Bigg Boss Telugu 8 Voting : ఓటింగ్‌లో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఈ వీక్‌లో ఫస్ట్ వికెట్ అతనేనా?
బిగ్‌బాస్ తెలుగు 8 ఐదో వారం మంచి వినోదాన్ని అందిస్తోంది. 14 మందితో ప్రారంభమైన ఈ సీజన్‌లో బేబక్క , ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల ఎలిమినేషన్‌తో 10 మంది మిగిలారు . ఐదో వారం నామినేషన్స్ ఓ రేంజ్‌లో జరగ్గా.. ప్రేక్షకులకు అసలు సిసలు వినోదం అందుతోంది. ఇప్పటికే ఐదో వారం నామినేషన్స్ పూర్తి కాగా.. మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. వారు విష్ణుప్రియ, నైనిక, మణి, ఆదిత్య ఓం, నబిల్, నిఖిల్. దీంతో ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఏ కంటెస్టెంట్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వివరాలు మీకోసం ..
ఐదో వారం కాంతారా టీమ్ ఎక్కువ టాస్క్‌లు గెలుచుకోవడంతో వారికి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీరి టీమ్‌లో నుంచి ఒకరు నేరుగా చీఫ్ కావొచ్చునని , అది మీలో మీరు చర్చించుకోవాలని సూచించాడు. దీంతో యష్మీ రెచ్చిపోయింది.. నాకు ఆల్రెడీ చీఫ్‌గా చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందని తన క్వాలిఫికేషన్స్ బయటపెట్టింది. దానికి పృథ్వీ అభ్యంతరం తెలిపాడు. చీఫ్‌గా ఫెయిల్ అయ్యావని నువ్వే ఒప్పుకున్నావ్, మళ్లీ ఎందుకు అడుగుతున్నావని ఆమె బండారాన్ని బయటపెట్టాడు. దీంతో యష్మీ ఏడుపు స్టార్ట్ చేయగా.. పృథ్వీ వచ్చి హగ్ చేసుకుని టీమ్‌లో గొడవ సద్దుమణిగేలా చేశాడు.

ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్మెంట్ కాస్తంత తగ్గిందని భావించిన బిగ్‌బాస్ .. 12 మందిని వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి పంపాలని భావిస్తున్నాడు. ఆ 12 మంది ఎవరంటూ మీడియాలో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. టేస్టీ తేజా, యాంకర్ రవి, మెహబూబ్, రోహిణి, నయని పావని, హరితేజ, అవినాష్, గౌతమ్ కృష్ణ, గంగవ్వ, గలాటా గీతూ కన్ఫర్మ్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 12 మందిని ఒకేసారి హౌస్‌లోకి పంపుతారా లేదంటే వారానికి నలుగురు చొప్పున , మూడు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫినిష్ చేసి లెక్క సరిచేస్తారా అన్నది ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు.. నామినేషన్స్ ముగియడంతో ఓటింగ్ లైన్లు తెరచుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌ను బట్టి చూస్తే నబీల్ 26.16 శాతం ఓటింగ్‌తో ముందంజలో ఉన్నాడు. ఈ సీజన్‌లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ.. హౌస్‌ని నడిపిస్తున్న నిఖిల్ 25.60 శాతం ఓటింగ్‌తో నబీల్‌తో నెక్ టూ నెక్ పోటీ పడుతున్నాడని సోషల్ మీడియా టాక్. మణికంఠ 18.08 శాతం ఓట్లతో టాప్ 3లో నిలిచాడు. ఇక యాంకర్ విష్ణుప్రియ (14.72 శాతం) దగ్గరే ఉండటంతో ఆమె అభిమానులు హర్ట్ అవుతున్నారు.

ఓటింగ్‌లో చివరి నుంచి రెండు స్థానాల్లో ఆదిత్య ఓం (9.27 శాతం), నైనిక (6.16 శాతం) ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. గత రెండ్రోజుల నుంచి వీరిద్దరూ మంచి ఆట ఆడుతున్నా ఓటింగ్ స్వల్పంగానే పెరిగింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ముందే బాంబు పేల్చడంతో వీరిలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఆదిత్య ఓం హౌస్‌ను వీడినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











