పెళ్లైన వారి నుంచే మ్యారేజ్ ప్రపోజల్.. ఆమె వల్లే ఈ సమస్య.. అడవి శేష్ హాట్ కామెంట్
హీరోగా అడవి శేష్ అందరికీ సుపరిచితం.. ప్రస్తుతం ఆయన మేజర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ముంబై ఎటాక్స్ లో అసువులు బాసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో జూన్ 3వ తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక తాజాగా ఆలీతో సరదాగా షో లో పాల్గొన్న అడివి శేష్ తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

'మేజర్'గా ప్రేక్షకుల ముందుకు
అడివి శేష్ హీరోగా గూడచారి దర్శకుడు శశికిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం మేజర్. 26/ 11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ లో అనేకమంది రక్షణ శాఖ అధికారులు కన్ను మూసారు. వారిలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు. కేరళకు చెందిన ఆయన జీవిత కథను ఆధారంగా చేసుకుని మేజర్ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, రేవతి, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

సన్నీ లియోన్ దెబ్బకు
ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలీతో సరదాగా షో లో పాల్గొన్న అడివి శేష్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ అసలు పేరు సన్నీ అంట కదా అని అడిగితే అవును అని తన అసలు పేరు అడవి సన్నీ చంద్ర అని, అయితే ఆ రోజుల్లో సన్నీలియోన్ వీడియోస్ బాగా ఫేమస్ అయ్యాయి, ఈ క్రమంలోని తన స్నేహితులు అందరూ తనను సన్నీ లియోన్ అని ఏడిపించే వాళ్ళని అది తట్టుకోలేక తాను సన్నీ చంద్ర కాస్త శేష్ గా మార్చుకున్నారని చెప్పుకొచ్చాడు.

వెన్నుముకలా
ఇక 26/ 11 టెర్రరిస్ట్ ఎటాక్స్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎలాంటి త్యాగం చేసి చనిపోయాడో చాలా మందికి తెలుసు కానీ ఆయన ఎలా బతికారు అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాము అని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు వద్దకు ఈ సినిమా కథ తీసుకెళ్లినప్పుడు నుంచి సినిమాకు ఆయన వెన్నెముకలా నిలిచారని శేష్ వెల్లడించారు.

అందుకే వచ్చేసా
తన తండ్రిది నరసాపురం అని తల్లిది నల్గొండ అని పేర్కొన్న ఆయన చిన్నప్పటి నుంచి హైదరాబాదులోని పెరిగానని పై చదువుల కోసం అమెరికా వెళ్లాను అని అన్నారు. అక్కడే నటుడిగా మారాలనే కోరిక బలంగా ఉన్నా ఇండియన్ యాక్టర్స్ అక్కడ హీరోలు అవ్వలేరని చిన్న చిన్న పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుందని కారణంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను అని అన్నారు.

మొగుళ్ళను వదిలేస్తామంటున్నారు
ఇక చందమామ సినిమాలో మొదట నవదీప్ పాత్ర కోసం తననే తీసుకున్నారని అయితే క్యారెక్టర్ సెట్ కాకపోవడంతో ప్రాజెక్టు ఆగిపోయిందని తరువాత నవదీప్ దొరకడంతో మళ్లీ మొదలు పెట్టారు అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా మీరు ఇంత అందంగా ఉన్నారు కదా ఎవరు మీకు ప్రపోజ్ చేయలేదా అని అడిగితే పెళ్లయిన వాళ్లు కూడా మమ్మల్ని ఒప్పుకో, మా మొగుడ్ని వదిలేసి వచ్చేస్తానని ప్రపోజ్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శేష్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











