Bigg Boss Telugu 8 Voting : మెరుగుపడని ఓటింగ్.. ఆ ఇద్దరిపై ఎలిమినేషన్ కత్తి, విష్ణుప్రియకి డేంజర్ బెల్స్!
బిగ్‌బాస్ తెలుగు 8 నాలుగో వారాన్ని కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఐదో వారంలోకి ప్రవేశించింది. ఐదో వారం నామినేషన్స్ పూర్తి కాగా.. మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. వారు విష్ణుప్రియ, నైనిక, మణి, ఆదిత్య ఓం, నబిల్, నిఖిల్. ఈ వారం రెండు ఎలిమినేషన్స్ ఉంటాయని హోస్ట్ నాగార్జున ఇప్పటికే బాంబు పేల్చాడు. ఒకటి మిడ్ వీక్, రెండోది ఆదివారం ఉంటాయని చెప్పారు. దీంతో ఆ ఇద్దరు ఎవరు అన్నది సస్పెన్స్‌గా మారింది. దీంతో ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు, ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీకోసం ..
సోనియా వెళ్లిపోవడంతో యష్మీగౌడ ఆమె ప్లేస్‌ని ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. ఇంతకాలం తాను ఏం చేసినా సోనియా అన్ని రకాలుగా విరుచుకుపడేది. ఇప్పుడు హౌస్‌లో నాకు ఎదురె లేదన్నట్లుగా యష్మీ రెచ్చిపోతోంది. ఆటలోనూ, మాటలోనూ ఆమె దూకుడు పెంచింది. ఐదు వారాలుగా జరుగుతున్న బిగ్‌బాస్‌లో ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా గెలవని యష్మీ.. తొలిసారిగా ఓ గేమ్ గెలిచేసరికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. ఆ కాస్త దానికే ఆమె ఎక్స్‌ట్రాలు మామూలుగా లేవు.

మంగళవారం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఛాలెంజ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు జాగ్రత్తగా నడు.. లేకపోతే పడతావ్ అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా 8 బంతులను సీసాపై నిలబడి బాస్కెట్‌లో వేయాలి. ఎవరైతే ముందుగా వేస్తారో వారు గెలిచినట్లు. యష్మీని నిఖిల్, పృథ్వీలు గైడ్ చేస్తూ గెలిపించారు. ఆటలో గెలవడంతో సంబరాలు చేసుకున్న యష్మీ.. మరో టాస్క్‌లో ఓడిపోయిన నబీల్‌ను ఉద్దేశించి హేళనగా మాట్లాడింది. గత వారం నబీల్‌ను నాగార్జున ముందు పొగిడిన యష్మీ.. ఇప్పుడు మాత్రం అతని ఆటను తప్పుబట్టింది.
ఇదిలాఉండగా.. హౌస్‌లోకి 12 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఇప్పటికే బిగ్‌బాస్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వారు ఎవరనే దానిపై మీడియాలో రకరకాల పేర్లు వైరల్ అవుతున్నాయి. చాలా వరకు బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్సే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో టేస్టీ తేజా, గీతూ రాయల్, ముక్కు అవినాష్ వంటి వాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్మెంట్ మిస్ అయ్యిందని భావిస్తోన్న బిగ్‌బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌లో మంచి ఫన్ క్రియేట్ చేసేవాళ్లకి ఛాన్స్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియా టాక్.
మరోవైపు.. నామినేషన్స్ ముగియడంతో ఓటింగ్ లైన్లు తెరచుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌ను బట్టి చూస్తే నబీల్ 26.22 శాతం ఓటింగ్‌తో టాప్‌లో కొనసాగుతున్నాడు. బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్‌తో అనుకోకుండా నామినేషన్స్‌లోకి వచ్చిన నిఖిల్ 25.62 శాతం ఓటింగ్‌తో అతనికి గట్టి పోటీ ఇస్తున్నాడు. మణికంఠ 18.94 శాతం ఓట్లతో టాప్ 3లో నిలిచాడు. ఇక యాంకర్ విష్ణుప్రియ (14.51 శాతం) ఓటింగ్‌లో వెనుకబడటం చర్చనీయాంశమైంది.

ఆదిత్య ఓం (9.01 శాతం), నైనిక (5.7 శాతం) ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి వీరిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. ఈ రెండ్రోజుల్లో ఓటింగ్‌ను బట్టి రిజల్ట్స్ తారుమారు కావడానికి అవకాశాలు ఉన్నాయి. టాస్క్‌లలో ఆదిత్య రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇప్పటికే మంగళవారం ఓ టాస్క్‌లో గెలిచి ఓటింగ్ మెరుగుపరచుకునే లక్ష్యంతో ఉన్నాడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











