Don't Miss!
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Finance
176 NFOs మ్యూచువల్ ఫండ్స్ రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Automobiles
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బ్రేకప్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్: ఆ ప్రేమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ పోస్ట్
షణ్ముఖ్ జస్వంత్.. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా చాలా కాలంగా ఈ కుర్రాడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాడు. తద్వారా కొన్ని లక్షల మంది అభిమానాన్ని సైతం సంపాదించుకున్నాడు. దీంతో బిగ్ సెలెబ్రిటీగా మారిపోయాడు. అదే సమయంలో బిగ్ బాస్ షోలోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. అయితే, అందులో అతడికి నిరాశే ఎదురైంది. ఆ వెంటనే దీప్తి సునైనా బ్రేకప్ ప్రకటించడంతో మరో షాక్ తగిలింది.
ఇలా వరుస దెబ్బలతో ఢీలా పడిపోయిన అతడి అభిమానులకు షణ్ముఖ్ జస్వంత్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పాడు. అంతేకాదు, మీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ పోస్ట్ చేశాడు. ఇంతకీ ఏంటా న్యూస్? పూర్తి వివరాలు మీకోసం!

సోషల్ స్టార్.. టైటిల్ ఫేవరెట్‌గా
తెలుగులో ఎవరికీ లేని విధంగా ఫాలోవర్లను సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. దీంతో అతడు సెన్సేషన్ అయిపోయాడు. అందుకే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో అవకాశం అందుకున్నాడు. ఇందులోకి 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో చాలా మంది ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. వీరిలో షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
ఊహించని ప్రశ్నతో అనసూయకు నెటిజన్ షాక్: మనిద్దరి మధ్య ఏం లేదంటూ యాంకర్ షాకింగ్ రిప్లై

బిగ్ బాస్‌లో రొమాన్స్‌తో కష్టాలు
బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి షణ్ముఖ్ జస్వంత్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడు సిరి హన్మంత్‌తో ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో అతడు ఫినాలేలో ఓడిపోవడంతో పాటు ప్రేమలో కూడా కష్టాలను ఎదుర్కొన్నాడు.

షణ్ముఖ్‌కు దీప్తి సునైనా బ్రేకప్
న్యూ ఇయర్ రోజు దీప్తి సునైనా సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ సుదీర్ఘమైన పోస్టును కూడా చేసింది. 'చాలా ఆలోచనలు, చర్చల తర్వాత షన్నూ, నేనూ పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇద్దరం వేరే వేరే దారుల్లో నడవబోతున్నాం' అంటూ ప్రియుడికి భారీ కోలుకోలేని షాక్‌ను ఇచ్చింది.
హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

బ్రేకప్ తర్వాత అతడి కామెంట్
దీప్తి సునైనా బ్రేకప్ ప్రకటించిన తర్వాత షణ్ముఖ్ జస్వంత్ కూడా స్పందించాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. తనకు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే హక్కు ఉంది. ఆల్ ది బెస్ట్ దీపు.. నీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశాడు. దీంతో వీళ్ల బంధం ముగిసిపోయిందని ఫ్యాన్స్ బాధగా ఉన్నారు.

మళ్లీ మొదలు పెడతానని పోస్ట్
ఒకవైపు బిగ్ బాస్ ఓటమితో పాటు ఇమేజ్ డ్యామేజ్ అవడం.. తర్వాత దీప్తి సునైనాతో బ్రేకప్ వంటి వాటితో షణ్ముఖ్ జస్వంత్‌కు వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అతడు 'త్వరలోనే కెమెరా ముందుకు రాబోతున్నా. మళ్లీ నా పనులతో బిజీ అవబోతున్నా. అదిరిపోయే ప్రకటన రాబోతుంది' అంటూ పోస్ట్ చేశాడు.
Bigg Boss OTT: షోలోకి టాలీవుడ్ కాంట్రవర్శీ కింగ్.. వామ్మో ఇక హౌస్‌లో కూడా రచ్చ రచ్చే

గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్
ముందుగా చెప్పిన దాని ప్రకారమే షణ్ముఖ్ జస్వంత్ గత రాత్రి తన ఫ్యూచర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటనను చేశాడు. అది అతడి కొత్త వెబ్ సిరీస్ గురించి. అవును.. ఈ సోషల్ మీడియా సెన్సేషన్ 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' అనే వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. దీన్ని సుబ్బు కే తెరకెక్కించబోతున్నాడు. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'సాఫ్ట్‌వేర్ డెవలపర్స్', 'సూర్య' చేశారు.

ప్రేమ కోసమే ఈ నిర్ణయం అని
ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను రివీల్ చేస్తూ షణ్ముఖ్ జస్వంత్ 'యూట్యూబ్‌లో నా నెక్ట్స్ వెబ్ సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్. సిరీస్ చూసినంత సేపు నా పేరు మీ మొహంలో ఉంటుంది. బిగ్ బాస్ తర్వాత ఏం ఆఫర్ వచ్చినా ముందు ఒక యూట్యూబ్ సిరీస్ చేయాలని అని ఉంది. మీరు నాకు ఇచ్చిన ప్రేమకు గుర్తుగా చేయాలని అనుకున్నాను. నవ్విస్తాం.. టెన్షన్స్ అన్నీ మరిచిపోయేలా నవ్విస్తాం' అని పేర్కొన్నాడు.