బిగ్‌బాస్ స్టార్‌కి నటి తమ్ముడి వార్నింగ్... వేలు చూపిస్తూ, రణరంగంలా శ్రీముఖి షో

స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. వారం వారం బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలను వేదిక మీదకి తీసుకొచ్చి వారితో హోస్ట్ శ్రీముఖి ఆడిస్తూ, పాడిస్తూ ఉంటుంది. వారం వారం సరికొత్త థీమ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈ వారం సెలబ్రిటీలను వారి తోబుట్టువులను వేదిక మీదకి తీసుకొచ్చి వినోదం పంచారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఈటీవీ ప్రభాకర్ సోదరుడు సీతారాములు, కావ్యశ్రీ సోదరి కేసరి, హరితేజ సోదరి హరినిత్య, ఆషికా గోపాల్ పదుకొణె తమ్ముడు అమోఘ్‌, ప్రియాంక జైన్ తమ్ముడు జెనిల్‌, ఇమ్మాన్యుయేల్ సోదరుడు డానియేల్‌లు వేదికపై ఎంట్రీ ఇచ్చారు. తొలుత ఈటీవీ ప్రభాకర్ అన్నయ్య దగ్గరికి వెళ్లిన శ్రీముఖి.. మీ తమ్ముడిని అందరూ బుల్లితెర మెగాస్టార్ అంటారు. అలా అన్నప్పుడు మీరొక అన్నయ్యగా ఎలా ఫీల్ అవుతారని శ్రీముఖి ప్రశ్నించింది. దానికి ఆయన ఆన్సర్ ఇస్తూ.. నాగబాబు - పవన్ కళ్యాణ్‌‌లు ఫీలైనట్లుగా ఫీల్ అవుతానని సీతారాములు పంచ్ విసిరారు.

Adivaram With Star Maa Parivaram Promo Aashika Gopal Padukone brother Amogh warns Avinash

ఇమ్యాన్యుయేల్ దగ్గరికి వెళ్లిన శ్రీముఖి.. అసలు నువ్వు డానియేల్ ఎన్నేళ్లుగా బ్రదర్స్ అనడంతో ఎన్నాళ్ల నుంచి ఏంటీ? చిన్నప్పటి నుంచి అని ఇమ్మాన్యుయేల్ ఫైర్ అయ్యాడు. అనంతరం కావ్య సోదరి కేసరిలు ఎంట్రీ ఇవ్వడంతో వారికి ఫ్లైయింగ్ కిస్ ఇస్తాడు సీతారాములు. నీ పేరెంటీ అని శ్రీముఖి అడగ్గా.. ఆమె కేసరి అని చెబుతుంది, రవ్వ కేసరియా అవినాష్.. లేదు భగవంత్ కేసిరి అని ఎక్స్‌ప్రెస్ హరి పంచ్‌లు విసురుతారు. నీకొచ్చిన కొంచెం కొంచెం తెలుగులో ఏమైనా చెప్పమని శ్రీముఖి అడగ్గా.. హాయ్ అన్నా అని హరిని పిలుస్తుంది కేసరి.

తను వచ్చిందంటే నాకు భయమేస్తోందని కావ్య శ్రీ అనగా.. ఏమైనా సీక్రెట్స్ చెబుతుందని భయమేస్తుందా? అని శ్రీముఖి ప్రశ్నిస్తుంది. తర్వాత వచ్చిన ప్రియాంక జైన్‌ తమ్ముడిని ఎలా ఉన్నావంటూ ఎత్తుకుని తిప్పుతాడు అవినాష్. నీలో ఆ పెద్దరికం పోవడం లేదు.. పిల్లలు కనిపించగానే చంకలో వేసుకుని తిరుగుతున్నావని ఈటీవీ ప్రభాకర్ సెటైర్లు వేస్తాడు. అనంతరం ఆషికా గోపాల్ ఆమె తమ్ముడు అమోఘ్‌లు వేదికపైకి వస్తారు. శ్రీముఖి అందాన్ని పొగడటంతో అతనికి హగ్ ఇస్తుంది. దాంతో అవినాష్ కూడా ఆషికని హగ్ చేసుకోవడాని వెళ్లబోతుండగా ఆమె తమ్ముడు కండలు చూపిస్తే నా సిస్టర్‌ని ఫ్లర్ట్ చేస్తావా? ఇలాంటి మళ్లీ రిపీటైతే కండలో పిసికేస్తానని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. నువ్వు శ్రీముఖిని హగ్ చేసుకుంటే ఓకే .. మరి నేను చేసుకోవద్దా అని అవినాష్ అడగ్గా నో హగ్ అంటాడు అమోఘ్. ఇద్దరూ కొట్టుకోబోతుండగా శ్రీముఖి వచ్చి అడ్డుకుంటుంది.

హరితేజ ఆమె చెల్లి హరినిత్యలు వస్తారు. నా చెల్లి, మొన్ననే చేశా దాని పెళ్లి, వెయిటింగ్ ఫర్ ద అని హరితేజ చెప్పబోతుండగా హరినిత్య వెళ్లి ఆపమని అక్క కాళ్ల మీద పడుతుంది. ఇంతకుముందు టెలివిజన్‌కి వచ్చారా అని శ్రీముఖి అడగ్గా.. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చానని హరినిత్య చెప్పబోతుండగా ఇప్పుడు కూడా చిన్నగానే ఉన్నారు కదా? అని సెటైర్లు వేస్తాడు అవినాష్. ఆమెకు పెళ్లయి ఒక హజ్బెండ్ ఉన్నారని శ్రీముఖి చెబుతాడు. పెళ్లయితే ఒక హజ్బెండే ఉంటారు ఎవరికైనా అని పంచ్ విసురుతుంది హరితేజ. దాంతో అందరూ నవ్వేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుండగా.. ఈ తోబుట్టువుల అల్లరి చూడాలంటే ఈ ఆదివారం ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం చూసేయాల్సిందే.

Read more about: avinash sreemukhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X