన బిగ్‌బాస్‌ను ఆపై భారతీయ ప్రాంతీయ భాషల్లోనూ దించారు. ఈ క్రమంలోనూ మన తెలుగులోనూ అడుగుపెట్టిన బిగ్‌బాస్ సక్సెస్‌ఫుల్‌గా 7 సీజన్లను కంప్లీట్ చేసుకుని ఈ ఏడాదితో 8వ సీజన్‌లో అడుగుపెట్టనుంది.
భావోద్వేగాలు, మైండ్ గేమ్, ఫిజికల్, మెంటల్ టాస్క్‌లతో సెలబ్రెటీల ఇన్‌సైడ్‌ను ఆవిష్కరించే బిగ్‌బాస్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇంటిల్లిపాది హాయిగా కూర్చొని చూస్తూ.. నెక్ట్స్ ఏం జరుగుతుందోనని తర్వాతి రోజు రాత్రి వరకు వెయిట్ చేస్తూ ఎగ్జయిటింగ్ ఫీల్ అవుతారు. దీనికి ఓటింగ్.. ఇష్టమైన వారి కోసం క్యాంపెయినింగ్‌తో బిగ్‌బాస్ సీజన్ మొత్తం ఓ రకమైన ఫీవర్ నడుస్తుంది. సెలబ్రెటీలతో పాటు సామాన్యులకు కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం ఉండటం, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు సాదాసీదా వ్యక్తులు కూడా హౌస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులను అలరిస్తున్నారు.

నూతన్ నాయుడు, ఆదిరెడ్డి, గీతూ రాయల్, పల్లవి ప్రశాంత్ వంటి వారు బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన సామాన్యులు. కానీ ఓ కామన్‌మెన్ ఇంత వరకు టైటిల్ విన్నర్ కాలేదు.. అలాంటిది గతేడాది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ట్రోఫీ గెలిచి సత్తా చాటాడు. ఫేమ్, నేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సెలబ్రెటీలను పక్కకునెట్టి ప్రశాంత్ టైటిల్ కొట్టాడు. అతని స్పూర్తితో పలువురు సామాన్యులు బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాలని కలగంటున్నారు. అయితే వీరి వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుని కొందరు కేటుగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి హెచ్చరిస్తున్నారు.
బిగ్‌బాస్ రివ్యూవర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆదిరెడ్డి.. అదే షోకి కంటెస్టెంట్‌గా వెళ్లి షాకిచ్చారు. షోకి వెళ్లొచ్చిన తర్వాత కూడా రివ్యూవర్‌గానే కొనసాగుతూ.. వరుస వీడియోలు, అనాలిసిస్‌తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా 8వ సీజన్ ప్రారంభం కానుండటంతో బిగ్‌బాస్ పేరిట జరిగే మోసాల గురించి ఆదిరెడ్డి ఓ వీడియో చేశాడు. ఒకవేళ బిగ్‌బాస్‌లో అవకాశం వస్తే.. ఓ వ్యక్తి ఫోన్ చేసి అధికారికంగా మెయిల్ పంపిస్తాడని తెలిపాడు.
అనంతరం జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూ జరుగుతుందని .. తర్వాత రెమ్యునరేషన్‌పై బేరసారాలు, వైద్య పరీక్షలు, మెయిన్ ఇంటర్వ్యూ జరగుతుందని ఆదిరెడ్డి వెల్లడించాడు. అంతేకానీ రికమెండేషన్‌తో ఎట్టి పరిస్ధితుల్లోనూ బిగ్‌బాస్‌లో ఎంట్రీ దొరకదని.. అలా ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే అతను ఖచ్చితంగా మోసగాడేనని , అలాంటి వారి ట్రాప్‌లో పడొద్దని ఆదిరెడ్డి హెచ్చరించాడు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలాఉండగా.. బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ఈ నెల చివరి వారంలో కానీ, సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో కానీ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక, వారి ఫైనల్ ఇంటర్వ్యూలు ముగిశాయని అన్నపూర్ణ పరిసరాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రెండ్రోజుల క్రితం బిగ్‌బాస్ తెలుగు 8 ప్రోమో సైతం రిలీజ్ చేసింది స్టార్ మా . ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ సీజన్‌పై అంచనాలను పెంచేసింది.


Click it and Unblock the Notifications











