Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభమా లేదా అశుభమా ఎలా ఉంటుంది? ఏఏ రాశులకు ఎలా ఉంటుంది
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
షణ్ముఖ్ జస్వత్ ప్రపంచ రికార్డు: టాప్ 10లో రెండు స్థానాలు.. వామ్మో మనోడి క్రేజ్ ఈ రేంజ్‌లోనా!
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది సెన్సేషన్ అయిపోయారు. దీని ద్వారా తమలోని టాలెంట్లను బయట పెట్టుకుని ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఒకడు. తనదైన శైలి యాక్టింగ్, డ్యాన్సులతో కొన్ని లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్న షన్నూ.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం పరువు పోగొట్టుకున్నాడు.
అదే సమయంలో దీప్తి సునైనా కూడా అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించాడు. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ జస్వంత్ తాజాగా ప్రపంచ రికార్డును అందుకున్నాడు. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

భారీ ఫాలోయింగ్... టైటిల్ ఫేవరెట్
సోషల్ మీడియాలో షణ్ముఖ్ జస్వంత్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుని.. టాప్ యూట్యూబర్‌గా వెలుగొందుతోన్నాడు. దీంతో ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ ఐదో సీజన్లోకి అతడు కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులోకి టైటిల్ ఫేవరెట్‌గా అడుగు పెట్టిన ఈ కుర్రాడు.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించేలా మంచి గేమ్‌ను కూడా ఆడాడు.
మరోసారి రెచ్చిపోయిన యాంకర్ వర్షిణి: ముందు వెనుక మొత్తం చూపిస్తూ రచ్చ

రొమాన్స్‌తో కష్టాలు... అన్నీ అవుట్
బిగ్ బాస్ ఐదో సీజన్లో ఆటపరంగా మంచి పేరు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్.. సిరి హన్మంత్‌తో ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశాడు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయాడు. దీంతో అతడి ఇమేజ్ డ్యామేజ్ అవడంతో పాటు ఫినాలేలో ఓటమి పాలయ్యాడు.

షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పేసిన లవర్
షణ్ముఖ్ జస్వంత్‌తో చాలా కాలంగా ప్రేమాయణం సాగిసోన్న దీప్తి సునైనా సోషల్ మీడియా వేదికగా ఇటీవలే బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చాలా ఆలోచనలు, చర్చల తర్వాత షన్నూ, నేనూ పరస్పరంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇకపై ఇద్దరం వేరే వేరే దారుల్లో నడవబోతున్నాం' అంటూ ప్రకటించి అందరికీ షాకిచ్చింది.
హాట్ షోలో బౌండరీ దాటిన సరయు: లోపలి అందాలన్నీ కనిపించేలా బిగ్ బాస్ బ్యూటీ రచ్చ

సరికొత్తగా మొదలు.. ప్రకటించాడు
బిగ్ బాస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే తన ఫ్యూచర్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన చేశాడు. అది అతడి కొత్త వెబ్ సిరీస్ గురించి. ఈ సోషల్ మీడియా సెన్సేషన్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్' అనే వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. దీన్ని సుబ్బు కే తెరకెక్కించబోతున్నాడు. గతంలో వీళ్లిద్దరూ కలిసి ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్', ‘సూర్య' చేశారు.

షణ్ముఖ్ జస్వంత్ ప్రపంచ రికార్డు
షణ్ముఖ్ జస్వంత్‌కు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే అతగాడు బిగ్ బాస్‌లో ఫినాలే వరకూ నెట్టుకొచ్చాడు. అంతేకాదు, ఈ యంగ్ సెన్సేషన్ ఏది చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంది. అంతలా అతడి అభిమానులు సపోర్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ ట్విట్టర్లో ప్రపంచ రికార్డు కొట్టాడు. ఇది ఆలస్యంగా బయటకొచ్చింది.
Deepika Padukone: వింత డ్రెస్‌తో అందాల ఆరబోత.. మొన్న రొమాన్స్ ఇప్పుడు ఘోరంగా!

పదిలో రెండు స్థానాలు మనోడివే
షణ్ముఖ్ జస్వంత్ ఇటీవలే తన కొత్త వెబ్ సిరీస్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్'ను ప్రకటించాడు. ఆ సమయంలో ఈ కుర్రాడి అభిమానులు ట్విట్టర్లో వరుస ట్వీట్లతో సునామీ సృష్టించారు. దీంతో అతడి పేరిట ఉన్న రెండు హ్యాష్ ట్యాగ్స్ తెగ ట్రెండ్ అయ్యాయి. ఇవి ప్రపంచంలోనే టాప్ 10 ట్యాగ్స్‌లో స్థానం దక్కించుకున్నాయి. దీంతో షన్నూ అరుదైన రికార్డును నమోదు చేశాడు.

షేర్ చేసిన షన్నూ.. ఫుల్ ఖుషీగా
షణ్ముఖ్ జస్వంత్ కొత్త వెబ్ సిరీస్‌కు సంబంధించిన #AGENTANANDSANTOSH హ్యాష్ ట్యాగ్ ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. అలాగే, #Shannu అనే హ్యాష్ ట్యాగ్ ఎనిమిదో ర్యాంకులో ఉంది. ఇలా అతడు ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షణ్ముఖ్ స్వయంగా షేర్ చేశాడు. దీంతో అతడి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది.