Bigg Boss Telugu 8: మిడ్ వీక్ ఎలిమినేట్‌లో బిగ్ ట్వీస్ట్.. కన్నడ కంత్రీ బ్యాచ్‌కు టాప్ కంటెస్టెంట్ బలి!
Bigg Boss Telugu 8 Mid Week Elimination: బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని రోజులు ఉన్నామని కాదా అన్నయ్య.. మంచి పేరుతో బయటకు వచ్చామా? లేదా? అనేదే ముఖ్యం. అలాంటి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎంత కంత్రీ పనులు చేసినా.. ఎంత మంది గ్రూప్ గేమ్ ఆడినా.. వాటిని పట్టించుకోకుండా తన మంచితనాన్ని నిలబెట్టుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. కానీ, మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేయడంతో కన్నడ కంత్రీ బ్యాచ్ చేష్టాలకు ఆదిత్య ఓం బలైనట్టు తెలుస్తోంది.
నిజంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, డబుల్ ఎలిమినేషన్ అంటూ షోపై క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్. ఇప్పటికే వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో హౌస్ లోకి ఎవరూ రాబోతున్నారనే చర్చ జోరుగా జరుగుతుంటే.. ఇంతలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందంటూ మైండ్ బ్లోయింగ్ అనౌన్స్ మెంట్ చేశారు బిగ్ బాస్. ఇంతకీ ఎవరూ డేంజర్ లో ఉన్నారు? ఎవరూ మిడ్ వీక్ ఎలిమినేట్ అవబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. తాజా అప్డేట్ ప్రకారం ఓ స్ట్రాంగ్ కంటెస్టెంట్ మిడ్ వీక్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.

అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ పేరిట ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 లో మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ దిమ్మతిరిగే ట్వీస్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. హోస్ట్ నాగార్జున చెప్పిన ప్రకారం నేడు (గురువారం) షోలో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే ఎలా చేస్తారు? ఈ వారం నామినేషన్ లో ఉన్న వారిని ఎలిమినేట్ చేస్తారా? లేదా ప్రస్తుతం జరుగుతున్న టాస్కులను బేస్ చేసుకొని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తారా? అనేది చర్చనీయంగా మారింది.
ఎందుకంటే.. ఇప్పటికే బిగ్ బాస్ లైవ్ ని లేపేసారు. లైవ్ కంటీన్యూ చేస్తే.. ఎలిమినేట్ ఎవరయ్యారనే విషయం తెలిసిపోతుంది కాబట్టి లైవ్ కట్ చేశారు. ఆదివారం నాటి ఎపిసోడ్ లోవైల్డ్ కార్డు ఎంట్రీ ల తర్వాత నుంచి బిగ్ బాస్ లైవ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. బుధవారం రాత్రే.. మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టారు. గతంలో కూడా ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ కి అర్థరాత్రి టైంలోనే చేపట్టేవారు. పడుకున్న కంటెస్టెంట్ల అందర్నీ నిద్రలేపి.. ఎవరైతే నామినేషన్ లో ఉన్నారో వారిని నిలబెట్టి అందులో ఒకరిని ఎలిమినేట్ చేసేవారు.
ప్రోమో చూస్తే.. నామినేషన్లో ఉన్న ఆరుగురులో నబిల్, నిఖిల్, మణికంఠ టాప్ లో ఉండటంతో వారిని సేవ్ అయినట్టు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు అంటే.. ఆదిత్య ఓం, నైనిక, విష్ణు ప్రియ మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురులో ఒకరిని ఎలిమినేట్ చేసే భాద్యత హౌస్ మెట్స్ కు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలిమినేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే.. మణికంఠ లీస్ట్ ఓటింగ్ లో ఉంటే కంటెస్టెంట్ల అంతా.. మణినే ఎలిమినేట్ చేసేవారు. కచ్చితంగా టార్గెట్ చేసి బయటకు పంపేవారు. కానీ టాప్ లో ఉండటంతో మణికంఠ ను సెవ్ చేసిసేఫ్ జోన్ లో పెట్టారు బిగ్ బాస్.
మణికంఠ తరువాత రెండో ఆప్షన్ లో ఉన్నది ఆదిత్య ఓం మాత్రమే. ఎందుకంటే.. విష్ణు ప్రియ, నైనికలు అంతా హౌస్ లో గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఏ విధంగా చూసినా కూడా ఆదిత్య హోమ్ కి సపోర్ట్ లభించదు. ముఖ్యంగా కన్నడ బ్యాచ్ అయితే ఆదిత్య ఎలిమినేట్ కావాలని చేస్తారు. నబిల్ సపోర్ట్ చేసిన మనికంఠ మాత్రం అసలు సపోర్టు చేయరు. ఈ వారం నామినేషన్స్ లో నిలబెట్టిన ఆదిత్య ను సేవ్ చేస్తాడంటే బిగ్ క్వశ్చన్ మార్కే. కాబట్టి ఓటింగ్ పరంగా చూస్తే.. విష్ణు ప్రియ, నైనికలు సేఫ్ అవుతారు. ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











