For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ సుమకు హ్యాండిచ్చిన తెలుగు హీరో: ఈవెంట్‌కు పిలిచి పరువు తీయడంతో గొడవ

  |

  ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల జోనర్లలో కార్యక్రమాలు వస్తున్నాయి. అయితే, అందులో అన్ని షోలు మాత్రమే ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నాయి. అలాంటి వాటిలో సుమ కనకాల యాంకర్‌గా చేస్తున్న క్యాష్ ఒకటి. సినీ, బుల్లితెర సెలెబ్రిటీలతో సందడి సందడిగా సాగే ఈ షోకు ఆదరణ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. దీంతో నిర్వహకులు ప్రతి ఎపిసోడ్‌కు చాలా మంది ప్రముఖులను తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ షోలో యాంకర్ సుమకు టాలీవుడ్ యంగ్ హీరో కోలుకోలేని షాక్ ఇచ్చాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  సూపర్ సక్సెస్‌ఫుల్‌గా క్యాష్ షో

  సూపర్ సక్సెస్‌ఫుల్‌గా క్యాష్ షో

  సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న క్యాష్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా నడుస్తూ ఉంటుంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇక, ఈ కార్యక్రమాన్ని లెజెండరీ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  బెడ్‌పై బ్రాతో అషు రెడ్డి రచ్చ: ఏకంగా అవి చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

  Recommended Video

  Anchor Suma జీవితం లోని ఆసక్తికర విషయాలు | HBD Anchor Suma || Filmibeat Telugu
  ఆమె వల్లే దీనికి మరింత క్రేజ్

  ఆమె వల్లే దీనికి మరింత క్రేజ్


  సుదీర్ఘమైన కెరీర్‌లో యాంకర్ సుమ ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో ‘క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ చుక్కలు చూపిస్తూ క్రేజ్ పెంచింది.

  వచ్చే వారం మేజర్ యూనిట్

  వచ్చే వారం మేజర్ యూనిట్


  వచ్చే శనివారం ప్రసారం కానున్న ‘క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ‘మేజర్' మూవీ యూనిట్ సభ్యులు అడివి శేష్, శశి కిరణ్ తిక్కా, శ్రీచరణ్ పాకాల, గీతా భగత్‌లు వచ్చారు. వీళ్లతో సుమ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఇందులో కొందరిని ఈ సీనియర్ యాంకర్ తనదైన శైలి టైమింగ్‌తో ఉక్కిరిబిక్కిరి చేసేసింది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో హీరోయిన్ హాట్ ట్రీట్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  సుమకే పంచ్‌లు.. అదిరింది

  సుమకే పంచ్‌లు.. అదిరింది

  సాదారణంగా క్యాష్ షోలో వచ్చిన సెలెబ్రిటీలకు యాంకర్ సుమ కనకాల పంచ్‌లు వేస్తూ ఆట పట్టిస్తుంటుంది. ఆమె దెబ్బకు అందరూ బిత్తరపోతుంటారు. అయితే, తాజాగా విడుదలైన ప్రోమోలో సెలెబ్రిటీలే ఈ యాంకరమ్మకు చుక్కలు చూపించారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తనదైన శైలి పంచులతో ఆమెకు నోట మాట రానీయకుండా చేయగలిగాడు.

  హీరో ఆమెతో.. శశి సుమతోనే

  హీరో ఆమెతో.. శశి సుమతోనే

  వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న ‘క్యాష్' షోలో భాగంగా మేజర్ చిత్ర యూనిట్ ఫన్సీ స్కిట్ చేసింది. ఇందులో భాగంగా హీరో అడివి శేష్ సినిమా ఫంక్షన్ కోసం గీతా భగత్‌ను హోస్ట్ చేయాలని అడుగుతాడు. కానీ, డైరెక్టర్ మాత్రం దీనికి సుమను యాంకర్‌గా చేయమని కోరుతాడు. ఆ సమయంలో వీళ్లు చేసిన యాక్టింగ్‌కు ఓ రేంజ్‌లో నవ్వులు కనిపించి, వినిపించాయి.

  హీరోయిన్ హాట్ వీడియో షేర్ చేసిన వర్మ: ఈ టైమ్‌లో ఆ సౌండ్స్ బాగుంటాయి అంటూ!

  పరువు పాయే.. ఆమెతో గొడవ

  స్కిట్‌లో భాగంగా హీరో మాట ప్రకారం గీతా భగత్, డైరెక్టర్ పిలుపు మేరకు సుమ ‘మేజర్' ఫంక్షన్‌కు హోస్ట్ చేయడానికి వస్తారు. అప్పుడు ఒకరిని చూసి ఒకరు షాక్ అవుతారు. ఆ సమయంలో ఇద్దరికీ అసలు విషయం తెలుస్తుంది. దీంతో నేను హోస్ట్ చేస్తానంటే నేను చేస్తా అంటూ గొడవ పడుతుంటారు. ఈ స్కిట్ మొత్తం ఎంతో ఫన్నీగా సాగడంతో అంతా ఖుషీ అయిపోయారు.

  సరికొత్త ఆట... ఫన్నే ఫన్ను

  సరికొత్త ఆట... ఫన్నే ఫన్ను


  ‘క్యాష్' షోలో భాగంగా సెలెబ్రిటీలను ఇబ్బంది పెట్టేందుకు సుమ కొన్ని ఆటలు ఆడిస్తుంది. ఇందులో భాగంగానే మేజర్ యూనిట్‌తో తన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఉండాలంటే టాస్కులు ఆడాలని చెప్పింది. కానీ, ఇందులో అందరూ ఫెయిల్ అయ్యారు. కాదు కాదు.. సుమనే తనదైన శైలి టాస్కులతో అందరూ ఓడిపోయేలా చేసింది. దీంతో ఈ ప్రోమో హైలైట్ అయింది.

  English summary
  Adivi Sesh, Sashi Kiran Tikka, Sricharan Pakala, Geetha Bhagath participated in Anchor Suma Cash Show Upcoming Episode. Adivi Sesh Shocks Anchor Suma in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X