Bigg Boss NonStop: బిగ్ బాస్ ఓటీటీలో అడుగుపెట్టిన అజయ్ కుమార్ కతుర్వార్ ఎవరో తెలుసా?
ఇప్పటివరకు 5 సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న అతి పెద్ద తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఈ సారి కొత్త ఫార్మాట్ లో రాబోతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ వేదికగా వచ్చేసింది. నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ ఓటీటీ ఎట్టకేలకు మొదలైంది. గ్రాండ్ లాంచ్ ప్రసారం 26 ఫిబ్రవరి శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ సీజన్లో మొత్తం 18 మంది కంటెస్టెంట్ లు పాల్గొంటున్నారు. 85 జరిగే నాన్ స్టాప్ బిగ్బాస్ ఓటీటీ హంగామాలో కొత్త కంటెస్టెంట్ గా అజయ్ కుమార్ కర్తావూర్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన గురించి తెలియని విషయం తెలుసుకుందాం.

నాగార్జున గ్రాండ్ ఎంట్రీ
అందమైన అమ్మాయిలతో డ్యాన్స్ వేస్తూ.. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ముందుగా హౌస్ లోకి వచ్చి ప్రేక్షకుల హౌస్ ఎలా ఉంటుందో చూపించాడు. బిగ్ బాస్ హౌస్ మొత్తం తిరిగి చూస్తూ.. ఎక్కడ ఏమేమి ఉన్నాయి అనే విషయాలు ప్రేక్షకులకు వివరించారు నాగార్జున. ఆ తర్వాత ఈసారి వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ అనే పోటీ పెట్టనున్నారు బిగ్ బాస్.. వారియర్స్ అంటే గత సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్.. ఛాలెంజర్స్ అంటే కొత్తగా రానున్న కంటెస్టెంట్స్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పారు నాగ్.

ముందే ముగ్గురు
అలా ముందు అడుగుపెట్టిన అషు రెడ్డి.. పుష్ప సినిమాలో ఉ అంటావా మామ.. సాంగ్ తో అదరగొట్టింది. ఆ తర్వాత కింగ్ నాగార్జున బుగ్గ మీద ముద్దు పెట్టింది అషు రెడ్డి. రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ విట్టా. అలాగే మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ముమైత్ ఖాన్.. స్వతహాగా డ్యాన్సర్ అయిన ఆమె మరోసారి తన డాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఇక ఈసారి ఛాలెంజర్‌గా కొత్త కుర్రాడు అజయ్ ఎంట్రీ ఇచ్చాడు,

ఛాలెంజర్స్ లో ముందుగా
అజయ్ కుమార్ కతుర్వార్ తెలంగాణాలోని నిర్మల్‌లో జన్మించాడు, ఆయన వయస్సు 31 సంవత్సరాలు. ఇప్పటివరకు అజయ్ కుమార్ కతుర్వార్ మలయాళం, తెలుసు సినిమాల్లో నటుడిగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో మెహబూబా సినిమాలో నటించిన ఆయన విశ్వక్ అనే సినిమాలో కూడా హీరోగా నటించాడు.

హీరోగా నటిస్తూ
అలాగే ఆయన హీరోగా నటిస్తూ ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.. ఈ బిగ్ బాస్ ప్లాట్ ఫామ్ నాకు చాలా ప్లస్ అవుతుందని తెలిపాడు అజయ్.. సంకీగా ( మొండిగా )దూసుకుపోతా అని చెబుతూ అదే హ్యాష్ టాగ్ ను ఎంచుకున్నాడు అజయ్.

చాలా సినిమాల్లో నటించాడు కానీ
2018లో "మెహబూబా" సినిమాతో నటుడిగా పరిచయం అయిన అజయ్ ఆ మరుసటి సంవత్సరం, అతను "రాగల 24 గంటల్లో" చిత్రంలో కనిపించాడు. అజయ్ అలాంటి సిత్రాలు, రాగల 24 గంటల్లో స్నేహం, తప్పు, మెహబూబా, విశ్వక్ అనే సినిమాల్లో నటించారు. ఇక చూడాలి ఈ అజయ్ ఏమేరకు ప్రేక్షకులను అలరించనున్నారు అనేది.


Click it and Unblock the Notifications











