నువ్వు పోతావ్ రా .. మణికంఠకు గంగవ్వ శాపనార్ధాలు, హౌస్‌లో షాకింగ్ ఇన్సిడెంట్
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా ఏడో వారంలోకి ప్రవేశించింది. అప్పుడే మూడు రోజులు గడిచిపోగా త్వరలోనే మరొకరు హౌస్‌ను వీడి వెళ్లనున్నారు. సోమ, మంగళవారాల్లో జరిగిన ఈ వీక్ నామినేషన్స్ మోతెక్కిపోయాయి. ముఖ్యంగా అవినాష్ - పృథ్వీ, హరితేజ - యష్మిల మధ్య జరిగిన గొడవ హైలైట్‌గా నిలిచింది. నామినేషన్స్ పూర్తవ్వగానే కంటెస్టెంట్స్ చిల్ అయ్యారు.. ఒకరిపై మరొకరు జోక్స్ వేసుకుంటూ గడిపారు. ఈ వివరాల్లోకి వెళితే..
కిర్రాక్ సీత ఎలిమినేట్ అయ్యాక ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్‌లో ఏడుగురు మిగలగా.. వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రాయల్ క్లాన్‌లో 8 మంది కలిపి మొత్తం 15 మంది సభ్యులున్నారు. ఈ వారం నామినేషన్స్‌లో ఏకంగా 9 మంది నిలిచారు. వారు హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠ. తొలుత ముక్కు అవినాష్ నామినేషన్స్‌లో ఉన్నాడు. అయితే అతను తన వద్ద ఉన్న ఇమ్యూనిటీ షీల్డ్ వాడతానని చెప్పడంతో బిగ్‌బాస్ అందుకు ఓకే చెబుతాడు. కానీ నీకు బదులుగా రాయల్ క్లాన్‌లోని మరొకరిని నామినేషన్స్‌లో ఉంచాలని చెప్పడంతో హరితేజ పేరు చెబుతాడు. దాంతో ఆమె అనూహ్యంగా నామినేషన్స్‌లోకి వచ్చారు.

నామినేషన్స్ సందర్భంగా రోహిణి- గౌతమ్, అవినాష్- పృథ్వీ, హరితేజ- యష్మీ గౌడల మధ్య గొడవ జరిగింది. తనను అశ్వత్థామ 2.0 అని అవినాశ్ హేళన చేశారంటూ గౌతమ్ కృష్ణ కోప్పడటాన్ని పాయింట్‌గా తీసుకుని రోహిణి అతనిని నామినేట్ చేసింది. దీనికి గౌతమ్ డిఫెండ్ చేసుకుంటూ అది హేళన చేయడం కిందకే వస్తుందన్నాడు. నాకు నచ్చని పదాన్ని అదే పనిగా చెప్పడం గేలి కిందకే వస్తుందని రంకెలు వేశాడు.
మనం వచ్చింది బిగ్‌బాస్ షోకి అని.. ఇది కామెడీ షో కాదని గౌతమ్ అనడంతో అవినాశ్‌కి కోపం వచ్చింది. కామెడీ అంటే చీప్‌గా కనిపిస్తుందా.. షోకు రావొద్దంటూ తన జాకెట్ నేలకేసి కొట్టారు. సారీ బ్రదర్ అంటూ గౌతమ్ ముందు మోకాళ్ల మీద కూర్చొవడంతో ఇంటి సభ్యులు షాక్ అవుతారు. ఇక తనను రా, రేయ్ అనడంతో అవినాష్ సీరియస్ అవుతాడు. ఇద్దరు ఒకరిపై మరొకరు వెళ్లి కొట్టుకున్నంత పని చేయగా.. నిఖిల్ సహా అందరూ ఆపారు.
ఎలాగోలా నామినేషన్స్ గోల ముగియడంతో ఇంటి సభ్యులు రిలాక్స్ అయ్యారు. మన జబర్దస్త్ జంట అవినాష్, రోహిణిలు మరోసారి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. విష్ణుప్రియ వివరాలు కనుక్కొనే ప్రయత్నం చేసింది గంగవ్వ. మా నాన్న మీద ఎంత ప్రేమ ఉన్నా.. మా అమ్మ కోసం మాట్లాడలేదని చెప్పడంతో అంతా కంటతడి పెడతారు. మణికంఠ వచ్చి గంగవ్వతో డీలింగ్స్ చేసుకుంటానంటాడు.. ఈ వీక్ నేను సేవ్ అయితే బంగారు ముక్కుపుడక చేయిస్తానంటాడు. మరి నాకు బంగారు వడ్డాణం ఇస్తావా అని హరితేజ అడగ్గా.. తప్పకుండా బేగంబజారుకి తీసుకెళ్తానంటాడు.
After an intense nomination round, it's all fun and games in the Bigg Boss house! The contestants are back to enjoying light-hearted moments and creating memories together! 🤣🤣 #BiggBossTelugu8 #StarMaa #Nagarjuna @DisneyPlusHSTel @iamnagarjuna pic.twitter.com/cTNZL4Pn8K
— Starmaa (@StarMaa) October 16, 2024
నాకేం ఇస్తావని రోహిణి అడగ్గా.. ఓ ముద్దు ఇస్తానంటాడు. నువ్వు సేవ్ అయితే నాకెందుకు నీ ముద్దు అంటుంది రోహిణి. 9వ వారం నువ్వు హౌస్‌లో ఉండవని గంగవ్వ జోస్యం చెబుతుంది. నామినేషన్స్ నాడు జరిగిన ఘటనలను రోహిణి, టేస్టీ తేజా స్పూఫ్ మాదిరిగా చేసి చూపిస్తారు. నేను బుల్లీంగ్ చేసినట్లు నాకు చెప్పాలంటూ అవినాష్ యాక్ట్ చేస్తాడు. తర్వాత అవినాష్- పృథ్వీల గొడవని రోహిణి- గౌతమ్ చేసి చూపిస్తారు. దీంతో అంతా పగలబడి నవ్వుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











