శ్రీముఖితో కొరియోగ్రాఫర్ అసభ్య ప్రవర్తన.. వదిలేయమని వేడుకుంటున్నా...

స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వారం వారం సరికొత్త థీమ్‌తో బుల్లితెర సెలబ్రిటీల నుంచి ఫన్ రాబడుతున్నారు యాంకర్ శ్రీముఖి. ఎప్పటిలాగే ఈ వారం ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఈ వారం వెకేషన్ స్పెషల్ అనే థీమ్‌తో స్టార్ మా పరివారం రెడీ అయ్యిందని శ్రీముఖి ప్రకటించింది. ఈ వారం ఎపిసోడ్‌కి మ్యాడ్ ఫర్ ఈచ్ ఆదర్ కార్యక్రమంలో పాల్గొన్న జంటలను ఆహ్వానించింది శ్రీముఖి. ప్రియాంక జైన్ - శివకుమార్, వాసంతి కృష్ణన్ - పవన్ కళ్యాణ్, నూకరాజు- ఆసియా, సోనియా సింగ్ అమె పార్ట్‌నర్, నటరాజ్ మాస్టర్- నీతూ నటరాజ్‌లు ఈ షోకు హాజరయ్యారు. తొలుత నూకరాజు షర్ట్ బటన్స్ విప్పడంతో ఎందుకు అన్నీ గుండీలు విప్పావని అడుగుతాడు ఎక్స్‌ప్రెస్ హరి. అక్కడ విన్నర్ రెండు విప్పితే.. రన్నర్ మూడు విప్పుతానని నూకరాజు నవ్వించాడు.

Adivaram With Star Maa Parivaram Promo Creates Fun Moments With Celebrity Couples

వాళ్లకి ముగ్గురు పిల్లలున్నారని సోనియా గురించి శ్రీముఖి చెప్పగా.. ఏం పేరు పెట్టారని అవినాష్ అడుగుతాడు. మోగ్లీ ఒకటి, పార్వతి ఒకటి.. వాటిలో ఒకటి పిల్లి, ఇంకొకటి కుక్క అని సోనియా చెప్పడంతో అవినాష్ షాక్ అవుతాడు. ఆ వెంటనే నటరాజ్ మాస్టర్‌ను అతని భార్య ముందే హగ్ చేసుకుంటుంది శ్రీముఖి. అయితే ఎంతకీ వదలకపోవడంతో మాస్టర్ వదిలేయండి అంటూ కేకలు పెడుతుంది రాములమ్మ. ఇది చూసి అంతా నవ్వేస్తారు. అనంతరం తమ భార్యలను మోసుకుంటూ మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడాలని టాస్క్ ఇస్తుంది శ్రీముఖి. ఈ వారం పరివారంలో ఆడి ఎవరైతే ఎక్కువ పాయింట్స్ గెలుచుకుంటారో వాళ్లని ఆగ్ర, తాజ్‌మహల్‌కి పంపిస్తామని ఆఫర్ ఇచ్చింది శ్రీముఖి.

నిన్న వదిలిన మరో ప్రోమోలో భర్తలను ఓ కొయ్యకి కట్టేసి భార్యల చేతికి కర్రలు ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది శ్రీముఖి. వీటిలో తప్పు చెబితే కర్రలతో కొట్టమని చెబుతుంది. ముందుగా నా పార్ట్‌నర్ నాకు తెలియకుండా అప్పుడప్పుడు ఫోన్ చెక్ చేస్తుంటాడని అడుగుతుంది. దాంతో తన పార్ట్‌‌నర్‌ని లాగిపెట్టి కొడతారు ప్రియాంక, మరో అమ్మాయి. మీ పార్ట్‌నర్ వేరే అమ్మాయి ఫోటోని లైక్ చేయడం లాంటివి చేశాడా అని శ్రీముఖి అడగ్గా.. నూకరాజును కొడుతుంది ఆసియా.

శ్రీముఖి కూడా కర్ర తీసుకుని బాదుతుంది. లాస్ట్ టైం నువ్వు నాకు మెసేజ్ చేశావు అందుకే కొడుతున్నా అంటుంది శ్రీముఖి. నేనేం మెసేజ్ చేశాను అని అడుగుతాడు నూకరాజు. హాయ్ అక్కా బాగున్నావా? అని అడిగావు అది కూడా తప్పేనని చెబుతుంది శ్రీముఖి. తనకి ఫుడ్ పెట్టకుండా ఫస్ట్ పెట్స్‌కి ఫుడ్ పెట్టినా అలుగుతాడు, వాష్‌రూమ్‌కి ఫోన్ తీసుకెళ్లి అస్సలు బయటికి రాడని సోనియా సింగ్ చెప్పడంతో అందరూ కలిసి ఆమె పార్ట్‌నర్‌ని చితకబాదుతారు.

పొద్దున్నే ప్రియాంకని లేపాలంటే నాకు భయం.. ఎందుకంటే నన్ను తిడుతుందని శివకుమార్ చెప్పడంతో అతనిని కొట్టబోతున్న ప్రియాంకపై స్ప్రే చేస్తాడు. మధ్యలో వచ్చిన అవినాష్‌పై స్ప్రే చేసి ఆటపట్టిస్తుంది శ్రీముఖి. ప్రస్తుతం ఆ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ వారం ఎవరు గెలిచి ఆగ్రా, తాజ్ మహల్ ట్రిప్‌కి వెళ్లే ఛాన్స్ కొట్టేశారు? జంటల మధ్య ఎలాంటి ఫన్నీ ఇన్సిడెంట్ జరిగాయి తెలుసుకోవాలంటే జూన్ 7వ తేదీ ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో చూసేయాల్సిందే.

Read more about: sreemukhi nataraj master
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X