14 ఏళ్ల తర్వాత స్టార్ హీరోయిన్ తో శివాజీ.. బిగ్ బాస్ తర్వాత అలాంటి కాంబో!
అట్లీస్ట్ చిన్న పాత్రల్లో అయినా సినిమాలలో కనిపించవచ్చు కదా అని ఫీల్ అయ్యే వారు చాలా మందే ఉంటారు. కానీ కొన్ని అనుభూతులు అలానే మిగిలిపోతాయి. మరి ఇలా కొందరు పాత నటీనటులు మళ్ళీ ఇపుడు సినిమాలు చేస్తే కనీసం కొంతంది అయినా చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి కాంబినేషన్ ఒకటి చాలా కాలం తర్వాత స్క్రీన్ ని షేర్ చేసుకోనున్నట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి.
కాగా ఆ నటీనటులు ఎవరో కాదట. నటుడు శివాజీ అలాగే నటి లయ అట. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "మిస్సమ్మ" సినిమా చాలా మందికి గుర్తుండి ఉంటుంది. అందులో భూమిక కూడా కనిపించింది. మరి అప్పట్లో వీరి కాంబినేషన్ సినిమా హిట్ కాగా ఆ తర్వాత మళ్ళీ లయ అలాగే శివాజీలు ఒకే సినిమాకి వర్క్ చేశారు. మరి ఆ సినిమానే బ్రహ్మలోకం టు భూలోకం వయా భూలోకం సినిమాలో పని చేసారు.

ఇది 2010 లో రాగా మరి మళ్ళీ ఇన్నేళ్లకి 14 ఏళ్ల తర్వాత కలిసి వర్క్చయనుండడం డెఫినెట్ గా వింటేజ్ మూవీ లవర్స్ కి ఒక నోస్టాలిజిక్ అనుభవమే అని చెప్పాలి. కాగా వీరి కాంబినేషన్ లో ఇప్పుడొక చక్కని సినిమా కుదిరినట్టుగా తెలుస్తుంది. దీనిని దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించనున్నారట. మరి శివాజీ చాలా కాలం తర్వాత లైమ్ లైట్ లోకి వచ్చింది తెలుగు స్మాల్ స్క్రీన్ రియాలిటీ షో బిగ్ బాస్ తోనే అని తెలిసిందే.
పోస్ట్ బిగ్ బాస్ 7 తన నుంచి ఎలాంటి సినిమాలు రాలేదు. కానీ అంతకు ముందే చేసిన వెబ్ సిరీస్ 90స్ బయోపిక్ మాత్రం మంచి హిట్ అయ్యింది. మరి బిగ్ బాస్ తర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నప్పటికీ కూడా శివాజీ అయితే మంచి ప్లానింగ్ తోనే వస్తున్నారని చెప్పాలి. ఆల్రెడీ శివాజీ, లయ జంటకి మంచి ఫేమ్ ఉంది.

మరి సినిమా ఎలాంటిది ఎంచుకొని వస్తున్నారో చూడాలి. ఒకవేళ మంచి సబ్జెక్టు అయితే ఇద్దరికీ అది సినిమాలో మంచి కం బ్యాక్ గా కూడా నిలవొచ్చు. కాగా లయ అయితే తన సినిమా కెరీర్ ని పక్కన పెట్టి యూఎస్ లో సెటిల్ అయ్యింది కానీ తర్వాత మళ్ళీ రీల్స్ తో ఫేమ్ లోకి వచ్చింది. ఇపుడు శివాజితో సినిమా మాత్రమే కాకుండా నితిన్ నటిస్తున్న "తమ్ముడు" సినిమాలో కూడా ఈమె కీలక పాత్ర పోషిస్తుంది.


Click it and Unblock the Notifications











