For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుమ షోలో యంగ్ హీరోకు అవమానం: మొబైల్ విసిరేసిన యాంకర్.. కోపంతో వెళ్లిపోయిన స్టార్ కిడ్

  |

  తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తుంటాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటున్నాయి. తద్వారా భారీ స్థాయిలో రేటింగ్‌ను కూడా దక్కించుకుంటున్నాయి. ఇలా సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుంటూ దూసుకుపోతోన్న షోలలో 'క్యాష్' ఒకటి. తెలుగు టాప్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తోన్న ఈ షోకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఇందులో ఆమె చేసే సందడే అని చెప్పొచ్చు. ఎంతో కాలంగా ఎలాంటి వివాదాలు లేకుండా సాగిపోతోన్న ఈ షోలో తాజాగా ఊహించని పరిణామం జరిగింది. ఓ యంగ్ హీరోకు అవమానం జరగడంతో షో నుంచి వెళ్లిపోయాడు. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  కామెడీ షోకు సమానంగా ఫన్

  కామెడీ షోకు సమానంగా ఫన్

  చాలా కాలంగా ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న క్యాష్ షో గురించి అందరికీ తెలిసిందే. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ తర్వాత అంతటి ప్రేక్షకాదరణను అందుకుంటోన్న షో ఇది. పేరుకు గేమ్ షోనే అయినా కామెడీ ప్రధానంగా రన్ అవుతోంది. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఇక, ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ అవడానికి దీనిని సుమ హోస్ట్ చేయడమే కారణం.

  బీచ్‌లో నిక్‌తో ప్రియాంక చోప్రా రొమాన్స్: వాళ్ల బట్టలు, ఫోజులు చూశారంటే!

  వచ్చిన సెలెబ్రిటీలకు దెబ్బ

  వచ్చిన సెలెబ్రిటీలకు దెబ్బ

  సుదీర్ఘమైన కెరీర్‌లో సుమ ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'క్యాష్' కూడా ఒకటని తెలిసిందే. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి సుమ చుక్కలు చూపిస్తూ ఫన్‌ను పంచుతోంది.

  వచ్చే వారం ఆ సినిమా టీమ్

  వచ్చే వారం ఆ సినిమా టీమ్

  వచ్చే శనివారం ప్రసారం కానున్న 'క్యాష్' ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో 'చోర్ బజార్' మూవీ టీమ్ నుంచి ఆకాశ్ పూరీ, గెహనా సిప్పీ, రచ్చ రవి, ఇమాన్యూయేల్ గెస్టులుగా వచ్చారు. వీళ్లతో సుమ తెగ సందడి చేసింది. మరీ ముఖ్యంగా ఇందులో కొందరిని ఈ సీనియర్ యాంకర్ తనదైన శైలి టైమింగ్‌తో ముప్పతిప్పలు పెట్టేసింది.

  జబర్ధస్త్ వర్ష అందాల ఆరబోత: ఉల్లిపొరలాంటి చీరలో అదిరిపోయే హాట్ ట్రీట్

  ఇమాన్యూయేల్ కామెడీ టైమ్

  ఇమాన్యూయేల్ కామెడీ టైమ్

  'క్యాష్' షోలో భాగంగా గెస్టులుగా వచ్చిన చోర్ బజార్ టీమ్ సభ్యులను సుమ ఓ ఆట ఆడించింది. అదే సమయంలో వాళ్లు కూడా ఆమెపై పంచులు పేల్చారు. మరీ ముఖ్యంగా ఇందులో జబర్ధస్త్ కమెడియన్ ఇమాన్యూయేల్ గే గా నటించిన తీరు తెగ నవ్వించింది. అంతేకాదు, అతడు హీరోయిన్‌కు డ్యాన్స్, హీరోకు యాక్టింగ్ నేర్పించిన తీరుకు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వు వచ్చింది.

  మొబైల్ విసిరేసిన యాంకర్

  మొబైల్ విసిరేసిన యాంకర్


  'క్యాష్' షోలో భాగంగా ఆకాశ్ పూరీకి హీరోయిన్‌తో సెల్ఫీ తీసుకునే టాస్క్ ఇచ్చింది. దీనికి రచ్చ రవి, ఇమాన్యూయేల్ బౌన్సర్లుగా చేశారు. ఆ సమయంలో ఆకాశ్‌.. గెహనాతో సెల్ఫీ తీసుకోకుండా వాళ్లిద్దరూ చూశారు. ఇక, చివర్లో సుమ వచ్చి సెల్ఫీ అనగానే ఇమాన్యూయేల్ 'పాపం ముసలావిడ సెల్ఫీ కోసం వెయిట్ చేస్తుంది' అన్నాడు. దీంతో సుమ అతడి ఫోన్‌ను కిందకు విసిరేసింది.

  హాట్ సెల్ఫీతో షాకిచ్చిన దేత్తడి హారిక: అసలు ఇది డ్రెస్సేనా.. చూస్తే అవాక్కవుతారు!

  ఆకాశ్ అలా.. గెహనా మాత్రం

  తాజాగా వచ్చిన ప్రోమోలో ఆకాశ్ పూరీకి హీరోయిన్ గెహనాకు ప్రపోజ్ చేసే టాస్కును ఇచ్చింది యాంకర్ సుమ. ఇందులో అతడు చక్కగా నటించాడు. కానీ, ఆమె మాత్రం దీనికి రెస్పాన్స్ అవనట్లు నటించింది. ఇక, గెహనాకు కూడా ఓ టాస్క్ ఇచ్చింది. ఇందులో గెలిస్తే తన ప్రశ్నకు జవాబు చెప్పక్కర్లేదని, గెలవకపోతే మాత్రం ఆన్సర్ చేయాలని సుమ కండీషన్ పెట్టింది.

  క్యాష్‌లో ఆకాశ్‌కు అవమానం

  క్యాష్‌లో ఆకాశ్‌కు అవమానం


  గెహనా సిప్పీకి సుమ ఇచ్చిన టాస్కులో ఓడిపోతుంది. దీంతో 'నీకు వీళ్లిద్దరిలో ఎవరితో చేయడం కంఫర్టుగా ఉంది' అని అడుగుతూ.. చోర్ బజార్ హీరో ఆకాశ్, డైరెక్టర్ జీవన్ రెడ్డి పేర్లు చెప్పింది. దీనికి గెహనా డైరెక్టర్‌ పేరును ఆన్సర్‌గా చెప్పింది. దీనికి హర్టైన ఆకాశ్ పూరీ షో నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Akash Puri, Gehna Sippy, Raccha Ravi and Immaneul in Anchor Suma Cash Show Upcoming Episode. Akash Puri Walkout from This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X