యాంకర్ రవి అవుట్, శ్రీముఖి ఇన్.. ‘అదిరింది’కి రిపేర్లు.. ఈసారైనా వర్కౌట్ అవుతుందా!!

జబర్దస్త్ షో నుంచి నాగబాబు బయటకు రావడానికి కారణం నితిన్ భరత్ అనే డైరెక్టర్లు. మల్లెమాల వారితో నితిన్-భరత్‌లకు మనస్పర్దలు రావడంతో వారు బయటకు వచ్చారు. వారిని సపోర్ట్ చేయడం కోసం నాగబాబు కూడా బయటకు వచ్చాడు. జబర్దస్త్‌కు ధీటుగా అదిరింది షోను ప్రారంభించారు. నవదీప్, యాంకర్ రవి, సమీర వంటి వారితో గ్రాండ్‌గానే లాంచ్ చేశారు. జబర్దస్త్‌లోని పాత టీం లీడర్లను పట్టుకునే బాగానే ప్లాన్ చేశారు. కానీ అంతగా వర్కౌట్ కాలేదు.

మొదట్లోనే అలా...

మొదట్లోనే అలా...


అదిరింది షోకు మొదట్లో పెద్ద దెబ్బ తగిలింది. మొదటగా యాంకర్ రవితో పాటు సమీర అనే లేడీ యాంకర్‌ను తీసుకున్నారు. మధ్యలో ఆమెను తీసేశారు. భాను శ్రీని పెట్టి నడిపించారు. అయితే ఈ షో మొదటి నుంచి కాస్త వెనకబడే ఉంటోంది. రేటింగ్‌లో ఏనాడూ జబర్దస్త్‌కు దరిదాపుల్లో రాలేదు.

అవే స్కిట్స్, అవే పంచ్‌లు..

అవే స్కిట్స్, అవే పంచ్‌లు..


చమ్మక్ చంద్ర, వేణు వండర్స్, ధన్‌రాజ్, గల్లీ బాయ్స్ గ్యాంగ్స్ చేసే కామెడీ స్కిట్స్ కూడా అంతగా వర్కౌట్ కావడం లేదు. మధ్యలో కొన్నిసార్లు కాంట్రవర్సీలు రావడంతో షోపై హైప్ పెరిగింది. డబుల్ మీనింగ్ డోసు కూడా పెరిగిందనే నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.

గ్రాండ్‌గా 25వ ఎపిసోడ్..

గ్రాండ్‌గా 25వ ఎపిసోడ్..


అదిరింది 25వ ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. అయితే ఆ తరువాతే ఈ షోకు రిపేర్లు మొదలయ్యాయి. మొత్తానినికి అదిరింది మొదటి వర్షెన్ కథ ముగిసింది. ప్రస్తుతం బొమ్మ అదిరింది అంటూ మరోసారి ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో తెగ వైరల్అవుతోంది.

భారీ మార్పులు..

భారీ మార్పులు..

కొత్తగా రాబోతోన్న బొమ్మ అదిరిందిలో భారీ మార్పులు వచ్చాయి. సుమ, అలీ, జానీ మాస్టర్, శ్రీముఖి వంటివారంతా సందడి చేశారు. అయితే నవదీప్, యాంకర్ రవి, భాను శ్రీలు మాత్రం ఇందులో కనిపించడం లేదు. వీరంతా షో నుంచి బయటకు వెళ్లారని తెలుస్తోంది.

Recommended Video

Adirindi Comedy Show Anchor Sameera Out Of The Show

అందుకే అక్కడ..

అందుకే యాంకర్ రవి ఈ వారం జబర్దస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది. అందులో రోహిణి కూడా ఈ మేరకు ఓ సెటైర్ కూడా వేసింది. కొందరు అక్కడా ఇక్కడా తిరిగి చివరకు ఇక్కడికే వస్తారు అంటూ రవికి బాగానే కౌంటర్ వేసింది. ఇక నవదీప్ మరి మళ్లీ తన సినిమాలతో బిజీ అవుతాడేమో చూడాలి. మరి ఈ బొమ్మ అదిరింది అయినా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X