బిగ్‌బాస్ షో ఓ మెంటల్ కేసు .. ఆ కంటెస్టెంట్‌ను జంతువుతో పోలుస్తూ, ఆదిత్య ఓం షాకింగ్ కామెంట్స్
ఎన్నో అంచనాల మధ్య మొదలైన బిగ్‌బాస్ తెలుగు 8లో అడుగుపెట్టారు ఆదిత్య ఓం. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం లాహిరి లాహిరిలో మూవీతో తెలుగు వారిని పలకరించిన ఆయన మళ్లీ ఇన్నేళ్లకు తెలుగు షోలో ఎంట్రీ ఇచ్చారు. కానీ పట్టుమని ఐదు వారాలు కూడా ఉండకుండానే ఆదిత్య ఎలిమినేట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అర్జున్ అంబటి నిర్వహిస్తున్న బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదిత్య కీలక విషయాలు పంచుకున్నారు ఆ వివరాల్లోకి వెళితే :
బిగ్‌బాస్ తెలుగు 8లో స్టార్ సెలబ్రెటీ ఆదిత్యనే. తెలుగువారిని పలు సినిమాలతో అలరించడంతో పాటు ఇప్పటికీ ఫిల్మ్ మేకింగ్‌లోనే ఉన్నారు. కాకపోతే తెలుగులో కాదు.. వేరే భాషల్లో . బిగ్‌బాస్‌లోకి ఆయన కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నారని తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. చాలా రోజుల తర్వాత ఆదిత్యను చూడబోతున్నందుకు చాలా సంతోషించారు. అయితే వయసులో పెద్ద కావడంతో ఆయన ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండరని అనుకున్నారు.

బెజవాడ బేబక్క తొలివారం ఎలిమినేట్ కాగా.. సెకండ్ వీక్ ఖచ్చితంగా హౌస్‌ను వీడేది ఆదిత్యనే అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన నాలుగు వారాలు ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో గ్రూప్ గేమ్స్ ఆడినా.. తనపై నిందలు వేసినా వాటిని పట్టించుకోకుండా, తన వయసుకు తగిన విధంగా మెచ్యూరిటీతో వ్యవహరించారు. హౌస్‌లో ఉన్నవాళ్లంతా కుర్రాళ్లు కావడంతో వారికి సలహాలు ఇస్తూ.. మంచితనంతో తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నారు.
శివాజీ, శివ బాలాజీ మాదిరిగా ఆదిత్య కూడా షాక్ ఇస్తాడా అనుకున్నట్లుగా వ్యవహరించారు. కానీ ఐదో వారం మిడ్ వీక్‌లో ఓ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పినప్పుడే చాలా మంది అది ఆదిత్య అనే అనుకున్నారు. ఊహించినట్లుగానే ఆయన ఎలిమినేట్ అయ్యారు. నాలుగు వారాల పాటు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నందుకు ఆదిత్య బాగానే రెమ్యునరేషన్ అందుకున్నారని టాక్. వారానికి రూ. 3 లక్షల చొప్పున మొత్తంగా రూ. 14 లక్షలకు పైగా పారితోషికం కింద తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇక బిగ్‌బాస్ హౌస్‌ను వీడిన తర్వాత అర్జున్ అంబటి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ బజ్ షోలో ఇంటర్వ్యూ ఇచ్చారు ఆదిత్య ఓం. ఈ సందర్భంగా కీలక విషయాలను వెల్లడించారు. వచ్చి రాగానే మార్షల్ ఆర్ట్స్‌ను ప్రదర్శించిన ఆదిత్య.. అర్జున్‌కి కూడా నేర్పించాడు. బిగ్‌బాస్‌లో నేనున్న రోజులను సైకాలజీ, ఓ పెద్ద మెంటల్ టెస్ట్‌గా అభివర్ణించారు ఆదిత్య. హౌస్‌లో ఉండాలని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎలిమినేట్ అయ్యానని.. సీత వెన్నుపోటు పొడిచిందని ఆయన తెలిపారు.
వెన్నుపోటు పొడిచినప్పటికీ సీతను సోల్ ఆఫ్ ది హౌస్ అని ప్రశంసించి తన మంచి మనసును చాటుకున్నారు ఆదిత్య. చివరిలో మణికంఠను మనిషివా, జంతువా ఎన్నిసార్లు నీ దగ్గరికొచ్చి కరెక్ట్ సలహా ఇచ్చినా సరిగా రిసీవ్ చేసుకోలేదు.. లైఫ్‌లో ఎప్పుడు నేర్చుకుంటావ్, చిన్న బుర్ర ఉందా అని సీరియస్‌గా చెబుతాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అయిపోతుంది. మరి బిగ్‌బాస్‌లో తన జర్నీ, హౌస్ మెట్స్‌తో అనుబంధంపై ఆదిత్య ఓం ఏం చెప్పారో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











