Bigg Boss Telugu 7: ఆ కంటెస్టెంట్ దెబ్బకు తగ్గుతున్న శివాజీ గ్రాఫ్... ఉల్టాపుల్టాగా మారిన టైటిల్ విన్నర్!

బిగ్ బాస్ తెలుగు 7 ముగింపు దశకు చేరుకుంటుంది. ఇంకో మూడు వారాల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డు పడనుంది.ఇక 13వ వారం నామినేషన్స్ కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్కులు జరుగుతున్నాయి. అయితే మొదటి నుంచి టాప్ లో ఉండే శివాజీ ఈ మధ్య ఆయన గ్రాఫ్ పడుతూ వస్తుంది. దానికి కారణం ఆయన చేసే పనులు.. కన్నింగ్ గేమ్. ఇవన్నీ జనాలు చూస్తునే ఉన్నారు. రోజు రోజుకు శివాజీ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. ఇక టైటిల్ విన్నర్ లెక్కలు కూడా మారిపోతున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఇక మరో 3 వారాల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. డిసెంబర్ 17 ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ వేడుక జరగనుంది. ఇక ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగిసింది. నామినేషన్స్ లో అమర్ దీప్ తప్ప... శివాజీ, యావర్, ప్రశాంత్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఉన్నారు.

After Amardeep Effect Sivajis graph goes down day by day in Bigg Boss Telugu 7 Full Detail Here

ఇక ఈ వారం డేంజర్ జోన్ లో అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. ఇక శివాజీ ఎప్పుడూ టాప్ లో ఉండే వారు. ఎప్పుడు ఓటింగ్ మొదలు అయినా... ఏ సర్వేలో అయినా టాప్ లో శివాజీ ఉండే వాడు. ఆయన సీనియర్ హీరో. ఎన్నో సినిమాల్లో తన యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. జనాలకు బాగా తెలుసు. అంతే కాదు.. టీడీపీ ఫ్యాన్స్.. అంటు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆయనకే సపోర్టు.

ఇంత సపోర్టు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో శివాజీ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. దానికి కారణం ఆయన చేసే పనులు. మొదటి నుంచి శివాజీ మైండ్ గేమ్ ఆడుతూ కనిపించాడు. చాలా కాలానికి అది కన్నింగ్ గేమ్ అర్థం అయింది. ముఖ్యంగా అమర్ దీప్ పైన తన కుల్లును చూపిస్తూ.. ప్రేక్షకులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఎంత బిగ్ బాస్ కవర్ చేసినా... ఆడియోన్స్ మాత్రం డిస్ని ప్లస్ హాట్ ఓటీటీ లైవ్ స్ట్రీమింగ్ లో చూస్తునే ఉన్నారు.

After Amardeep Effect Sivajis graph goes down day by day in Bigg Boss Telugu 7 Full Detail Here

శివాజీకి సంబంధించిన ఎన్నో వీడియోలు వైరల్ అవుతునే ఉన్నాయి. ఆయన కన్నింగ్ గేమ్ కు సంబంధించిన వీడియోలు.. అమర్ పై చూపించిన ద్వేషం.. ఇవన్నీ ట్రోల్ అవుతున్నాయి. బిగ్ బాస్ శివాజీ గ్రాఫ్ పెంచడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడని ఆడియెన్స్ కు కూడా అర్థం అవుతుంది. ముఖ్యంగా అమర్ కెప్టెన్సీ టాస్కులో చేసిన శివాజీ హంగామా నెగిటివిటీ తీసుకువచ్చింది. దాన్ని కవర్ చేయడానికి హ్యాండ్ పెయిన్ అంటూ స్టార్ట్ చేశాడు శివాజీ.

అంతేనా బిగ్ బాస్ కూడా అమర్ కు నెగిటివిటి తీసుకువచ్చేందుకు.. రెండో వారం వీడియో ప్లే చేసి చూపించాడు. మరి శివాజీ ఎన్నో తప్పులు చేశాడు.. ఆ వీడియోలు ఎందుకు ప్లే చేయలేదని బిగ్ బాస్ ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. నీకు నచ్చిన వాడిని హైప్ చేసుకునేందుకు ఈ రియాలిటీ షో ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం శివాజీ టాప్ 2లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X