Bigg Boss బిగ్‌బాస్ అగ్నిపరీక్ష.. 40 మంది తలరాత ఆ ముగ్గురి చేతుల్లో.. జియో హాట్‌స్టార్‌లో స్టీమింగ్ ఎప్పుడంటే?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభానికి అన్ని రకాలు హంగులు పూర్తవుతున్నాయి. కంటెస్టెంట్ల ఎంపికపై కసరత్తు జోరుగా సాగుతున్నది. అయితే ప్రతీ సీజన్‌లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చే బిగ్‌బాస్ తాజా సీజన్‌లో అగ్ని పరీక్ష పేరుతో కొత్తగా కామన్ మ్యాన్ ఎంపికకు తెర తీశారు. అయితే ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ అందర్నీ సర్‌ప్రైజ్ చేసేలా ఉండటంతో త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్స్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ అగ్ని పరీక్ష ఏమిటి? బిగ్‌బాస్ తెలుగు 9లో ఎలా భాగం కాబోతున్నది అనే వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ సీజన్ 9 సీజన్‌లో సెలబ్రిటీలతోపాటు కామన్ మ్యాన్ కూడా ఈ ఏడాది ఉంటారు అని ఎండెమాల్ షైన్ ఇండియా ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారిలో పెద్ద డిస్కషన్‌కి తెర తీసింది. దాంతో బిగ్‌బాస్ షోలో పాల్గొనాలనే సాధారణ ప్రజలు వేల మంది ఉత్సాహపడ్డారు. ఇటీవల 3 నిమిషాల వీడియోను చేసి పంపించమని అడిగితే.. వేలాది మంది పోటీకి సిద్దమయ్యారు. దాంతో అగ్నిపరీక్షను తీసుకొచ్చారు. త్వరలోనే వారి ఫైనల్ ఎంపిక గురించిన ప్రాసెస్‌ను నేరుగా ప్రేక్షకులకు చూపించబోతున్నారు.

వేలాది మంది పంపిన వీడియోల నుంచి 40 మందిని ఎంపిక చేశారు. ఆ 40 మంది నుంచి 5 గురు కామన్ మ్యాన్‌ను ఎంపిక చేస్తారు. ఈ 40 మందిని ఫిల్టర్ చేసే బాధ్యతను ముగ్గురు సెలబ్రిటీలకు అప్పగించారు. దాదాపు 15 రోజులపాటు సాగే ఎపిసోడ్స్‌లో ఎంపిక ప్రాసెస్‌ను ప్రసారం చేస్తారు. ఈ 40 మంది 'అగ్నిపరీక్ష'ని ఎదుర్కోబోతున్నారు.
కామన్ మ్యాన్‌కు సంబంధించిన 5 కంటెస్టెంట్ల ఎంపిక ఇప్పటికే మొదలైంది. మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. వారిని ఫిల్టర్ చేసే కార్యక్రమానికి అగ్ని పరీక్ష అనే టైటిల్‌తో ముగ్గురు జడ్జీలను ఓ షోను ప్రారంభించబోతున్నారు. బిగ్‌బాస్ విజేతలు అభిజిత్, బిందు మాధవి, బిగ్ బాస్ కంటెస్టెంట్ నవదీప్ న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ఈ షో ఆగస్టు 22వ తేదీ నుంచి జీయో హాట్ స్టార్‌లో ప్రారంభం కాబోతున్నది అని తెలిసింది.
అసలు కామన్ మ్యాన్ ఎంపికలో సాధారణ వ్యక్తులు ఎదుర్కొనబోయే అగ్నిపరీక్ష ఏమిటి? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది. న్యాయమూర్తులు ఎలాంటి కఠిన పరీక్షలు పెడతారు? హౌస్ మేట్స్ కావాలనుకుంటున్నవారి ఎంపిక ఎలా జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే ఈ 'అగ్నిపరీక్ష'ని చూడాల్సిందే. జియో హాట్‌స్టార్ లో మాత్రమే అందుబాటులో ఉండే ఈ 'అగ్నిపరీక్ష'ను ఎదుర్కొని 40 మంది నుంచి ఎవరు "బిగ్ బాస్ సీజన్ 9" హౌస్ లోకి వెళ్తారో.. చూద్దాం. అగ్నిపరీక్ష గురించి మరిన్ని వివరాల కోసం జియో హాట్ స్టార్ ఫాలో అవుతూ ఉండండి..
బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులకు స్టార్ మా అందిస్తున్న ఈ షో లో ఇప్పుడు తొమ్మిదో సీజన్ (బిగ్ బాస్ సీజన్ 9) ఎన్నో ప్రత్యేకతలతో సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఇవ్వాలనుకుంటున్న రిటర్న్ గిఫ్ట్‌తో హోస్ట్ నాగార్జున చేసిన ప్రోమో పెద్ద సంచలనమే సృష్టించింది. ఇంకా ఈ షో ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











