Bigg Boss Telugu 8 Voting : ఓటింగ్‌లో రారాజుగా నబీల్.. 5వ వారం టాప్‌లోనే, దారుణంగా పడిపోయిన విష్ణుప్రియ

బిగ్‌బాస్ తెలుగు 8 నాలుగో వారాన్ని కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఐదో వారంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్‌లు ఎలిమినేట్ కాగా.. నాలుగో వారం ఎవ్వరూ ఊహించని విధంగా సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం నామినేషన్స్ పూర్తి కాగా.. ఈ ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు, ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీకోసం

సోమవారం నాటి ఎపిసోడ్‌లో ముందుగా డేంజర్ జోన్‌లో ఉన్న మణికంఠను జైల్లో పెట్టాలని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆదేశించాడు. అతనికి ఫుడ్ పెట్టే బాధ్యతని సీతకి అప్పగించాడు. సోనియా వెళ్లిపోవడంటో విష్ణుప్రియ- ప్రేరణ ఆమెకు సంబంధించిన విషయాలపై ముచ్చట్లు పెట్టారు. తన గురించి చెడుగా చెప్పిన విష్ణుప్రియను వదిలిపెట్టనని నామినేషన్‌లో ఇది పాయింట్ రైజ్ చేస్తానని నిఖిల్ చెబుతాడు. కాసేపటికీ మణికంఠను జైలు నుంచి విడుదల చేయాలని బిగ్‌బాస్ ఆదేశిస్తాడు. అతనిని నబీల్, ఆదిత్య ఓంలు భుజాలపై ఎత్తుకుని తీసుకొస్తారు.

aditya om and nainika at danger zone in 5th week bigg boss telugu 8 voting here s the details

అనంతరం ఐదో వారం నామినేషన్స్ మొదలుపెట్టాడు బిగ్‌బాస్. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలని .. ఎవరి ప్రయాణాన్ని బూడిద చేయాలని భావిస్తున్నారో వారి ఫోటోలును ఫైర్‌లో వేయాలని చెబుతాడు. చీఫ్‌లుగా ఉండటంతో సీత, నిఖిల్‌లను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదని సూచిస్తాడు. ముందుగా మణికంఠ వచ్చి నైనిక, యష్మీలకు వేశాడు. నైనిక .. నబీల్, విష్ణుప్రియలను , సీత .. మణికంఠ, విష్ణుప్రియలను, నబీల్.. విష్ణుప్రియ, నైనికలను, ఆదిత్య ఓం.. నైనిక, విష్ణుప్రియలను, నిఖిల్ .. విష్ణుప్రియ, మణికంఠలను, ప్రేరణ... మణికంఠ, ఆదిత్య ఓం, విష్ణుప్రియ.. నైనిక, నబీల్‌లను, యష్మి గౌడ.. మణికంఠ, ఆదిత్య ఓంలను నామినేట్ చేసింది.

చివరిలో చీఫ్‌లుగా ఉన్న నిఖిల్, సీతలకు బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు చీఫ్‌లలో ఒకరిని సేవ్ చేసి, మరొకరిని నామినేట్ చేయాలని ఇంటి సభ్యులను ఆదేశించారు. మెజారిటీ సభ్యులు సీతను సేవ్ చేయాలని అభిప్రాయపడటంతో నిఖిల్ నామినేషన్స్‌లోకి వచ్చాడు. మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్‌ నామినేషన్స్‌లో ఉన్నారు. వారు విష్ణుప్రియ, నైనిక, మణి, ఆదిత్య ఓం, నబిల్, నిఖిల్. ఈ వారం రెండు ఎలిమినేషన్స్ ఉంటాయని హోస్ట్ నాగార్జున బాంబు పేల్చాడు. ఒకటి మిడ్ వీక్, రెండోది ఆదివారం ఉంటాయని చెప్పారు. దీంతో ఆ ఇద్దరు ఎవరు అన్నది సస్పెన్స్‌గా మారింది.

మరోవైపు.. నామినేషన్స్ ముగియడంతో ఓటింగ్ లైన్లు తెరచుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌ను బట్టి చూస్తే నబీల్ 24.9 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉండగా.. అనుకోకుండా నామినేషన్స్‌లోకి వచ్చిన నిఖిల్ 24.9 శాతం ఓటింగ్‌తో గట్టి పోటీ ఇస్తున్నాడు. మణికంఠ 18.2 శాతం ఓట్లతో టాప్ 3లో నిలిచాడు. ఇక యాంకర్ విష్ణుప్రియ ఓటింగ్‌లో వెనుకబడటం చర్చనీయాంశమైంది. గతంలో టాప్‌లో ఉన్న ఆమె ఈ వారం కేవలం 16.7 శాతం ఓట్లను మాత్రమే పొందగలిగారు. ఆదిత్య ఓం (11.3 శాతం), నైనిక (9 శాతం) ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి వీరిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ఈ రెండ్రోజుల్లో ఓటింగ్‌ను బట్టి రిజల్ట్స్ తారుమారు కావడానికి అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X