Bigg Boss Telugu 7: గౌతమ్ ఎలిమినేషన్ తర్వాత.. బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటీ షో రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో... మరో 2 వారాల్లో ముగియనుంది. డిసెంబర్ 17న ఈ షో గ్రాండ్ ఫినాలే జరుపనున్నారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. గతవారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ తర్వాత 7 మంది కంటెస్టెంట్స్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు.. ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయి.. ఆసక్తిగా కొనసాగుతోంది. ఇక ఈ షో రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ ఇస్తుంది. ఇక ఈషోలో ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి ఉన్నారు. ఇక గత వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగిన సంగతి తెలిసిందే. గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ చేస్తూ.. ప్రేక్షకులకు షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.

After Gautham Krishna Elimination Top 5 Contestants List Here: Bigg Boss Telugu 7 Full Details Here

ఫస్ట్ ఫైనాలిస్టుగా అర్జున్ అంబటి ఎంపిక అయిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది 6 మంది కంటెస్టెంట్స్. వీరిలో టాప్ 5 కి ఎవరు వెళ్లానున్నారు అనేది ఉత్కంఠగా మారింది. టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్టులో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్ పక్కగా ఉంటారు. వీరు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఒక్క అర్జున్ తప్ప ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అయితే అర్జున్ కి కూడా ఓటింగ్ వేసుకోవచ్చని బిగ్ బాస్ చెప్పుకువచ్చాడు.

After Gautham Krishna Elimination Top 5 Contestants List Here: Bigg Boss Telugu 7 Full Details Here

ఇక ఓటింగ్ ప్రకారం చూస్తే... అన్ని ఓటింగ్స్ లో ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ టాప్ ఉంటున్నారు. 100 పర్సెంట్ ఓటింగ్ లో వీరికే 85శాతం ఓటింగ్ నమోదు అవుతుంది. వీరు టాప్ 3లో నిలుస్తారని తెలుస్తోంది. ఇక టాప్ 4 అండ్ టాప్ 5 ఎవరు అనేది చూసుకుంటే.. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒక లేడీ కంటెస్టెంట్ ఉండాలి కాబట్టి.. ప్రియాంక టాప్ 5లో ఉండనుందని తెలుస్తోంది. ఇక యావర్, శోభా ఈ రెండు వారాల్లో ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది.

After Gautham Krishna Elimination Top 5 Contestants List Here: Bigg Boss Telugu 7 Full Details Here

ఇక ఈ వారం ఒకరి ఎలిమినేషన్.. మిడ్ వీక్ లో మరోకరి ఎలిమినేషన్ ఉండనుందని బిగ్ బాస్ వర్గాల సమాచారం. శోభాను గత కొన్ని వారాలుగా కాపాడుకుంటూ వస్తున్న బిగ్ బాస్.. ఈసారి ఎలిమినేట్ పక్కా అవుతుందని అంటున్నారు. ఓటింగ్ ప్రకారం చూసుకున్న టాప్ 7లో శోభా శెట్టి ఉంది. ఒకవేళ ఈ బ్యూటీ ఎలిమినేట్ కాకపోతే.. నెటిజన్స్ మరోసారి దుమ్మెత్తి పోయడం ఖాయమని తెలుస్తోంది.

ఇక యావర్ గేమ్ ట్రాక్ తప్పడంతో.. మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే అర్జున్ అంబటిని కూడా మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఇక గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న టాప్ 3లో ఎవరో ఒకరు విజేత కానున్నారు. అయితే ఈ సారి రైతు బిడ్డ ప్రశాంత్ విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి ఇక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X