Bigg Boss Telugu 8: మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓం అవుట్.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే?
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నాడు చూడని విధంగా అన్ లిమిలెట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఓకే వారంలో డబుల్ ఎలిమినేషన్ దిమ్మతిరిగే షాకులు ఇస్తున్నారు బిగ్ బాస్. వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో హౌస్ లోకి ఎవరూ వస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతున్న వేళ .. సడెన్ గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ మైండ్ బ్లోయింగ్ అనౌన్స్ మెంట్ చేశారు. నిన్నటి (గురువారం) ఎపిసోడ్ ఎవరు ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆదిత్య ఓంను మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు. ఇంతకీ మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయినా ఆదిత్య ఓం ఎంత రెమ్యూనరేషన్ అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది.
అన్ లిమిటెడ్ ఎంటర్టైన్ పేరిట ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 అన్నట్టుగా దిమ్మతిరిగే ట్విస్టులు ఇస్తున్నారు. మైండ్ బ్లోయింగ్ అయ్యేలా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బిగ్ ట్వీస్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగానే గురువారం షోలో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. గురువారం రాత్రి సమయంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టారు. గత సీజన్లో కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అర్థరాత్రి టైంలోనే చేపట్టేవారు. పడుకున్న కంటెస్టెంట్లందర్నీ నిద్రలేపి.. నామినేషన్లలో ఉన్నవారిని వరుస నిలబెట్టి అందులో నుంచి ఆదిత్య ఓం ఎలిమినేట్ చేశారు.

ఈ వీక్ ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్లో ఉన్నారు. అందులో నబిల్, నిఖిల్, మణికంఠ టాప్ లో ఉండటంతో వారిని ముందుగానే సేవ్ చేశారు. మిగిలిన ముగ్గురు అంటే.. ఆదిత్య ఓం, నైనిక, విష్ణు ప్రియ మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు బిగ్ బాస్. ఈ ముగ్గురులో ఒకరిని ఎలిమినేట్ చేసే భాద్యత హౌస్ మెట్స్ కు ఇచ్చారు. ఒక్కొక్కరూ ఒక్క కారణం చెప్పుతూ.. వారిని ఎగ్జిట్ గేట్ వైపుకు తీసుకెళ్లారు. ఈ ప్రాసెస్ ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఆదిత్య ఓం బయటకు వెళ్లాడానికి ఓట్లు వేశారు. ఇలా కంటెస్టెంట్ల ఓటింగ్ పరంగా చూస్తే.. విష్ణు ప్రియ, నైనికలు సేఫ్ కాగా.. ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యారు.
ఈ క్రమంలో ఐదు వారాలకు ఆదిత్య ఓం కు ఎంత రెమ్యూనరేషన్ (Aditya Om remuneration) ఇచ్చారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకూ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల కంటే ఆదిత్య ఓం ఎక్కవనే రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ లెక్క ప్రకారం హౌజ్‌లో పార్టిస్‌పేట్ చేయడానికి ఆదిత్య ఓం వారానికి దాదాపు రూ.3 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే రోజుకు రూ. 42, 857 తీసుకున్నారన్నట్టు. ఇక హీరో ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 33 రోజులు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే.. రూ 14, 14, 281 ( 14 లక్షల 14 వేల 281 రూపాయాలు) పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ఆదిత్య ఓం వారానికి 3 లక్షలు కాదు 5 లక్షల రూపాయాలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ కి ఆదిత్య ఓం హీరో గా వచ్చారు హీరోగానే వెళ్ళిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో ఇతర కంటెస్టెంట్లు కంత్రీ పనులు చేసినా.. ఎంత మంది గ్రూప్ గేమ్ ఆడినా.. వాటిని పట్టించుకోకుండా తాను మాత్రం హీరోగా సింగిల్ గా గేమ్ ఆడారు. తన వయస్సుకు తగ్గట్టు మేచ్యూరిటీతో వ్యవహరించారు. నలుగురి సలహాలు, మార్గదర్శనం చేశారు. తన మంచితనాన్ని నిలబెట్టుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. మిడ్ వీక్ ఎలిమినేషన్ లోకన్నడ కంత్రీ బ్యాచ్ చేష్టాలకు ఆదిత్య ఓం బలయ్యారు హీరో ఆదిత్య ఓం.
ఇదెలా ఉంటే.. ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉందన్న విషయం తెలిసిందే. అంటే.. ఈ వీకెండ్ లో నైనిక హౌస్ నుంచి బయటకు రాబోతుందనీ, ఇప్పటి వరకూ వెలువడిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్ ప్రకారం.. నామినేషన్లో ఉన్న ఆరుగురులో ఆదిత్య ఓం ఎలిమినేట్ కాగా.. మిగితా ఐదుగురులో నబిల్, నిఖిల్, మణికంఠ, టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఆ తరువాత విష్ణు ప్రియ, నైనికలు డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరిలో నైనిక మాత్రం తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లోనే కొనసాగుతోంది. మిడ్ మిక్ ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా ఆ విషయం తెలిసిందే. సో ఈ వారం ఎలిమినేట్ అయింది డ్యాన్సర్ నైనికనే.


Click it and Unblock the Notifications











