అప్పుడు రమ్యకృష్ణ, ఇప్పుడు సమంత.. రెమ్యునరేషన్ ఎంత?

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ తెలుగు వారానికో ట్విస్ట్ తో ఊహించని విధంగా హైప్ క్రియేట్ చేస్తోంది. కరోనా కష్టకాలంలో చాలా రిస్క్ అయినప్పటికీ ఈజీగా మొదలైన షో ఇప్పుడు సగానికి చేరుకుంది. అయితే షోలో ఊహించని విధంగా గత ఏడాది లాగానే హోస్ట్ విషయంలో ఒక చేంజ్ చేయక తప్పలేదు. నాగార్జున షూటింగ్ వలన బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

దసరా స్పెషల్.. సమంత ఎంట్రీ

దసరా స్పెషల్.. సమంత ఎంట్రీ

ఇక రేపు దసరా సందర్భంగా 50వ ఎపిసోడ్ లో అక్కినేని కోడలు రానున్నట్లు ఒక స్పెషల్ ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సమంత హోస్ట్ గా సరికొత్తగా కనిపించబోతోంది. దీంతో ఒక్కసారిగా షోపై బజ్ పెరిగిపోయింది. అక్కినేని నాగార్జున బ్రేక్ ఇవ్వడంతో మళ్ళీ ఆయన కోడలే బాద్యత తీసుకోవడం వైరల్ గా మారింది.

 రమ్యకృష్ణ బాగానే రాబట్టింది

రమ్యకృష్ణ బాగానే రాబట్టింది

గత ఏడాది సీజన్ 3లో పాల్గొన్నప్పుడు నాగార్జున మన్మథుడు 2 వలన బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఒక వీకెండ్ లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్ బాధ్యతను తీసుకొని మంచి హైప్ క్రియేట్ చేసింది. అప్పుడు షోకి రేటింగ్ కూడా గట్టిగానే పెరిగింది. కేవలం రెండు ఎపిసోడ్స్ కోసం 15 నుంచి 17లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ వచ్చింది.

 నాగ్ టార్గెట్ సెట్ చేసుకోవడం వలన

నాగ్ టార్గెట్ సెట్ చేసుకోవడం వలన

ఇక ఇప్పుడు సమంత, మామ కోసం రాక తప్పలేదు. ఎందుకంటే నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ ని 21రోజుల్లో పూర్తి చేయాలని టార్గెట్ సెట్ చేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన కొండలు మళ్ళీ సెక్యూరిటీ నేపథ్యంలో క్లోజ్ చేస్తారు కాబట్టి తప్పక బిగ్ బాస్ కి బ్రేక్ ఇవ్వక తప్పడం లేదు. చూస్తుంటే నాగ్ మూడు వారాలు కనిపించేలా లేరని తెలుస్తోంది.

మొదట అభ్యంతరం చెప్పినప్పటికి..

మొదట అభ్యంతరం చెప్పినప్పటికి..

ఇందుకు నిర్వాహకులు కొంత అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. ఎందుకంటే షోకి ఈ మధ్య అసలే రేటింగ్ తక్కువగా ఉంది. కేవలం నాగార్జున వలన వీకెండ్ లోనే కొంత బూస్ట్ లభిస్తోంది. అయితే వేరే స్టార్స్ ని పెట్టుకుందాం అంటే మళ్ళీ వాళ్లతో ఖర్చుకు ఆందోళన చెందాల్సి వస్తోంది. ఏదేమైనా రెగ్యులర్ హోస్ట్ ఉంటేనే ఆ ఫ్లో మరోలా ఉంటుందని అనుకున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Jordar Sujatha Re Entry In Bigg Boss House
అలా సెట్ చేసిన నాగార్జున

అలా సెట్ చేసిన నాగార్జున

అయితే బిగ్ బాస్ యాజమాన్యాన్ని ఎలాగోలా ఒప్పించి రేటింగ్ విషయంలో తేడా రాకుండా స్టార్ హీరోయిన్ అయినటువంటి సమంతను రంగంలోకి తెచ్చాడు నాగార్జున. తనకు ఇచ్చే రెమ్యునరేషన్ ఇవ్వండి అంటూ లేదంటే నేను డీల్ చేస్తానని నాగ్ స్టార్ మాకు వివరణ ఇచ్చారట. అందుకు వాళ్ళు ఒప్పుకోవడంతో సమంత కూడా పెద్దగా అభ్యంతరం లేకుండా హోస్ట్ బాధ్యతను తీసుకుంది. మరి ఆమె ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X